Vijay divorce controversy : సోషల్ మీడియా , ఎలక్ట్రానిక్ మీడియా, ఇలా ఎక్కడ చూసినా స్టార్ సెలబ్రిటీల పెళ్లిళ్ల అప్డేట్స్ తో నిండిపోతుంటే, మరోపక్క తమిళ హీరో విజయ్(Thalapathy Vijay) విడాకుల వ్యవహారం గురించి కూడా బోలెడన్ని వార్తలు పుట్టుకొస్తున్నాయి. రీసెంట్ గా విజయ్ తానూ గత కొంతకాలంగా సహజీవనం చేస్తున్న త్రిష తో కలిసి ఒక పెళ్లి ఈవెంట్ కి హాజరవ్వడం సెన్సేషనల్ టాపిక్ గా మారింది. త్వరలోనే మేమిద్దరం పెళ్లి చేసుకోబోతున్నాము అనే స్టేట్మెంట్ కూడా ఈ ఒక్క సంఘటనతో అందరికీ క్లారిటీ ఇచ్చినట్టు అయ్యింది . అంటే విజయ్ భార్య సంగీత చేసినవి ఆరోపణలు కాదు, నిజమే అని విజయ్ పరోక్షంగా చెప్పకనే చెప్పాడు. ఇదంతా పక్కన పెడితే రీసెంట్ గా ఆయన ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఈ విడాకుల వ్యవహారం గురించి మొట్టమొదటిసారి రెస్పాన్స్ ఇచ్చాడు. ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.
ఆయన మాట్లాడుతూ ‘రీసెంట్ గా నా వ్యక్తిగత వ్యవహారాల విషయం లో నేను ఇబ్బందుల్లోకి వెళ్తానని అభిమానులు, పార్టీ క్యాడర్ భయపడుతున్నారు. మీరు వాటిని అసలు పట్టించుకోకండి. అనవసరం గా మీ సమయాన్ని వృధా చేసుకోకండి. నేను చూసుకుంటాను వాటి గురించి ‘అంటూ చెప్పుకొచ్చాడు. విడాకుల వ్యవహారం బయటకు వచ్చిన తర్వాత విజయ్ ఏర్పాటు చేసిన మొట్టమొదటి సభ ఇది. ఇందులో ఆయనే TVK పార్టీ ఎన్నికల మ్యానిఫెస్టో ని కూడా విడుదల చేసాడు. ఇదే సభలో తానూ విడాకులు తీసుకోవడానికి గల కారణాలు వివరిస్తాడేమో అని అంతా అనుకున్నారు . ఎందుకంటే ఆయన సతీమణి సంగీత విజయ్ పై చేసిన ఆరోపణలు సాధారణమైనవి కాదు. తనతో వైవాహిక బంధం లో ఉన్నప్పుడే విజయ్ మరో హీరోయిన్ తో ఎఫైర్ పెట్టుకున్నాడని, నన్ను మానసికంగా చాలా వేధించాడని, ఇలా ఎన్నో ఆరోపణలు చేసింది.
ఇవన్నీ నిజమే అని విజయ్ చెప్పకనే చెప్పినట్టు మొన్న త్రిష తో కలిసి పెళ్లి ఫంక్షన్ కి వెళ్ళినప్పుడే అర్థం అయ్యింది. అయితే అభిమానుల్లో ఎక్కడో ఒక చిన్న ఆశ ఉండేది, తమ అభిమాన హీరో ఎలాంటి తప్పు చేయలేదు, భార్య తో దూరంగా ఉండడానికి కచ్చితంగా ఎదో ఒక కారణం ఉండే ఉంటుంది, అది ఈ సభలో చెప్తాడేమో అని అనుకున్నారు. కానీ అలాంటిదేమి జరగలేదు. ఇదే అభిమానులను తీవ్రమైన మానసిక వేదన కు గురి చేస్తున్న విషయం . ఒక స్టార్ పబ్లిక్ జీవితంలోకి వచ్చినప్పుడు, తానూ వ్యక్తిగతంగా ఎలా నడుచుకుంటున్నాను అనే విషయంపై జనాలకు క్లారిటీ ఇవ్వాలి. పెళ్ళైన భార్య పక్కనే ఉండగా, వేరే అమ్మాయితో సంబంధం పెట్టుకున్న వాళ్ళు మన కుటుంబ సభ్యుల్లో ఉంటే క్షమిస్తామా చెప్పండి ?, మరి అలాంటిది తప్పు చేసినవాడు రాజకీయాల్లోకి వచ్చి ఓట్లు అడిగితే ఎలా వేస్తాం ? అంటూ సొంత అభిమానులే విజయ్ ని సోషల్ మీడియా లో తిడుతున్నారు.
Vijay's Indirect Comment About Divorce
“Don’t worry about the recent problems surrounding me. Those issues are not worth your time. I will take care of them myself
What hurts me the most is seeing you feel sad or stressed because of my problems"
– #ThalapathyVijay pic.twitter.com/BTJALyXwcw
— Gulte (@GulteOfficial) March 7, 2026