https://oktelugu.com/

టాటాకు చెందిన ఈ కారుపై రూ.1.35 లక్షల డిస్కౌంట్.. వెంటనే తెలుసుకోండి..

ఇదే కంపెనీకి చెందిన ఆల్ట్రోజ్ మోడల్ పెట్రోల్, డీజిల్ వేరయింట్లపై రూ.50 వేల ప్రయోజనాలు కల్పించనున్నారు. ఇందులో రూ.25 వేల నగదు డిస్కౌంట్, రూ.20 వేల ఎక్చేంజ్ బోజన్, రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ లబించనున్నాయి. సీఎన్ జీపై రూ.40 వేల వరకు ప్రయోజనాలు కలగనున్నాయి.

Written By:
  • Srinivas
  • , Updated On : June 12, 2024 / 12:08 PM IST

    Tata Cars Discounts

    Follow us on

    దేశంలో అగ్రగామిగా ఉన్న కార్ల కంపెనీల్లో టాటా ఒకటి. హ్యాచ్ బ్యాక్ నుంచి ఎస్ యూవీ వరకు వివిధ మోడళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్న ఈ కంపెనీ ఎస్ యూవీ కార్లతో ఆకర్షిస్తుంది. అయితే తాజాగా ఈ కంపెనీ పలు కార్లపై భారీ డిస్కౌంట్లను ప్రకటించారు. కొన్ని కార్లపై ఏకంగా రూ.1.35 లక్షల వరకు ప్రయోజనాలు కల్పించనున్నారు. ఈ ఆఫర్లు జూన్ నెల చివరి నాటికే వర్తిస్తుందని చెప్పారు. మరి టాటాకు చెందిన ఏ కార్లపై డిస్కౌంట్లు ఉన్నాయో చూద్దాం..

    టాటాకు చెందిన టియాగో ఎవర్ గ్రీన్ గా నిలుస్తుంది. హ్యాచ్ బ్యాక్ వేరింట్ లో బెస్ట్ కారుగా నిలిచిన ఈ కారు పెట్రోల్ వేరియంట్ పై రూ.60,000 తగ్గింపును ప్రకటించారు. ఇందులో క్యాష్ బ్యాక్ రూ.35,000, ఎక్చేంజ్ బోనస్ రూ.20,000, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.5,000 ఉన్నాయి. ఇదే మోడల్ సీఎన్ జీపై రూ.50 వేల వరకు ప్రయోజనాలు కల్పించారు. ఇందులో రూ.25,000 క్యాష్ బ్యాక్, రూ.20,000 ఎక్చేంజ్ బోనస్, రూ.5 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ప్రకటించారు. ప్రస్తుతం టియాగో రూ.5.6 లక్షల ప్రారంభ ధరతో విక్రయిస్తున్నారు.

    ఇదే కంపెనీకి చెందిన ఆల్ట్రోజ్ మోడల్ పెట్రోల్, డీజిల్ వేరయింట్లపై రూ.50 వేల ప్రయోజనాలు కల్పించనున్నారు. ఇందులో రూ.25 వేల నగదు డిస్కౌంట్, రూ.20 వేల ఎక్చేంజ్ బోజన్, రూ.5 వేల కార్పొరేట్ డిస్కౌంట్ లబించనున్నాయి. సీఎన్ జీపై రూ.40 వేల వరకు ప్రయోజనాలు కలగనున్నాయి. టాటా నుంచి బెస్ట్ మోడల్ అనిపించుకున్న నెక్సాన్ పై రూ.25 వేల ప్రయోజనం కలగనుంది. ఇందులో ఎక్చేంజ్ రూ.20 వేలు, రూ.5 వేలు కార్పొరేట్ డిస్కౌంట్ ప్రకటించారు. హారియర్, సఫారీ కార్లపై రూ.30 వేల వరకు తగ్గింపును ప్రకటించారు.

    పెట్రోల్, డీజిల్ మాత్రమే కాకుండా ఎలక్ట్రిక్ కార్లపై కూడా భారీ ప్రయోజనాలు కల్పించనున్నారు. టటా నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్ పై రూ.1.35 లక్షల ప్రయోజనాలు ఉండనున్నాయి. ఇందులో కొన్ని వేరియంట్లపై రూ.85 వేల నగదు డిస్కౌంట్ ఇవ్వనున్నారు. టియాగో ఈవీపై రూ.95 వేల వరకు డిస్కౌంట్ లభించనుంది. లాంగ్ రేంజ్ వేరియంట్ పై రూ.75 వేలు, మిడ్ రేంజ్ వేరియంట్ పై రూ.60 వేల వరకు డిస్కౌంట్లు లభించనున్నాయి. డిస్కౌంట్లు, క్యాస్ ప్రయోజనాలు ఆయా ప్రాంతాలను భట్టి ఉంటాయి.