Bhagyashri Borse : కొంతమంది హీరోయిన్స్ కి వరుసగా రెండు మూడు ఫ్లాపులు వస్తే చాలు , ఇండస్ట్రీ ఆ హీరోయిన్స్ పై ఐరన్ లెగ్ అనే ముద్ర వేస్తుంది. ఆ తర్వాత మెల్లగా అవకాశాలు రావడం కూడా తగ్గిపోతాయి. కానీ ఒక సినిమా ఫలితం పై హీరోయిన్ ప్రభావం ఏమి ఉండదు. కేవలం కథ, కంటెంట్ మాత్రమే ఏ సినిమాని అయినా కాపాడుతుంది. ఒకప్పుడు శృతి హాసన్ ని ఇలాగే అనేవారు. ‘గబ్బర్ సింగ్’ చిత్రం ముందు ఆమె చేసిన ప్రతీ సినిమా ఘోరమైన డిజాస్టర్ గా మిగిలింది. కానీ ‘గబ్బర్ సింగ్’ తో ఆమె జైత్ర యాత్ర మొదలైంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆమె చేసిన సినిమాల్లో అత్యధిక శాతం సెన్సేషనల్ హిట్స్ గా నిలిచాయి. ఇప్పుడు ఆమె పాన్ ఇండియా లోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లో ఒకరు.
సరిగ్గా భాగ్యశ్రీ కి కూడా ఇదే జరుగుతోంది. ‘లెనిన్’ కి ముందు ఆమె ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి , మొన్నటి వరకు చేసిన ప్రతీ సినిమా కమర్షియల్ గా డిజాస్టర్ ఫ్లాప్స్ గా మిగిలాయి. ఐరన్ లెగ్ అనే ముద్ర కూడా ఆమెపై పడింది. సోషల్ మీడియా లో వచ్చే ఈ కామెంట్స్ ని చూసి భాగ్యశ్రీ చాలా బాధపడింది కూడా. అయితే ‘లెనిన్’ సక్సెస్ తర్వాత ఈమె జాతకమే మారిపోయింది. నిన్న మొన్నటి వరకు కోటి రూపాయిల లోపు రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చిన భాగ్యశ్రీ , ఇప్పుడు ఏకంగా 2 నుండి 4 కోట్ల రూపాయిల రేంజ్ లో రెమ్యూనరేషన్ అందుకునే రేంజ్ కి వెళ్ళిపోయింది. రీసెంట్ గానే ఆమె ఒక బాలీవుడ్ సినిమాలో నటించడానికి ఒప్పుకుంది. మిలాప్ జవేరి దర్శత్వం లో తెరకెక్కబోతున్న ఈ భారీ యాక్షన్ చిత్రం లో ఆదిత్య రాయ్ కపూర్ హీరో గా నటిస్తున్నారు.
ఈ సినిమాలో హీరోయిన్ గా నటించడం కోసం భాగ్యశ్రీ ఏకంగా 4 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని అందుకుందట. త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. ప్రస్తుతం ఆమె శివ కార్తికేయన్ హీరో గా నటిస్తున్న ‘సియాన్’ అనే చిత్రంలో హీరోయిన్ గా నటిస్తోంది. ‘రాజ్ కమల్ ఇంటర్నేషనల్ ఫిలిమ్స్’ పై ప్రముఖ నటులు కమల్ హాసన్ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ చిత్రం , ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. మరి ఈ సినిమాతో భాగ్యశ్రీ రెండవ సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసుకుంటుందో లేదో చూడాలి. ఈ సినిమా తర్వాత ఆమె ‘ఓజీ 2’ లో హీరోయిన్ గా నటించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
