Sikandar Movie Collections
Sikandar Movie Collections : సల్మాన్ ఖాన్(Salman Khan) హీరో గా నటించిన లేటెస్ట్ చిత్రం ‘సికిందర్'(Sikandar Movie) ఇటీవలే భారీ అంచనాల నడుమ విడుదలై మొదటి ఆట నుండే డివైడ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి తెలిసిందే. సినిమాలో ఒక్కటంటే ఒక్క సన్నివేశం కూడా బాగా రాలేదని, అసలు సల్మాన్ ఖాన్ లాంటి సూపర్ స్టార్ మురుగదాస్ లాంటి అవుట్ డేటెడ్ డైరెక్టర్ తో సినిమా చేయడమే పెద్ద పొరపాటు అని, విలువైన సమయాన్ని అతనికి కేటాయించి కెరీర్ లో మరో ఫ్లాప్ ని అందుకున్నాడంటూ ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే సల్మాన్ ఖాన్ తన స్టార్ పవర్ తో ఒక సినిమాని మరీ డిజాస్టర్ రేంజ్ కి తీసుకొని వెళ్లకుండా, యావరేజ్ రేంజ్ కి తీసుకెళ్లిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు సికిందర్ చిత్రాన్ని కూడా ఆ దిశగా తీసుకెళ్తున్నాడు. విడుదలై నాలుగు రోజులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎంత నెట్ వసూళ్లను రాబట్టిందో ఒకసారి చూద్దాం.
Also Read : జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్న ‘జైలర్ 2’..ఈ వయస్సులో అదేమీ దూకుడు సామీ!
ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి నాల్గవ రోజున దాదాపుగా 15 కోట్ల రూపాయలకు పైగా నెట్ వసూళ్లు వచ్చాయట. ఓవరాల్ గా నాలుగు రోజులకు కలిపి దేశవ్యాప్తంగా ఈ సినిమాకు 108 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లు, 125 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయట. ఫ్లాప్ టాక్ వచ్చిన ఒక సినిమాని ఇంత దూరం నెట్టుకొని రావడం ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న పరిస్థితులలో కేవలం సల్మాన్ ఖాన్ కి మాత్రమే సాధ్యమని అక్కడి ట్రేడ్ పండితులు అంటున్నారు. ఓవరాల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమాకు 180 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయని, ఫుల్ రన్ లో దాదాపుగా 350 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు. ఈ వీకెండ్ ‘సికిందర్’ చిత్రానికి అత్యంత కీలకంగా మారనుంది.
ఈ వీకెండ్ తో కచ్చితంగా ఈ చిత్రం ఇండియా లో 200 కోట్ల రూపాయిల నెట్ వసూళ్ల మార్కుకు దగ్గరగా వస్తుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. ఇకపోతే నేడు ఈ చిత్రానికి బుక్ మై షో యాప్ లో గంటకు నాలుగు వేల టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. ఇదే సీజన్ లో విడుదలై సూపర్ హిట్ అనిపించుకున్న మోహన్ లాల్(Mohanlal) ‘L2: ఎంపురాన్'(L2: Empuraan) కి కూడా ఇదే రేంజ్ ట్రెండ్ నడుస్తుంది. ఓవరాల్ గా లైఫ్ టైం లో సికిందర్ కలెక్షన్స్ పరంగా ఫ్లాప్ అయ్యే అవకాశాలే లేవు. యావరేజ్ నుండి ఎబోవ్ యావరేజ్ రేంజ్ కి స్థిరపడేట్టు ఉంది పరిస్థితి. ఇలా ఫ్లాప్ అవ్వాల్సిన ఎన్నో సినిమాలను సేఫ్ గా ఒడ్డుకు చేర్చడం సల్మాన్ ఖాన్ కి అలవాటు అయిపోయింది. అలాంటి స్టార్ స్టేటస్ ఉన్న నటుడికి, ఈ ట్రెండ్ లో సరైన బ్లాక్ బస్టర్ పడితే రెండు వేల కోట్ల గ్రాస్ ని కొల్లగొట్టడం పెద్ద కష్టమేమి కాదు.
Also Read : ‘హిట్ 3’ ప్రపంచం లోకి ‘ఖైదీ’..ఇదేమి ప్లానింగ్ సామీ!