Jailer 2: సూపర్ స్టార్ రజినీకాంత్(Superstar Rajinikanth) కెరీర్ లో జైలర్(Jailer Movie) మూవీ ఎంతో ప్రత్యేకం. వరుస ఫ్లాప్స్ లో ఉన్న ఆయనకు ఈ సినిమా కొత్త ఊపిరి ని పోసింది. తెలుగు లో రజినీకాంత్ సూపర్ హిట్ కొట్టి చాలా కాలమే అయ్యింది. ఇక ఆయన మార్కెట్ అటు తమిళం లోనూ, ఇటు తెలుగు లోనూ పూర్తిగా తగ్గిపోతుంది అని అనుకుంటున్న సమయంలో విడుదలైన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా 600 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టింది. అదే విధంగా కేవలం తెలుగు వెర్షన్ నుండి వంద కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అలాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ కి సీక్వెల్ ని కూడా ప్రకటించాడు డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dilipkumar). రీసెంట్ గానే రజినీకాంత్ ‘కూలీ'(Coolie Movie) మూవీ షూటింగ్ ని పూర్తి చేశాడు. లోకేష్ కనకరాజ్(Lokesh Kanagaraj) దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమా అతి త్వరలోనే మన ముందుకు రానుంది.
Also Read: ఆ స్టార్ నటి బట్టలు మార్చుకుంటుండగా వ్యాన్ లోకి వచ్చిన డైరెక్టర్..
అయితే రజినీకాంత్ ఇప్పుడు ‘జైలర్ 2′(Jailer 2 Movie) మూవీ షూటింగ్ లో పాల్గొనడానికి సిద్ధం అవుతున్నాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన భారీ సెట్స్ ని కేరళలోని అట్టపాడిలో నిర్మిస్తున్నారు. మరో నాలుగైదు రోజుల్లో ఈ సెట్స్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి కానున్నాయి. ఏప్రిల్ 10 నుండి ఇక్కడ రెగ్యులర్ షూటింగ్ మొదలు కాబోతుంది. రజినీకాంత్ కి సంబంధించిన సన్నివేశాలను 15 నుండి రోజుల లోపు ఈ షెడ్యూల్ లో చిత్రీకరిస్తారట. జైలర్ మొదటి భాగంలో నటించిన నటీనటులంతా రెండవ భాగంలోనూ కనిపించనున్నారు. అంతే కాకుండా సరికొత్త విలన్స్ కూడా ఈ రెండవ భాగంలో సందడి చేయనున్నారు. షూటింగ్ కార్యక్రమాలను మొత్తం ఆరు నెలల పాటు విరామం లేకుండా పూర్తి చేసి, సంక్రాంతికి విడుదల చేయాలని ప్లానింగ్ చేసుకున్నారు. కానీ అదే సంక్రాంతికి తమిళ హీరో విజయ్ చివరి చిత్రం ‘జన నాయగన్’ విడుదల కాబోతుంది.
మనది ఎంతో ప్రతిష్టాత్మక చిత్రమని, కోలీవుడ్ ఇండస్ట్రీ స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లే సత్తా ఈ చిత్రానికి ఉందని, కాబట్టి సంక్రాంతికి కాకుండా మార్చ్ నెలలో సోలో రిలీజ్ ఉండేలా ప్లాన్ చేయమని దర్శక నిర్మాతలకు రజినీకాంత్ చెప్పుకొచ్చాడట. కోలీవుడ్ సినీ ఇండస్ట్రీ కి ఇప్పటి వరకు వెయ్యి కోట్ల సినిమా రాలేదు. ఇప్పుడు అందరి చూపు రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘కూలీ’ చిత్రం పైనే ఉంది. ఈ సినిమా కోలీవుడ్ కి మొట్టమొదటి వెయ్యి కోట్ల సినిమాగా నిలుస్తుందని బలమైన నమ్మకం తో ఉన్నారు కోలీవుడ్ ట్రేడ్ పండితులు. అదే విధంగా ‘జైలర్ 2’ కూడా వెయ్యి కోట్ల రూపాయిల మార్కుని అవలీలగా అందుకుంటుందని అంటున్నారు. 75 ఏళ్ళ వయస్సులో కూడా రజినీకాంత్ కోలీవుడ్ ఇండస్ట్రీ ఈ స్థాయిలో శాసిస్తున్నాడు. అంతే కాకుండా నేటి తరం కుర్ర హీరోలకంటే వేగంగా కూడా ఆయన షూటింగ్స్ ని పూర్తి చేస్తున్నాడు