Noor Malabika Das: బాలీవుడ్ నటి నూర్ మాలబికా దాస్ (37) అనుమానాస్పద స్థితిలో మరణించింది. ముంబైలోని ఆమె నివాసంలో శవమై కనిపించింది. ఆమె ఫ్లాట్ నుంచి దుర్వాసన రావడంతో చుట్టుపక్కల వారు వచ్చి చూడటంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. అయితే ఈమె సుసైడ్ చేసుకుందని అనుమానిస్తున్నారు పోలీసులు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చేకంటే ముందు.. అస్సాంకు చెందిన ఈ నూర్ మాలబికా దాస్.. ఖతార్ ఎయిర్‌వేస్‌లో మాజీ ఎయిర్ హోస్టెస్ పనిచేసింది. ఆ తర్వాత సినిమాలపై ఆసక్తితో ముంబైకి వచ్చారు.
ముంబైలోని లోఖండ్‌వాలాలోని ఓ అపార్ట్‌మెంట్‌లో నివసించేవారు. సడన్ గా ఆమె ఫ్లాట్ నుంచి భరించలేని దుర్వాసన రావడంతో ఇరుగు పొరుగు ఈ సమాచారాన్ని పోలీసులకు తెలిపారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆమె ఫ్లాట్ కి వచ్చి చూడగా శవం కుళ్లిపోయిన స్థితిలో కనిపించిందట.
విచారణలో భాగం నూర్ ఇంటి నుంచి కొన్ని మందులు, మొబైల్ ఫోన్‌లను స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. కానీ ఎక్కడ కూడా సూసైడ్ నోట్ లభించలేదట దీంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అనంతరం పోస్టుమార్టం నిర్వహించారు. ఇదిలా ఉంటే నూర్ కు వృద్ధాప్య దశలో ఉన్న తల్లిదండ్రులు ఉన్నారట. ఈమె మృతదేహాన్ని తీసుకోవడానికి తల్లిదండ్రులకు ఫోన్ చేస్తే నిరాకరించారట. రీసెంట్ గానే వచ్చామని.. మళ్లీ రావడం కుదరదు అన్నారట.
తల్లిదండ్రులు నూర్ డెడ్ బాడీని తీసుకోవడానికి రాకపోవడంతో ఆమె స్నేహితుడు, నటుడు అలోక్‌నాథ్ పాఠక్ ఓ ఎన్‌జీవో సాయంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఇక నూర్ 2023 లీగల్ డ్రామా ‘ది ట్రయల్’ వెబ్ సిరీస్‌లో కాజోల్‌కి సహనటిగా నటించి మెప్పించింది. ఆ తర్వాత పలు వెబ్ షోల్లో నటించారు. ఈమె మరణంపై సమగ్ర విచారణ జరిపించాలని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే, హోం మంత్రి దేవేంద్ర ఫడణవీస్‌లను ‘ఆల్ ఇండియన్ సినీ వర్కర్స్ అసోసియేషన్’ కోరింది.