Homeక్రీడలుక్రికెట్‌ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో...

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్ ఉంటే కప్ మనదే

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు వన్డే వరల్డ్ కప్ కోల్పోయింది. ఫైనల్ దాకా వచ్చినప్పటికీ.. చివరి పోటీలో ఆస్ట్రేలియా ముందు తలవంచింది.. ఒత్తిడి తట్టుకోలేక కంగారులకు దాసోహం అయింది. టీమిండియా కు వన్డే వరల్డ్ కప్ సాధించడమే లక్ష్యంగా చాలామంది క్రికెటర్లు ఆడుతున్నారు. అందులో విరాట్ కోహ్లీ.. రోహిత్ శర్మ ఉన్నారు. రోహిత్ అయితే టీమిండియాకు వన్డే వరల్డ్ కప్ అందించడమే తన జీవిత ఆశయమని అనేక సందర్భాల్లో చెప్పాడు. చివరికి ఆ కలను సాధించడానికి అతడు బరువు తగ్గాడు. మేనేజ్మెంట్ చెప్పినట్టు ఒప్పుకున్నాడు. సారధిగా వ్యవహరించిన చోట ఆటగాడిగా మారిపోయాడు.

టీమిండియా లో వన్డే ఫార్మాట్ కి సంబంధించి లోపాలు ఏమిటో ఇటీవల బయటపడ్డాయి. ఇంగ్లాండ్ గడ్డమీద టీమిండియా వన్డే సిరీస్ కోల్పోవడం అభిమానులకు ఏమాత్రం రుచించలేదు. తొలి వన్డే గెలిచినప్పటికీ.. మిగతా మ్యాచ్లలో టీమిండియా ఓడిపోయింది. సిరీస్ కోల్పోయింది. ఈ నేపథ్యంలో టీమిండియా కచ్చితంగా 50 ఓవర్ల ఫార్మాట్ లో సత్తా చూపించాల్సిన సందర్భం ఏర్పడింది.

వచ్చే వన్డే వరల్డ్ కప్ దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతుంది. అక్కడి మైదానాలు చాలా చిత్రంగా ఉంటాయి. ఆటగాళ్లు దూకుడుతో పాటు.. సమయమనాన్ని కొనసాగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా టీమిండియా ఓపెనర్లు సమర్ధవంతంగా ఆడాల్సిన అవసరం ఉంటుంది. పరుగులు తీయాలి.. అదే సమయంలో వికెట్లు కాపాడుకోవాలి. ప్రత్యర్థి బౌలర్లను సమర్ధవంతంగా కాచుకోవాలి. ఇదంతా జరగాలంటే ఆటగాళ్లలో సామర్థ్యం ఉండాలి. రోహిత్ విషయంలో ఇబ్బంది లేదు. గిల్ విషయంలో కూడా ఇబ్బంది లేదు. కానీ ఈ రెండు వికెట్లు వెంటనే పోతే.. తదుపరి బ్యాటర్ల మీద ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడి తగ్గాలంటే గిల్ స్థానంలో వైభవ్ సూర్య వంశీ రావాలని మెజారిటీ అభిమానులు కోరుకుంటున్నారు. కేవలం అభిమానులు మాత్రమే కాదు మాజీ క్రికెటర్లు కూడా ఇదే ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నారు.

నిన్న ముగిసిన జింబాబ్వే సిరీస్లో వైభవ్ సూర్య వంశీ అదరగొట్టాడు. వరుస హాఫ్ సెంచరీలతో సత్తా చూపించాడు. అంతేకాదు.. బౌన్సీ మైదానాల మీద తిరుగులేని ఆట తీరు కొనసాగించాడు. ఈ నేపథ్యంలో అతడు ఆడుతున్న తీరు చూసి సీనియర్ క్రికెటర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అతడిని వన్డే జట్టులోకి తీసుకోవాలని.. ఇదే అనువైన సమయమని చెబుతున్నారు.. మాజీ క్రికెటర్ ఫారుక్ ఇంజనీర్ ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. జాతీయ జట్టులోకి వైభవ్ ను తీసుకోవడానికి ఇదే అనుకూలమైన సమయమని.. అతడు గ్యాస్ మధ్యలో ఆడతాడని.. వేగంగా పరుగులు తీస్తాడని.. అందువల్లే మిగతా బ్యాటర్ల మీద ఒత్తిడి తగ్గుతుందని.. తద్వారా ఎక్కువ పరుగులు తీయడానికి ఆస్కారం ఏర్పడుతుందని ఇంజనీర్ అభిప్రాయపడ్డాడు. మూడో స్థానంలో విరాట్ కోహ్లీ.. నాలుగో స్థానంలో గిల్ ను పంపిస్తే టీమిండియా 2027 వన్డే వరల్డ్ కప్ టాస్క్ పూర్తి అవుతుందని.. ఇంజనీర్ అభిప్రాయపడ్డాడు.

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...

Arunachalam Moksha Margam: అరుణాచలం మోక్షమార్గం.. తెలుగు భక్తులకే ఎందుకీ కష్టాలు..

Arunachalam Moksha Margam: అప్పుడెప్పుడో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు అరుణాచలంలో ప్రదక్షిణలు చేయాలని.. మోక్ష మార్గం నుంచి బయటికి రావాలని పిలుపునిచ్చారు. ఆయన చెప్పడమే ఆలస్యం తెలుగు భక్తులు అప్పటినుంచి...
Oktelugu Epaper
Exit mobile version