Rahul Sipligunj Engagement: తెలుగు సినిమా ఇండస్ట్రీలో దర్శకధీరుడి గా తనకంటూ ఒక ప్రత్యేక మైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ రాజమౌళి…ఆయన చేసిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథాంశం అయితే ఉంటుంది. ఇప్పటికే ఆయన బాహుబలి, తిబుల్ ఆర్ సినిమాలతో పాన్ ఇండియా లో పెను ప్రభంజనాలను సృష్టించాడు . ప్రస్తుతం మహేష్ బాబుతో చేస్తున్న సినిమాతో పాన్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చి ఎలాగైనా సరే అక్కడ తన సత్తా చాటుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని బరిలోకి దిగుతున్నాడు. ఇక ఇలాంటి సందర్భంలో ఈ సినిమాతో యావత్ ప్రపంచ సినిమా ప్రేక్షకులను మెప్పించి పెను ప్రభంజనాన్ని సృష్టించడమే లక్ష్యంగా పెట్టుకొని ముందుకు సాగుతున్నాడు. మరి ఇలాంటి రాజమౌళి ఈ సినిమాతో కనక సూపర్ సక్సెస్ ని సాధిస్తే తెలుగు సినిమా ఇండస్ట్రీని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన దర్శకుడిగా పేరు సంపాదించుకుంటాడు… ఇక ఇదిలా ఉంటే రీసెంట్ గా సింగర్ రాహుల్ సిప్లిగంజ్ హిరిణ్యా రెడ్డి కి ఎంగేజ్మెంట్ అయిన విషయం మనకు తెలిసిందే. అయితే రాహుల్ సిప్లిగంజ్ హరిణ్యా రెడ్డి ఇద్దరు మొదటినుంచి కూడా చాలా మంచి ఫ్రెండ్ అంట. వీళ్ళిద్దరు స్నేహితులుగా ఉన్నప్పుడు అనుకోకుండా ఒకసారి వీళ్ల మధ్య గొడవలు అయితే వచ్చాయట. ఇక అప్పుడు త్రిబుల్ ఆర్ సినిమాలోని నాటు నాటు అనే సాంగ్ పాడడానికి రాహుల్ వెళ్ళినప్పుడు అక్కడ రాజమౌళి తో చాలాసేపు మాట్లాడాడట…
Also Read: ‘బిగ్ బాస్’ అగ్ని పరీక్ష కోసం వచ్చిన 45 మందిలో సెలెక్ట్ అయిన 15 మంది వీళ్ళే
ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి తెలుసుకొని అలాగే తన ప్రేమ వ్యవహారాన్ని,తను డిప్రెషన్ లో ఉన్న పరిస్థితిని గమనించిన రాజమౌళి హిరిణ్యా గురించి తెలుసుకొని రాహుల్ కి చాలా వరకు క్లాస్ పీకారట. ప్రేమ గురించి ప్రేమించినా అమ్మాయిల గురించి చెప్పాడట. మొత్తానికైతే రాహుల్ హిరిణ్య రెడ్డిని కలిసి తన ప్రేమ విషయాన్ని చెప్పడమే కాకుండా ఇద్దరు పెళ్లి చేసుకోవాలని కూడా అప్పుడే నిశ్చయించుకున్నారట.
కానీ కెరియర్ పరంగా మరి కాస్త గ్రోత్ వచ్చిన తర్వాత చేసుకుంటే బాగుంటుందనే ఉద్దేశ్యంతో ఇన్ని రోజులపాటు వెయిట్ చేశారట…మొత్తానికైతే వీళ్లిద్దరిని రాజమౌళి కలిపాడు అంటూ ఒక న్యూస్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది…
ఇదంతా చూసిన చాలామంది జనాలు రాజమౌళి ఏది చేసినా పర్ఫెక్ట్ గా చేస్తాడు. జనాల్ని కలపడడానికి ఆయన చాలా వరకు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. రాజమౌళి సినిమాలు చాలా వైల్డ్ గా ఉంటాయి. కానీ మనిషి మాత్రం చాలా మృదుస్వభావి అంటూ చాలామంది కామెంట్స్ చేస్తూ ఉండడం విశేషం…