Sharathulu Varthisthai Review : షరతులు వర్తిస్తాయి’ ఫుల్ మూవీ రివ్యూ

అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ కు కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఇక మ్యూజిక్ ఈ సినిమాకు చాలా హెల్ప్ అయింది. ఉన్న దాంట్లో చాలా బెస్ట్ అవుట్ పుట్ అయితే తీసుకొచ్చారనే చెప్పాలి... 

Written By: NARESH, Updated On : May 31, 2024 10:44 am
Follow us on

Sharathulu Varthisthai Review : తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలా రకాల సినిమాలు వస్తున్నాయి. అలాగే వచ్చిన చాలా సినిమాలు ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తూ మంచి విజయాలను కూడా సాధిస్తూ ముందుకు సాగుతున్నాయి. ఇక ఇలాంటి క్రమంలోనే తెలంగాణ యాస, భాష లను బేస్ చేసుకొని వచ్చిన చాలా సినిమాలు ఇప్పటివరకు మంచి విజయాలను అందుకున్నాయి. ఇక అందులో కొన్ని సినిమాలు ప్రేక్షకుడిని ఎంటర్ టైన్ చేస్తే మరికొన్ని సినిమాలు ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెట్టిన సంఘటనలు కూడా ఉన్నాయి. ఇక ఇదిలా ఉంటే చైతన్య రావు, భూమి శెట్టి హీరో హీరోయిన్లుగా వచ్చిన “షరతులు వర్తిస్తాయి” సినిమా రీసెంట్ గా ప్రముఖ ఓటిటి ప్లాట్ ఫామ్ అయిన ‘ఆహా ‘ లో రిలీజ్ అయింది.
అయితే తెలంగాణ నేపథ్యం లో సినిమా అనగానే ఎక్కువ మంది కి కరీంనగర్ పరిసర ప్రాంతాలు గుర్తుకు వస్తాయి. ఇక ఈ సినిమా కూడా ఆ ప్రాంతం లో నడిచే కథే కావడం విశేషం…అయితే ఈ సినిమా ఎలా ఉంది. ప్రేక్షకుడి ప్రశంసలను అందుకుందా లేదా ఇంతకుముందు తెలంగాణ యాస తో వచ్చిన సినిమాలను మైమరిపించేలా ఉందా లేదా అనే విషయాలను మనం ఒకసారి బ్రీఫ్ అనాలసిస్ ద్వారా తెలుసుకుందాం…
కథ 
ముందుగా ఈ సినిమా కథ విషయానికి వస్తే నీటిపారుదల శాఖలో క్లర్క్ గా పనిచేస్తున్న చిరంజీవి (చైతన్య రావు) తమ చిన్నతనంలోనే వాళ్ళ నాన్నని కోల్పోవడంతో ఇంటి భారం మొత్తాన్ని తనే మోయాల్సి వస్తుంది. అమ్మ చెల్లి, తమ్ముడు లను చాలా కష్టపడుతూ పోషిస్తూ లైఫ్ ను లీడ్ చేస్తూ ఉంటాడు. ఇక ఇలాంటి క్రమంలోనే విజయశాంతి (భూమి శెట్టి) ని ప్రేమించి పెళ్లి చేసుకుంటాడు. ఇక పెళ్లి తర్వాత నుంచి అసలు కథ మొదలవుతుంది. అయితే పెళ్లికి ముందు విజయశాంతి స్టేషనరీ షేప్ లో వర్క్ చేసినప్పటికీ పెళ్లి తర్వాత ఆ వర్క్ మానేసి తన భర్త కుటుంబాన్ని మంచిగా చూసుకోవాలని అనుకుంటుంది.
ఇక వాళ్ళు ఉంటున్న ఏరియా లోనే సావిత్రి భాయి గోల్డెన్ ప్లేట్ పేరుతో గొలుసుకట్టు చిట్టీల వ్యాపారం స్టార్ట్ అవుతుంది. ఇక వీళ్ళు పెట్టే స్కీములతో అందర్నీ ఆకర్షిస్తూ ఉంటారు. అయితే చిరంజీవి వాళ్ళ కుటుంబం కూడా దాని పట్ల కొద్దిగా ఆసక్తి చూపించినప్పటికీ, చిరంజీవి మాత్రం ఇంట్లో వాళ్ళతో అవన్నీ ఫేక్ వాటిని నమ్మకూడదని చాలా గట్టిగా చెబుతాడు. ఇక దాంతో వాళ్లు కూడా సైలెంట్ గానే ఉంటారు. కానీ అనుకోకుండా చిరంజీవి వర్క్ మీద ఒక పది రోజులు బయటికి వెళ్లాల్సి వస్తుంది.
తను బయటికి వెళ్లే ముందు తన భార్యకి ఎలాగైనా సరే స్టేషనరీ షాప్ పెట్టించాలి అనే ఉద్దేశంతోనే బ్యాంకులో నుంచి కొంత లోన్ తీసుకొని ఆ డబ్బులు ఇంట్లో విజయశాంతి కి ఇచ్చి భద్రంగా దాచి ఉంచామని చెబుతాడు. ఇంకా తను వెళ్ళిన తర్వాత చిరంజీవి వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ అమ్మ కలిసి విజయశాంతికి మాయ మాటలు చెప్పి తనను ఒప్పించి ఆ సంస్థలో పెట్టుబడిలను పెట్టిస్తారు. కట్ చేస్తే రాత్రికి రాత్రే ఆ సంస్థ బోర్డు తిప్పేయడంతో చిరంజీవి వాళ్ళ అమ్మ కి ఒక్కసారిగా గుండె ఆగిపోయినంత  పనవుతుంది. ఇక చిరంజీవి భార్య అయిన విజయశాంతి మాత్రం తన భర్త తనకు అమితంమైన ఇష్టం తో షాప్ పెట్టించాలనుకున్న డబ్బుల్ని నేను ఖర్చు చేశాను ఇప్పుడు ఎలా అంటూ ఏడుస్తుంది. ఇక ఇంటికి వచ్చిన చిరంజీవి ఈ విషయాన్ని తెలుసుకొని చీటీల వ్యాపార సంస్థల పైన ఎలాంటి రివెంజ్ ని తీర్చుకున్నాడు అనే విషయాలు తెలియాలంటే మీరు ఈ సినిమా చూడాల్సిందే…
విశ్లేషణ
ఇక ఈ సినిమా విశ్లేషణ విషయానికి వస్తే దర్శకుడు అక్షర (కుమార స్వామి) ఈ సినిమాని మొదటి నుంచి చివరి వరకు చాలా ఎంగేజింగ్ గా తీసుకెళ్లాడు. ఇక ఫస్ట్ అఫ్ చాలా హీలేరియస్ వర్కౌట్ అయ్యాయి. అలాగే సెకండ్ హాఫ్ లో కొన్ని ఎమోషన్ సీన్స్ తో కూడిన టచ్ ని ఇస్తూనే  తను ఎక్కడ కూడా ప్రేక్షకుడిని డిజాప్పాయింట్ చేయకుండా ఒక మూడ్ లోకి తీసుకెళ్లాడు. ఇక మొత్తానికైతే ఈ సినిమాని సక్సెస్ఫుల్ గా విజయతీరాలకు చేర్చడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడనే చెప్పాలి. సగటు మధ్యతరగతి కుటుంబాలు ఏ విధంగా అయితే ఆలోచిస్తాయో అలాంటి థాట్స్ తో దర్శకుడు ఈ సినిమాని అల్లుకున్న కథ బావుంది. ఇక చీటీల వ్యాపారం చేయడంలో మధ్య తరగతి కుటుంబాలు  ఆశతో నమ్మి మోసపోవడం అనేది సహజంగా జరుగుతూనే ఉంటుంది. ఇలాంటి మోసాల గురించే ఈ సినిమాలో చాలా అద్భుతంగా చూపించాడు. మధ్యతరగతి వాళ్లు ఈజీగా డబ్బులు వస్తున్నాయంటే ఎంతైనా సరే పెట్టుబడి పెట్టడానికి రెడీగా ఉంటారు.
కానీ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే మనకు ఎవడు ఈజీగా డబ్బులైతే ఇవ్వడు. అలాంటిది ఏదైనా ఇస్తున్నారు అంటే అది పెద్ద స్కామ్ అని మనం తెలుసుకోవాలంటూ ఈ సినిమాలో కొన్ని మాటలను స్ట్రాంగ్ గా చెప్పారు. ఇక ప్రతి సీన్ కూడా ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో చాలావరకు సక్సెస్ అయ్యాయి.ఇక ఈ సినిమాకి మాటలు రాసిన పెద్దింటి అశోక్ కుమార్ మాటలు అయితే చాలా హిలేరియస్ గా వర్కౌట్ అయ్యాయనే  చెప్పాలి. ప్రతి సీన్ లో కూడా ఆ సీన్ తాలూకు ఎమోషన్ ను పట్టుకొని ఆయన డైలాగ్స్ చాలా అద్భుతంగా రాశారు. ఇక కొన్ని సీన్లలో బ్యాగ్రౌండ్ స్కోర్ చాలా బాగా ప్లస్ అయింది…ఇక అత్త కోడళ్ళ మధ్య వచ్చే గొడవలు కూడా ఈ సినిమాలో బాగా చూపించారు..అందులో కూడా కామెడీని పండించారు..కాకపోతే సినిమా కొంచెం అక్కడక్కడ స్లో గా నడవటం కొంతవరకు ప్రేక్షకుడిని ఇబ్బంది పెడుతుంది…
టెక్నికల్ అంశాలు
ఇక టెక్నికల్ అంశాల విషయానికి వస్తే ఈ సినిమాకి మ్యూజిక్ అందించిన అరుణ్ చిలువేరు అలాగే బ్యాగ్రౌండ్ మ్యూజిక్ అందించిన ప్రిన్స్ హెన్రీ ఇద్దరు కూడా చాలా బాగా మ్యూజిక్ అందించారనే చెప్పాలి. ఇక ముఖ్యంగా సాంగ్స్ విషయానికి వస్తే ఒక సాంగ్ బాగుంది. ఇక అలాగే బ్యాగ్రౌండ్ స్కోర్ అయితే కామెడీ సీన్స్ కి చాలా బాగా హెల్ప్ అయింది. అలాగే సెకండ్ హాఫ్ లో వచ్చే ఎమోషన్ సీన్స్ కు కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఇక మ్యూజిక్ ఈ సినిమాకు చాలా హెల్ప్ అయింది. ఉన్న దాంట్లో చాలా బెస్ట్ అవుట్ పుట్ అయితే తీసుకొచ్చారనే చెప్పాలి…
ఇక సినిమాటోగ్రఫీ విషయానికి వస్తే ప్రవీణ్ వనమాలి, శేఖర్ పోచంపల్లి విజువల్స్ సినిమాను నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లాయనే చెప్పాలి. ఎందుకంటే వీళ్ళు పెట్టిన షాట్స్ తో సినిమా అనేది పర్ఫెక్ట్ గా ప్రేక్షకుడికి రీచ్ అయింది. ప్రతి ఒక్క ఫ్రేమ్ విజువల్ గా హై రేంజ్ అవుట్ ఫుట్ ని అందించడంలో వీళ్లు చాలా వరకు సక్సెస్ అయ్యారు. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నంతలో చాలా బాగున్నాయి..
ఆర్టిస్టుల పర్ఫామెన్స్
ఆర్టిస్టుల పర్ఫామెన్స్ విషయానికి వస్తే చిరంజీవిగా చైతన్య రావు చాలా అద్భుతమైన పర్ఫామెన్స్ ని ఇచ్చాడు. ఇక మిడిల్ క్లాస్ లైఫ్ లో బాధ్యత మొత్తాన్ని మోస్తున్న ఒక ఇంటి పెద్ద ఎలాంటి స్ట్రగుల్స్ ని ఫేస్ చేస్తూ ఉంటాడు అనే క్యారెక్టర్ లో  సినిమాలో కళ్ళకు కట్టినట్టుగా నటించి మెప్పించాడు. ఇక విజయశాంతిగా నటించిన భూమి శెట్టి తన పాత్ర పరిధి మేరకు చాలా అద్భుతంగా నటించి సినిమా సక్సెస్ కి హెల్ప్ అయింది. తన తల్లిగా నటించిన పద్మావతి చాలా చక్కనైన అభినయంతో సామాన్యుల తీరు ఎలా ఉంటుందో ఆమె యొక్క ఆలోచన శైలి కూడా అలానే మలిచిన విధానం చాలా బాగుంది. ఆమె కూడా నటించి మెప్పించడంలో చాలా వరకు సక్సెస్ అయ్యింది. ఇక మిగిలిన ఆర్టిస్టులందరూ వాళ్ళ పాత్రల పరిధి మేరకు చాలా బాగా నటించి మెప్పించారు…
ప్లస్ పాయింట్స్
చైతన్య రావు యాక్టింగ్
డైలాగ్స్
మిడిల్ క్లాస్ లైఫ్ గురించి చూపించిన కొన్ని సీన్లు..
డైరెక్షన్
మైనస్ పాయింట్స్
కథలో కొత్తదనం లేదు..
సినిమా కొంచెం స్లో గా ముందుకు సాగుతుంది…
రేటింగ్
ఈ సినిమాకి మెమిచ్చే రేటింగ్ 2.75/5
చివరి లైన్
ఒకసారి ఫ్యామిలీ తో హాయి గా చూసి నవ్వుకోవచ్చు…