Homeఅంతర్జాతీయంSatya Nadella Son Died: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన కొడుకును ఎందుకు కాపాడుకోలేకపోయారు!...

Satya Nadella Son Died: మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల తన కొడుకును ఎందుకు కాపాడుకోలేకపోయారు! కారణమిదీ!

Satya Nadella Son Died : మైక్రోసాఫ్ట్ సీఈవో సత్య నాదెళ్ల. మన అనంతపురం జిల్లాకు చెందిన ఈ ఇంజనీర్ ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ ‘మైక్రోసాఫ్ట్’కు సీఈవోగా వ్యవహరిస్తున్నారు. అంతటి దిగ్గజ కార్పొరేట్ లీడర్ ఇంట్లో తాజాగా పెను విషాదం అలుముకుంది. ఆయన కుమారుడు జైన్ నాదెళ్ల (26) కన్నుమూశారు.

Satya Nadella Son Died
Satya Nadella Son Died

సత్యనాదెళ్ల సంవత్సర జీతం 50 మిలియన్ డాలర్లు. అంటే భారత కరెన్సీలో ఏకంగా 376,51,25,000 కోట్లు. ఇన్ని వేల కోట్లు ఉన్నా కూడా ఆయన తన కొడుకును కాపాడుకోలేకపోయారు. కొడుకు కోసం ఏకంగా ఆ వ్యాధికి సంబంధించిన పరిశోధనలు, ఆవిష్కరణలు చేసేందుకు ఒక ఆస్పత్రిని కట్టించాడు.కొడుకు కోసం అత్యాధునిక వీల్ చైర్ ను రూపొందించారు. కానీ మరణాన్ని మాత్రం ఆపలేకపోయారు. కొడుకు ప్రాణాలు కాపాడుకునేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసినా పాపం.. అతడిని బతికించుకోలేకపోయారు.

సత్యనాదెళ్ల-అను దంపతులకు పెద్ద కుమారుడు జైన్ 1996లో జన్మించాడు. జైన్కు పుట్టుకతోనే సెరెబ్రల్ పాల్సీ వ్యాధి ఉంది. అప్పటి నుంచి అతడు వీల్ చైర్ కే పరిమితం అయ్యాడు. దీంతో సత్యనాదెళ్ల కుటుంబం ఎంతగానో కుంగిపోయింది. ఆ బాధను దిగమింగుకొని తన కొడుకు లాంటి వారి కోసం వినూత్న పరికరాలపై సత్య నాదెళ్ల దృష్టి సారించాడు. మైక్రోసాప్ట్ సీఈవో అయ్యాక అంగవైక్యం ఉన్న వారు కూడా సులువుగా ఉపయోగించేలా మైక్రోసాఫ్ట్ ఉత్పత్తుల్లో అనేక కొత్త మార్పులు తీసుకొచ్చారు.

Also Read: ఉక్రెయిన్ లో భార‌తీయ విద్యార్థినీలను ఎత్తుకెళుతున్న రష్యా సైనికులు?

-జైన్ నాదెళ్లకు అసలేమైంది?
సత్యనాదెళ్ల కుమారుడు ‘జైన్ నాదెళ్ల’ పుట్టుకతోనే కండరాలకు సంబంధించిన వ్యాధి (సెర్రిబ్రల్ పల్సీ)తో బాదపడుతున్నారు. జైన్ అమెరికా కాలమాన ప్రకారం సోమవారం ఉదయం ఆరోగ్యం విషమించి మరణించారు. సెర్రిబల్ పాల్సీ అనేది వ్యాధి కాదు.. ఇది ఒక శారీరక , మానసిక రుగ్మత. చిన్న పిల్లల్లో చాలా మంది ఈ వ్యాధితో బాధపడుతుంటారు. 1000 మంది పిల్లల్లో ఇద్దరు లేదా ముగ్గురికి ఈ వ్యాధి ఉంటుంది. చిన్నారులకు వికలాంగులకు ఈ వ్యాధి మార్చేస్తుంది.

సెరిబ్రల్ పాల్సీకి గురైన వారిలో మెదడు శాశ్వతంగా దెబ్బతింటుంది. అసాధారణమైన ఎదుగుదలతో ఈ సమస్య వస్తుంది.

గర్భం దాల్చిన సమయంలో ఏదైనా ఇన్ ఫెక్షన్ కారణంగా ప్రసవ సమయంలో శిశువు మెదడుకు గాయం కావడం.. గర్భంలోనే పిండదశలో మెదడు ఎదుగుదలలో లోపం వంటి కారణాలతో ఈ వ్యాధి బారినపడుతారు. జన్యు కారణాలు కూడా ఈ వ్యాధి రావడానికి కారణం. ఈ వ్యాధి వస్తే కండరాలపై నియంత్రణ కోల్పోయి వీల్ చైర్ కే పరిమితం అవుతారు.

Also Read: వివేకా హ‌త్య కేసులో ఇక వేగం పెర‌గ‌నుందా?

Recommended Video:

Bheemla Nayak 5th Day Total Collections | Bheemla Nayak Sensational Box Office Collections

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.
Exit mobile version