SKN Producer: కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం ‘చెన్నై లవ్ స్టోరీ’ ఈ నెల 24 న ప్రపంచవ్యాప్తంగా భారీ లెవెల్ లో విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా మేకర్స్ ఎంత చురుగ్గా ప్రమోషన్స్ లో పాల్గొంటున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇంటర్వూస్ తో పాటు ఈవెంట్స్ కూడా ఏర్పాటు చేసి సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంతే కాకుండా రీసెంట్ గా విడుదల చేసిన ట్రైలర్ కి కూడా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ రావడంతో , కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అవుతుందనే నమ్మకం అందరిలోనూ కలిగింది. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో నిర్మాత SKN , హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియా మధ్య జరిగిన సరదా సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఈ సంభాషణలో ముందుగా హీరోయిన్ శ్రీ గౌరీ ప్రియా ని నిర్మాత SKN ఒక ప్రశ్న అడుగుతూ ‘మీకు బాగా ఇష్టమైన లవ్ స్టోరీస్ ఏంటి?’ అని అడుగుతాడు. అందుకు గౌరీ ప్రియా సమాధానం చెప్తూ ‘సఖి , సూర్య S/O కృష్ణన్ , 96’ పేర్లు చెప్తుంది. అప్పుడు పక్కనే ఉన్నటువంటి నిర్మాత SKN స్పందిస్తూ ‘అక్కడ అడిగింది మీకు ఇష్టమైన మూడు డబ్బింగ్ సినిమాల గురించి కాదు , మీకు బాగా ఇష్టమైన తెలుగు లవ్ స్టోరీ సినిమాల పేర్లు చెప్పమని అడిగారు’ అని అంటాడు SKN. పక్క భాషకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ సినిమాల గురించే గొప్పగా మాట్లాడుకుంటారు , ఇక మనం కూడా వాళ్ళ సినిమాల గురించే మాట్లాడుకుంటే , ఇంకెప్పుడు మనం పైకి ఎదుగుతాం అంటూ SKN సరదాగా నవ్వుతూ శ్రీ గౌరీ ప్రియా పై పంచులు విసిరారు.
ఇది సరదాగా సాగిన సంభాషణ అయినప్పటికీ SKN మాట్లాడిన మాటలు కచ్చితంగా అందరూ ఆలోచింపదగినవే. ఎందుకంటే గౌరీ ప్రియా మన తెలుగు రాష్ట్రాలకు చెందిన అమ్మాయి. అలాంటి అమ్మాయి మన ఇండస్ట్రీ లో ఎన్నో సూపర్ హిట్ కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీస్ ఉన్నప్పటికీ వాటి గురించి చెప్పకుండా, తమిళ డబ్బింగ్ సినిమాల గురించి మాట్లాడడం ఏంటి?. మన క్లాసిక్ లవ్ స్టోరీస్ ని వాళ్ళు అక్కడ అత్యధిక శాతం రీమేక్ చేసుకున్నారు. అలాంటి ఇండస్ట్రీ కి సంబంధించిన సినిమాల గురించి గౌరీ ప్రియా చెప్పడం ఏమాత్రం కరెక్ట్ గా లేదంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అయితే ఇదంతా స్క్రిప్ట్ ప్రకారం కావాలని క్రియేట్ చేసిన కంటెంట్ లాగా కనిపిస్తోంది. సినిమా టైటిల్ లోనే చెన్నై ఉండడం తో , హీరో కావాలని ఉద్దేశపూర్వకంగా ఆడియన్స్ కి కంటెంట్ ఇవ్వడం కోసం , సినిమా జనల నోర్లల్లో బాగా నానడం కోసం ఇలా సరదాగా ఇంటర్వ్యూ చేసి ఉండొచ్చని అంటున్నారు విశ్లేషకులు.








