https://oktelugu.com/

రంకు బయట పెడుతున్న హీరోయిన్ ఫ్యామిలీ !

బాలీవుడ్ మాజీ హీరోయిన్ ‘శిల్పాశెట్టి’ భర్త వ్యవహారం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శిల్పా భర్త ‘రాజ్ కుంద్రా’ తన మొదటి భార్య కవిత నుంచి ఎందుకు విడిపోయాడో, ఆమె వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తితో ఎలా రంకు సాగించిందో చెప్పి.. మొత్తానికి అందరికీ షాక్ ఇచ్చాడు. రీసెంట్ గా రాజ్ కుంద్రా మొదటి భార్య కవిత కూడా పలు ఆరోపణలు చేస్తూ.. శిల్పా వల్లే తన కాపురంలో చిచ్చు రేగిందని, ఆమె […]

Written By:
  • admin
  • , Updated On : June 16, 2021 / 10:09 AM IST
    Follow us on

    బాలీవుడ్ మాజీ హీరోయిన్ ‘శిల్పాశెట్టి’ భర్త వ్యవహారం గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. శిల్పా భర్త ‘రాజ్ కుంద్రా’ తన మొదటి భార్య కవిత నుంచి ఎందుకు విడిపోయాడో, ఆమె వరుసకు సోదరుడు అయ్యే వ్యక్తితో ఎలా రంకు సాగించిందో చెప్పి.. మొత్తానికి అందరికీ షాక్ ఇచ్చాడు. రీసెంట్ గా రాజ్ కుంద్రా మొదటి భార్య కవిత కూడా పలు ఆరోపణలు చేస్తూ.. శిల్పా వల్లే తన కాపురంలో చిచ్చు రేగిందని, ఆమె లేకపోతే తాము కలిసి ఉండేవారమని చెప్పుకుని కన్నీళ్లు పెట్టుకుంది.

    ఆ కన్నీళ్లు చూసి మోసపోవద్దు అని, ఆమె పచ్చి మోసగత్తె అని, ఆమె దిగజారిపోయిన మహిళ అంటూ రాజ్ కుంద్రా సంచలన కామెంట్స్ చేశాడు. ఇలా వివాదాస్పద కామెంట్స్ తో సాగుతున్న ఈ తతంగం లోకి అడుగుపెట్టింది శిల్పా శెట్టి. తన ఇన్ స్టాగ్రామ్ వేదిక పై తన భర్త మాజీ భార్య గురించి పోస్ట్ పెడుతూ.. ‘ఒక మంచోడికి ఇబ్బంది కలిగితే ఎలా ఉంటుందో చూశారు కదా..’ అంటూ రాసుకొచ్చింది.

    మొత్తానికి శిల్పా శెట్టికి కూడా కవిత అంటే విపరీతమైన కోపంలా ఉంది. దానికి కారణం కవిత, శిల్పా గురించి కూడా విమర్శలు చేస్తూ.. ‘ఆమె మంచి నటి, గొప్ప అందగత్తె. కానీ ఆమె కంటే నేను పవిత్రంగా ఉన్నాను అని కరెక్ట్ గా చెప్పగలను. నా గురించి నా భర్త చేసిన ఆరోపణల్లో వాస్తవాలు ఏమిటి అనేది నాకు మాత్రమే తెలుసు. కొన్ని పరిస్థితులలో స్త్రీలు ఎన్నో ఎదుర్కోవాల్సి ఉంటుంది.

    ఆ సమయంలో భర్త దగ్గర లేకపోతే, ఒంటరి తనం బాధిస్తోంది. ఓదార్పు కావాలి అనిపిస్తుంది. నాకు ఆ సమయంలో ఒక వ్యక్తి నుండి ఓదార్పు లభించింది. ఇక్కడ నా ఒక్క తప్పే ఉంది అని ఎలా చెప్పగలరు ? సరే.. సినిమా ఇండస్ట్రీలో శిల్పా ఏ తప్పు చేయలేదు అని నా భర్త రాజ్ కుంద్రా చెప్పగలరా ? శిల్పా డబ్బు కోసం ఎలాంటి పాత్రలు చేసిందో ఆయనకు నేను చెప్పక్కర్లేదు అనుకుంటున్నా’ అంటూ కవిత తనదైన శైలిలో రెచ్చిపోయింది. మొత్తానికి హీరోయిన్ ఫ్యామిలీ మెంబర్స్ రంకు బయటపెడుతున్నారు.