Hit 3
Hit 3: వరుసగా మూడు బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల తర్వాత నేచురల్ స్టార్ నాని(Natural Star Nani) హీరో గా నటించిన ‘హిట్ : ది థర్డ్ కేస్'(Hit : The Third Case) చిత్రం మే1 న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాల నడుమ విడుదల కాబోతుంది. ఈ సందర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషనల్ కంటెంట్ ని ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ ఉన్నారు మేకర్స్. ముందుగా ఒక యాక్షన్ టీజర్ ని విడుదల చేయగా, దానికి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. నాని ని ఇంత మాస్ యాంగిల్ లో చూడడం చాలా సర్ప్రైజ్ గా ఉందని, టీజర్ రేంజ్ లో సినిమా కూడా ఉంటే బాక్స్ ఆఫీస్ వద్ద ఆకాశమే హద్దు అనే రేంజ్ లో వసూళ్లు వస్తాయని సోషల్ మీడియాలో విశ్లేషకులు కామెంట్స్ చేశారు. కానీ రీసెంట్ గా విడుదల చేసిన మొదటి లిరికల్ వీడియో సాంగ్ కి ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదు.
Also Read: ఆ స్టార్ నటి బట్టలు మార్చుకుంటుండగా వ్యాన్ లోకి వచ్చిన డైరెక్టర్
ఇదంతా పక్కన పెడితే ‘హిట్ 3’ క్లైమాక్స్ లో డైరెక్టర్ శైలేష్ కొలను(Sailesh Kolanu) ఒక భారీ సర్ప్రైజ్ ని ప్లాన్ చేసాడని అంటున్నారు. ‘హిట్ : ది సెకండ్ కేస్’ మూవీ క్లైమాక్స్ లో నాని ఎలా అయితే అర్జున్ సర్కార్ క్యారక్టర్ ద్వారా క్యామియో రోల్ లో కనిపించాడో, ‘హిట్ : ది ఫోర్త్ కేస్’ క్లైమాక్స్ లో కూడా ఒక హీరో ఎంట్రీ ఉంటుందని టాక్. నిన్న మొన్నటి వరకు ఆ క్యామియో రోల్ లో నందమూరి బాలకృష్ణ, లేదా మాస్ మహారాజ్ రవితేజ కనిపిస్తారని అంతా అనుకున్నారు. కానీ లేటెస్ట్ గా అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం, ఆ పాత్ర లో తమిళ స్టార్ హీరో కార్తీ(Karthi Sivakumar) కనిపించబోతున్నాడని తెలుస్తుంది. ‘హిట్ : ది ఫోర్త్ కేస్’ లో కార్తినే హీరో గా నటించబోతున్నాడు.
మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ఈ చిత్రం లో ‘హిట్ : ది సెకండ్ కేస్’ లో హీరో గా నటించిన అడవి శేష్ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తాడని టాక్. ఇలా ఎన్నో ప్రత్యేకమైన అంశాలతో తెరకెక్కిన ఈ సినిమా ఆడియన్స్ ని ఎంతమేరకు అలరిస్తుందో చూడాలి. ఏది ఏమైనా హిట్ యూనివర్స్ లోకి కార్తీ అడుగుపెట్టడంతో ఈ సినిమా రేంజ్ మరింత పెరిగింది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ‘కార్తీ’ కి తెలుగు మరియు తమిళం భాషల్లో మంచి క్రేజ్ ఉంది. ఆయన ఈ సినిమా చేయడం వల్ల కచ్చితంగా ఈ ఫ్రాంచైజ్ మార్కెట్ మరింత పెరుగుతుంది. రెండు భాషల్లో పెద్ద హిట్ అయితే రెండు వందల కోట్ల రూపాయిల రేంజ్ లో కూడా గ్రాస్ వసూళ్లను రాబట్టే స్కోప్ పుష్కలంగా ఉంది. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని అప్డేట్స్ రాబోయే రోజుల్లో రానున్నాయి.