Homeజాతీయ వార్తలుCockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.....

Cockroach Janata Party : కాక్రోచ్ జనతా పార్టీ ఉద్యమం: కష్టపడ్డ బొద్దింకల కాళ్లు విరిగాయి.. స్వార్థ బొద్దింకలు గట్టిగా వెనకేసుకున్నాయి..

Cockroach Janata Party : ఢిల్లీలోని జంతర్ మంతర్.. అతని పేరు జునైద్.. సొంత రాష్ట్రం ఉత్తర ప్రదేశ్.. ఫోన్ మెకానిక్ గా పని చేస్తూ ఉంటాడు. ఇతడు కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్ వద్ద ఆందోళన చేసినప్పుడు.. యువతకు ఆహారం అందించాడు.. పండ్లు పంపిణీ చేశాడు.. భారీగా ఖర్చు పెట్టుకున్నాడు. వాస్తవానికి నెలకి 40 వేలు సంపాదించే ఇతడు ఈ స్థాయిలో ఖర్చుపెట్టడం నిజంగా ఆశ్చర్యాన్ని కలిగించింది. ఇప్పుడు యూపీ పోలీసులు జునైద్ ఇంటికి వెళ్లారు. అతడి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నారు. ఈ స్థాయిలో డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందని ఆరా తీస్తున్నారు.

నీట్ ఉద్యమంలో పోలీసుల దాడిలో గాయపడింది చాలావరకు విద్యార్థులే. ఆ విద్యార్థులు ఇప్పుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కానీ రీల్స్ చేసిన వారు.. షార్ట్స్ చేసినవారు దర్జాగా దండుకున్నారు. బ్రహ్మాండంగా లక్షలు వెనకేసుకున్నారు. వీళ్ళు మాత్రమే కాదు అభిజిత్ దీప్కే మొదట్లో టైఫాయిడ్ వచ్చిందని హడావిడి చేశాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయగానే.. ఫైవ్ స్టార్ హోటల్ కి వెళ్లి పార్టీలు చేసుకున్నాడు.

కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆందోళనకు సంఘీభావం తెలుపడానికి వచ్చిన వారంతా జాతి విద్రోహక నినాదాలు ఇచ్చారు. రామాలయం ఎందుకు.. ఆర్టికల్ 370 ను పునరుద్ధరించాలి.. నేపాల్లో మాదిరిగా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమం రావాలి. శ్రీలంక మాదిరిగా యువకులు వీధుల్లోకి వచ్చి కొట్లాటలు చేయాలి.. ఇలా పిలుపునిచ్చారు. చివరికి ఉగ్రవాదులకు సంఘీభావం తెలిపారు. అల్లా అక్బర్ అంటూ నినాదాలు చేశారు. వీరంతా కూడా పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక ముంబైలో విద్యార్థులను అరెస్టు చేసి తీసుకెళ్తున్న పోలీసు వాహనానికి ఎదురు నిలబడి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన యువతీ.. సోషల్ మీడియాలో తన ఫాలోవర్స్ పెంచుకుంది. అంతేకాదు సబ్స్క్రయిబ్ రేటు కూడా నిర్ణయించింది. ఇప్పటికే ఆమె దాదాపు 8,000 మంది సబ్స్క్రైబర్లు పెరిగారు. ఈ లెక్కన ఆమె ప్రతినెలకు 11 లక్షలు సంపాదిస్తుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే కాక్రోచ్ జనతా పార్టీ నిర్వహించిన ఆందోళనలో చాలామంది సొమ్ము చేసుకున్నారు. కొందరు మూడు పూటలా బ్రహ్మాండంగా తిన్నారు. ఫైవ్ స్టార్ వంటకాలను టేస్ట్ చేశారు. కానీ అసలైన నిరసలు చేపట్టిన వారు కాళ్లు చేతులు విరగొట్టుకున్నారు.. ఆస్పత్రుల పాలై ఇబ్బంది పడుతున్నారు. ఉద్యమకారులకు భారీగా ఖర్చు పెట్టుకున్న జునైద్.. ఇప్పుడు యూపీ పోలీసులకు సమాధానం చెప్పాలి. మిగతా వారు కూడా బ్యాంక్ ఖాతాల వివరాలు సమర్పించాలి. కానీ రీల్స్ బ్యాచ్ మాత్రం.. ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. వచ్చిన డబ్బులను లెక్కపెట్టుకుంటూ నే ఉంటారు. ఎందుకంటే త్యాగాలు ఒకరివి.. భోగాలు మరొకరివి..

Anabothula Bhaskar
Anabothula Bhaskarhttps://oktelugu.com/
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Most Popular

ODI World Cup 2027 : వైభవ్ తో రోహిత్.. వన్డే వరల్డ్ కప్ లో ఈ కాంబినేషన్...

ODI World Cup 2027 : శీర్షిక చదివారు కదా.. ఈ కంటెంట్ లో ఉన్న మ్యాటర్ ఏంటో అర్థమైంది కదా.. ఇప్పుడు టీమిండియాకు కావలసింది అదే. ఎందుకంటే 2023లో భారత జట్టు...

Vijay Government : విజయ్ ప్రభుత్వానికి బిగ్ షాక్.. ఇది మామూలు దెబ్బ కాదు

Vijay Government : ప్రభుత్వ ఉద్యోగం ఉచితంగా ఇచ్చేది కాదు.. పంచిపెట్టేది కాదు.. అర్హులకు మాత్రమే ఉద్యోగాలు ఇవ్వాలి.. ప్రభుత్వం రాజ్యాంగ పరిమితులకు లోబడి వ్యవహరించాలి.. ఇదీ మద్రాస్ హైకోర్టు సోమవారం ఇచ్చిన...

Weight Loss: కిలో బరువు తగ్గాలంటే ఎంతసేపు నడవాలి?

Weight Loss: ప్రస్తుత కాలంలో బరువు తగ్గించాలని చాలామంది ప్రయత్నాలు చేస్తూ ఉంటారు .చాలా వరకు త్వరగా ఫలితం రావాలని కోరుకుంటారు. ముఖ్యంగా కిలో బరువు ఒక వారంలో తగ్గాలనే లక్ష్యంతో ఆహారం...

HYDRA Ranganath: హైడ్రా రంగనాథ్ కు రాం రాం.. తెలంగాణ హైకోర్టు సంచలనం

HYDRA Ranganath: హైడ్రా.. తెలంగాణలో 2023లో కొలువుదీరిన రేవంత్‌రెడ్డి సర్కార్‌ హైదరాబాద్‌లోని ప్రభుత్వ భూముల పరిరక్షణ, చెరువులు, కుంటల ఆక్రమణల తొలగింపు. ప్రకృతి విపత్తుల సమయంలో ప్రజలకు సహాయ సహకారాలు అదించేందుకు ఏర్పాటు...

Kerala Innovation: అమ్మ కష్టం చూడలేక.. ఈ కొడుకు చేసిన పని.. ఏకంగా సీఎం చప్పట్లు కొట్టాడు..

Kerala Innovation: ఉదయం లేవగానే ఇల్లు ఊడ్చి.. కల్లాపి చల్లాలి. ముగ్గు పెట్టాలి. బట్టలు ఉతకాలి. టీ దగ్గర నుంచి మొదలు పెడితే కూర వరకు వండాలి. ఇంటిని శుభ్రం చేయాలి. ఇన్ని...
Oktelugu Epaper
Exit mobile version