Khushboo's Daughter Avanthika
Khushboo’s Daughter : సీనియర్ హీరోయిన్స్ లో ఇప్పటికీ చెరిగిపోని అందంతో కుర్ర హీరోయిన్స్ కి పోటీ ఇవ్వగలం అనిపించే వారిలో ఒకరు ‘కుష్బూ సుందర్'(Kushboo Sundar). ఒకప్పుడు ఈమెకు యూత్ ఆడియన్స్ లో ఉన్న క్రేజ్ ఎలాంటిదో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో ఎన్నో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన కుష్బూ అందాలకు ఆరోజుల్లో వీరాభిమానులు ఉండేవారు. ముఖ్యంగా తమిళనాడు లో అయితే ఆమెకు దేవాలయాలు కూడా కట్టారు. ఒక హీరోయిన్ కి ఈ స్థాయి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ గతం లో ఎప్పుడూ చూడలేదని, స్టార్ హీరోలకు కూడా దక్కని ఆ అదృష్టం కుష్బూ కి దక్కిందని అందరూ అనుకునేవారు. ఇప్పటికీ ఆమెని తమిళ ఆడియన్స్ అదే విధంగా ఆదరిస్తారు. కేవలం సినిమాల్లో మాత్రమే కాకుండా, రాజకీయాల్లో కూడా ఆమె అడుగుపెట్టి తనదైన ముద్ర వేసే ప్రయత్నం చేశారు.
Also Read : సికిందర్’ 4 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఫ్లాప్ టాక్ తో ఈ రేంజ్ రావడం గొప్పే!
ఇదంతా పక్కన పెడితే ఈమె ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ ని ప్రేమించి పెళ్లాడిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ దంపతులిద్దరికీ అవంతిక, ఆనందిత అనే ఇద్దరు కూతుర్లు ఉన్నారు. ఇందులో అవంతిక సోషల్ మీడియా లో నిత్యం యాక్టీవ్ గా ఉంటుంది. ఈమె అచ్చు గుద్దినట్టు తన తల్లి కుష్బూ పోలికలతో ఉంటుంది. కుష్బూ యుక్త వయస్సులో ఎంత అందంగా ఉండేదో నేటి తరం ఆడియన్స్ చూసి ఉండకపోవచ్చు. కానీ అవంతిక ని చూసి ఆరోజుల్లో కుష్బూ ఇలాగే ఉండేది అని అనుకోవచ్చు. ప్రస్తుతం ఇండస్ట్రీ లోకి అడుగుపెడుతున్న ఎంతో మంది యంగ్ హీరోయిన్స్ తో పోలిస్తే అవంతిక లక్ష రెట్లు బెటర్ గా ఉంటుంది. కచ్చితంగా ఈమె సినీ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టాల్సిందే అని ఆమె ఇన్ స్టాగ్రామ్ పోస్ట్స్ క్రింద నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మోడల్ దుస్తుల్లో ఎంతో స్టైలిష్ గా కనిపిస్తున్న ఆమె లుక్స్ ని చూసి, మీరు కూడా మీ అభిప్రాయాన్ని వ్యక్తం చేయండి.
ఇకపోతే కుష్బూ ఇప్పటికీ సినిమాల్లో క్యారక్టర్ ఆర్టిస్టుగా తన కెరీర్ ని కొనసాగిస్తూనే ఉంది, అదే విధంగా ఆమె భర్త సుందర్ కూడా దర్శకుడిగా కొనసాగుతూనే ఉన్నాడు. ఈమధ్య కాలంలో ఆయన పలు సూపర్ హిట్ సినిమాలు కూడా చేశాడు. కుష్బూ ప్రతీ శనివారం, ఆదివారం రోజుల్లో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోకి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. కేవలం ఈ ఒక్క షోలో మాత్రమే కాదు, తమిళం లో కూడా ఆమె అనేక షోస్ లో న్యాయ నిర్ణేతగా పాల్గొంటూ ఉంటుంది. కేవలం సినిమాలు, షోస్ మాత్రమే కాకుండా, తమిళం లో పలు టీవీ సీరియల్స్ ద్వారా కూడా ఆడియన్స్ ని అలరిస్తూ ముందుకెళ్తున్న కుష్బూ రాబోయే రోజుల్లో కెరీర్ పరంగా ఇంకెంత బిజీ గా మారనుందో చూడాలి.
Also Read : 75 కోట్ల బడ్జెట్..6 రోజుల్లో ‘రాబిన్ హుడ్’ కి వచ్చింది ఎంతంటే!