Jayam Ravi : నిన్న గాక మొన్న పెళ్ళైన వాళ్ళు మనస్పర్థలు వచ్చి విడిపోయారంటే ఒక అర్థం ఉంటుంది. కానీ దశాబ్దాలు రిలేషన్ ని మైంటైన్ చేస్తూ, పిల్లలు కలిగి ఉన్నా కూడా విడిపోయే దంపతుల గురించి ఏమని మాట్లాడగలం?, కోట్లాది మందికి ఆదర్శంగా ఉండాల్సిన సినీ సెలబ్రిటీలు ఇలా చేస్తున్నారు. ఈమధ్యనే పాతికేళ్ల దాంపత్య జీవితం గడిపిన ధనుష్(Dhanush), ఐశ్వర్యలు విడాకులు తీసుకోవడం మనమంతా చూసాము. కానీ ఏనాడు కూడా వీళ్ళు విడాకుల వ్యవహారం గురించి పబ్లిక్ గా కామెంట్స్ చేయలేదు. కానీ రీసెంట్ గా జయం రవి(Jayam Ravi), ఆర్తి(Aarthi) దంపతులు ఒకరిపై ఒకరు కామెంట్స్ చేసుకున్న ఘటన ఇప్పుడు సంచలనంగా మారింది. వీళ్ళిద్దరిది 15 ఏళ్ళ దాంపత్య జీవితం. ఇన్నేళ్ల రిలేషన్ లో వీళ్ళ మధ్య ఎన్ని గొడవలు జరిగి ఉంటాయి?, ఎన్నిసార్లు తిట్టుకొని కలిసిపోయి ఉంటారు?, ఆ మాత్రం కలిసిపోలేరా?.
Also Read : యమదొంగ’ రీ రిలీజ్ కి డిజాస్టర్ అడ్వాన్స్ బుకింగ్స్..ఎంత గ్రాస్ వచ్చిందంటే!
పోనీ విడాకులు తీసుకున్నారు, తీసుకున్న తర్వాత అయినా వాళ్ళ ఇన్నేళ్ల దాంపత్య జీవితానికి విలువ ఇచ్చి ఒకరిపై ఒకరు గౌరవం చూపించుకోవాలి కదా?, కానీ అది జరగడం లేదు. రీసెంట్ గానే జయం రవి భార్య ఆర్తి మా పిల్లలను ఆయన పట్టించుకోవడం లేదు, ప్రముఖ సింగర్ తో తిరుగుతున్నాడని మీ అందరికీ తెలుసు అనే అర్థం వచ్చేలా పరోక్షంగా కామెంట్స్ చేసింది. ఇన్ని రోజులు నేను సైలెంట్ గా ఉండడానికి కారణం నేను తప్పు చేసానని కాదు, నా పిల్లలు ఇబ్బంది పడకూడదనే నేను సైలెంట్ గా ఉన్నాను అంటూ చెప్పుకొచ్చింది ఆర్తి. ఇక జయం రవి దీనికి కౌంటర్ ఇస్తూ ఒక లేఖ ని విడుదల చేసాడు. ఆయన మాట్లాడుతూ ‘తన ఆడంబరాల కోసం నా మాజీ భార్య, ఆమె కుటుంబం నన్ను పూర్తిగా దోచేసుకున్నారు. కోట్ల రూపాయిల అప్పులు చేసారు. షూరిటీ గా నన్ను పెట్టి నడిరోడ్డు మీదకు లాగేసారు’ అంటూ చెప్పుకొచ్చాడు.
ఇంకా మాట్లాడుతూ ‘నేను ఎంతో అల్లారుముద్దుగా పెంచుకున్న నా కన్నబిడ్డలను కూడా వాళ్ళు చూడనివ్వడం లేదు. మానసికంగా, శారీరకంగా ఎంతలా చితికిపోయానో నాకు తెలుసు. నా బిడ్డలు కూడా నన్ను చూడాలనే కోరిక తో ఉన్నారు. వాళ్ళు కూడా ఈ విషయంలో క్షోభ ని అనుభవిస్తున్నారు. ఇలాంటి చీకటి బ్రతుకుని బ్రతుకున్న నా జీవితంలోకి ధ్రువ తార లాగా వచ్చింది కేనీషా. ఆమె గౌరవానికి, పరువుకు భంగం కలిగేలా మాట్లాడితే అసలు సహించను’ అంటూ జయం రవి చెప్పుకొచ్చాడు. గత కొంతకాలం నుండి జయం రవి సింగర్ కేనీషా తో డేటింగ్ చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. నిన్న మొన్నటి వరకు కేవలం రూమర్ గా ఉన్న వార్త ఇప్పుడు నిజమైంది. ఏది ఏమైనా కుటుంబ వ్యవహారాలు నాలుగు గోడల మధ్య చూసుకుంటేనే మర్యాదగా ఉంటుంది. ఇలా రోడ్డు మీదకు వస్తే చాలా ఛండాలంగా ఉంటుంది అంటూ నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.