తెలంగాణ రాష్ట సమితిలో విచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పార్టీ నుంచి బయటకు రావడంతో ఇంకా ఆయనతోపాటు చాలా మంది వస్తారని అనుకున్నారు. ఈటల కూడా నాతో పాటు ఇంకా కొందరు వస్తారని చెప్పడంతో పార్టీలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఈటల రాజేందర్ ఉదంతంతో టీఆర్ఎస్ పార్టీలో కదలికలు రావచ్చని అంచనా వేశారు. కానీ టీ కప్పులో తుఫానులా విషయం చల్లబడి పోయింది.
కేసీఆర్ తర్వాత పార్టీలో రెండో స్థానంలో చాలా కాలం పాటు కొనసాగారు. ఉద్యమం మొదలైన ఆరేడు సంవత్సరాల వరకు కేటీఆర్, కవిత రాష్ర్టసాధనలో భాగస్వామ్యం వహించలేదు. తొలి నుంచి హరీశ్ రావుకే సముచిత ప్రాధాన్యం ఇచ్చేవారు. 2009లో మహాకూటమి పరాజయం తర్వాత హరీశ్ రావుకు అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మంచి ఆఫర్ ఇచ్చారనే వదంతులు వ్యాపించాయి.దీంతో అప్పటి నుంచి హరీశ్ రావును పక్కకు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈటల ాజేందర్ సైతం హరీశ్ రావు సైతం బయటకు వస్తారని చెప్పడంతో మరోసారి హరీశ్ రావు విధేయతపై పుకార్లు వచ్చాయి. దీంతో హరీశ్ రావు అవన్ని వట్టివేనని నిరూపించేందుకు తన శక్తివంచన లేకుండా పాటుపడుతున్నారు.
ఈటల రాజేందర్ వేసిన గాలానికి హరీశ్ రావు చిక్కలేదు. తన విశ్వాసాన్ని నిరూపించుకునేందుకు ఈటల నియోజకవర్గంలో పార్టీ శ్రేణుల సమన్వయానికి తనవంతు బాధ్యతలు నిర్వహించడానికి ఉపక్రమించారు. అతని ప్రాముఖ్యాన్ని గుర్తించి కేసీఆర్ అతనికి కీలకమైనబాధ్యతలు అప్పగించారు. ఈటల రాజేందర్ ఉదంతం తర్వాత హరీశ్ చురుకుగా మారాలని కేసీఆర్ భావించి యాక్టివ్ గా ఉండాలని సూచించారు.
కేసీఆర్ కుటుంబంలో ఎలాంటి విభేదాలు లేవని హరీశ్ మాటలు, నేతల చేతల ద్వారా స్పష్టమైన సంకేతాలు ఇచ్చారు. రాష్ర్టంలోని అన్ని నియోజకవర్గాల్లో హరీశ్ రావుకు బలమైన అనుచర వర్గం ఉంది. వారికి ఏ పని కావాలన్నా హరీశ్ చేసి పెడుతుంటారు. దీంతో ఆయన బయటకు వస్తే అధినేత బలహీనపడతారు. అందుకే మంచి ఆపర్లు వచ్చినా హరీశ్ లొంగకుండా పార్టీనే పట్టుకుని తన విధేయతను నిరూపించుకుంటున్నారు.