https://oktelugu.com/

Robinhood Collection: 75 కోట్ల బడ్జెట్..6 రోజుల్లో ‘రాబిన్ హుడ్’ కి వచ్చింది ఎంతంటే!

Robinhood Collection నితిన్(Hero Nithin) గత చిత్రాలకు వరల్డ్ వైడ్ గా వచ్చిన మొదటి రోజు వసూళ్లతో పోలిస్తే, రాబిన్ హుడ్ కి మొదటి వారం మొత్తం కలిపినా అంత రాలేదని బయ్యర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Written By: , Updated On : April 3, 2025 / 05:32 PM IST
Robinhood Collection

Robinhood Collection

Follow us on

Robinhood Collection: ఇటీవల కాలం లో ఇండస్ట్రీ లో అత్యధిక విజయాలను చూసిన ప్రొడక్షన్ హౌస్ ఏదైనా ఉందా అంటే అది మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) మాత్రమే. ముఖ్యంగా ‘పుష్ప 2′(Pushpa 2 Movie) చిత్రం తో ఈ ప్రొడక్షన్ హౌస్ కి వచ్చిన లాభాలు ఎలాంటివో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండస్ట్రీ లో తిరుగులేని ప్రొడక్షన్ కంపెనీ గా అవతరిస్తూ, ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఇమేజ్ ని కూడా సొంతం చేసుకుంది. అలాంటి ప్రొడక్షన్ హౌస్ నుండి ఇటీవలే విడుదలైన ‘రాబిన్ హుడ్'(Robin Hood Movie) చిత్రం పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఈ సినిమాకి నిర్మాతలు దాదాపుగా 75 కోట్ల రూపాయిల భారీ బడ్జెట్ ని ఖర్చు చేశారట. కానీ విడుదలకు ముందు నుండే ఆడియన్స్ లో అనుకున్న స్థాయిలో అంచనాలను క్రియేట్ చేయలేకపోవడంతో డిజాస్టర్ ఓపెనింగ్స్ ని సొంతం చేసుకుంది. కనీసం లాంగ్ రన్ లో అయినా పికప్ అవుతుందని అనుకుంటే అది కూడా జరగలేదు.

Also Read: ఆ స్టార్ నటి బట్టలు మార్చుకుంటుండగా వ్యాన్ లోకి వచ్చిన డైరెక్టర్..

నితిన్(Hero Nithin) గత చిత్రాలకు వరల్డ్ వైడ్ గా వచ్చిన మొదటి రోజు వసూళ్లతో పోలిస్తే, రాబిన్ హుడ్ కి మొదటి వారం మొత్తం కలిపినా అంత రాలేదని బయ్యర్స్ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మైత్రీ మూవీ మేకర్స్ కి అయితే ఈ సినిమా భారీ నష్టాలనే మిగిలించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ఈ నా థియేట్రికల్ బిజినెస్ దాదాపుగా 35 కోట్ల రూపాయలకు జరిగిందట. అంటే పెట్టిన బడ్జెట్ లో దాదాపుగా 50 శాతం రికవరీ అయ్యింది. మిగిలినవి కలెక్షన్స్ రూపం లో వస్తుందని అనుకున్నారు. విడుదలకు ముందు ప్రీ రిలీజ్ థియేట్రికల్ బిజినెస్ 28 కోట్ల రూపాయలకు జరిగింది. ఇదంతా అడ్వాన్స్ బేసిస్ మీద జరిగిన బిజినెస్. అంటే బయ్యర్స్ కి ప్రతీ ప్రాంతం లో ఒక నిర్దిష్టమైన బెంచ్ మార్క్ ని పెడుతారు.

ఆ బెంచ్ మార్క్ ని దాటి వసూళ్లు వస్తేనే నిర్మాతలకు డబ్బులు చేరుతుంది, లేకపోతే మొత్తం పోయినట్టే. రాబిన్ హుడ్ ఆ బెంచ్ మార్క్స్ కి ప్రతీ ప్రాంతంలోనూ దరిదాపుల్లో కూడా లేదు. ఫలితంగా నిర్మాతలకు థియేటర్స్ నుండి ఒక్క పైసా కూడా రాలేదు. అంటే దాదాపుగా 40 కోట్ల రూపాయిల నష్టం అన్నమాట. పైగా ఈ సినిమాకు ప్రముఖ క్రికెటర్ డేవిడ్ వార్నర్ ని అనవసరం గా తీసుకున్నారు. ఈ చిత్రం కోసం ఆయన మూడు రోజులు పని చేస్తే, దాదాపుగా 5 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ నిర్మాతలు ఇవ్వాల్సి వచ్చిందని, అంతే కాకుండా షూటింగ్ అత్యధిక శాతం విదేశాల్లో చేయడం వల్ల బడ్జెట్ ఆ రేంజ్ లో అయ్యిందని అంటున్నారు. ఇకపోతే ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి ఆరు రోజులకు గాను 6 కోట్ల 27 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. నితిన్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ ఫ్లాప్ అనొచ్చు.