Homeఎంటర్టైన్మెంట్Allu Arjun Sneha Reddy Viral Video: పెళ్లి రోజున అల్లు స్నేహా రెడ్డి కి...

Allu Arjun Sneha Reddy Viral Video: పెళ్లి రోజున అల్లు స్నేహా రెడ్డి కి ఖరీదైన బహుమతిని ఇచ్చిన అల్లు అర్జున్..వీడియో వైరల్!

Allu Arjun Sneha Reddy Viral Video: రీసెంట్ గానే అల్లు శిరీష్ పెళ్లి నయనికా అనే అమ్మాయితో హైదరాబాద్ లో ఎంత గ్రాండ్ గా జరిగిందో మనమంతా చూశాము . ఈ పెళ్ళికి ఇరు కుటుంబాలకు సంబంధించిన వారితో పాటు, సినీ ప్రముఖులు , రాజకీయ నాయకులు, పారిశ్రామిక వేత్తలు కూడా హాజరయ్యారు. ఈ పెళ్లి లో అల్లు అర్జున్ తెలుగు సంప్రదాయాలు ఉట్టిపడేలా వస్త్రధారణ తో ఎంతో ప్రత్యేకంగా, పద్దతిగా కనిపించాడు. ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే , అల్లు శిరీష్ పెళ్లి జరిగిన రోజే అల్లు అర్జున్ , స్నేహా రెడ్డి పెళ్లి రోజు కూడా. వీళ్లిద్దరి పెళ్లి 2011 వ సంవత్సరం మార్చి 6 న జరిగింది. అంటే సరిగ్గా 14 ఏళ్ళు పూర్తి అయ్యి 15 వ సంవత్సర లోకి అడుగుపెట్టారు అన్నమాట. అయితే తన భార్యపై ప్రేమతో ఈ సందర్భంగా అల్లు అర్జున్ ఇచ్చిన గిఫ్ట్ కి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.

Also Read: ప్రాధేయపతూనే గాంభీర్యం.. ఎందుకు ట్రంపూ ఇంత బలుపు?

బెంజ్ కార్ లేటెస్ట్ మోడల్ ని ఆయన స్నేహా రెడ్డి కి బహుమతిగా ఇచ్చాడు. దీనికి స్నేహా రెడ్డి ఎంతో సంతోషిస్తూ అల్లు అర్జున్ ని ప్రేమతో దగ్గరకి తీసుకొని ముద్దుపెట్టుకోవడం హైలైట్ గా నిల్చింది. ఈ వీడియో ని చూసిన ప్రతీ ఒక్కరు, ప్రేమ జంట అంటే ఇలా ఉండాలి. ఎన్ని ఏళ్ళు అయినా వీళ్ళ మధ్య ప్రేమ ఇసుమంత కూడా తగ్గలేదు. ఈమధ్య కాలం లో చిన్న విషయాలకు కూడా కొంత మంది టాప్ సెలబ్రిటీలు విడాకులు వరకు వెళ్తున్నారు. అలాంటోళ్ళు వీళ్ళని చూసి నేర్చుకోవాలి అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెట్స్ చేస్తున్నారు. అల్లు శిరీష్, నయనికా రెడ్డి జంట కూడా అల్లు అర్జున్ , స్నేహా రెడ్డి లాగానే అన్యోయంగా ఉండాలని కోరుకుంటున్నారు అభిమానులు.

ఇక అల్లు అర్జున్ సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం ఆయన అట్లీ తో చేస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ప్రస్తుతం అల్లు శిరీష్ పెళ్లి కావడం తో ఈ సినిమాకు చిన్న బ్రేక్ పడింది. వెడ్డింగ్ రిసెప్షన్ పూర్తి అయ్యాక రెగ్యులర్ షూటింగ్ తిరిగి ప్రారంభం కాబోతుంది. ఈ చిత్రం పూర్తి అయిన వెంటనే లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేయబోతున్నాడు అల్లు అర్జున్. ఇక ఏప్రిల్ 8 న అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా అట్లీ మూవీ కి సంబంధించిన మొదటి గ్లింప్స్ వీడియో ని విడుదల చేస్తారట మేకర్స్. ఇప్పటికే అందుకు సంబంధించిన పనులు కూడా పూర్తి అయ్యాయి.

 

 

#AlluSnehaReddyకి  బెంజ్ కారు ఇచ్చి సర్‌ ప్రైజ్‌ చేసిన #AlluArjun | Prime9 News
Vishnu Teja
Vishnu Teja
Vishnuteja is a Writer Contributes Movie News. He has rich experience in picking up the latest trends in movie category and has good analytical power in explaining the topics on latest issues. He also write articles on Movie news.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version