Mirai – Manchu Manoj : మిరాయ్ లో మంచు మనోజ్ క్యారెక్టర్ ఏంటో తెలిస్తే ఆశ్చర్య పోతారు…

ఇక ఇప్పుడు ఈ సినిమా కనక సక్సెస్ అయితే మాత్రం మనోజ్ కి భారీ ఆఫర్లు అయితే వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు...చూడాలి మరి ఈ సినిమా తో తను ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది...

Written By: NARESH, Updated On : May 21, 2024 8:24 am

You will be surprised to know the character of Manchu Manoj in Mirai

Follow us on

Mirai – Manchu Manoj : సినిమా ఇండస్ట్రీకి చాలా రోజుల నుంచి దూరంగా ఉంటున్న మంచు మనోజ్ ఇప్పుడు మిరాయ్ అనే సినిమాతో మరోసారి తన సత్తా చాటుకోవడానికి రెడీ అవుతున్నాడు. ఇక ఇప్పుడు ఈ సినిమాతో కొత్త ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఇక తేజ సజ్జా హీరోగా వస్తున్న ఈ సినిమాలో మంచు మనోజ్ విలన్ క్యారెక్టర్ ని పోషిస్తున్నాడు. ఇక ఈరోజు ఆయన రోజు పుట్టినరోజు కావడం వల్ల ఆయనకు సంబంధించిన గ్లింప్స్ ని ఈరోజు రిలీజ్ చేశారు.

అయితే ఈ గ్లింప్స్ అద్భుతంగా ఉండడమే కాకుండా ఆయన్ని సరికొత్త కోణం లో చూపించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఇక హీరో క్యారెక్టర్ లో చేయడమే కాకుండా అవకాశం వచ్చినప్పుడు విలన్ గా కూడా అదరగొడతాను అంటూ ఇంతకుముందు ఆయన చాలాసార్లు చెప్పారు. ఇక అతను చెప్పినట్టుగానే ఈ సినిమాలో ఒక బీభత్సమైన క్యారెక్టర్ ను పోషిస్తూ తన నట విశ్వరూపాన్ని చూపించబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక దాదాపు ఆరు సంవత్సరాల నుంచి ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ వస్తున్నారు.

ఇక మొత్తానికైతే ఇప్పుడు మళ్లీ సినిమాల్లో నటిస్తున్నాడు అనే న్యూస్ తెలుసుకున్న మంచు ఫ్యామిలీ అభిమానులందరూ కూడా పండగ చేసుకుంటున్నారు. ఇక బ్లాక్ స్వార్డ్ గా ఈ టీజర్ ని రిలీజ్ చేశారు. ఇక ఈ సినిమాలో ఈయన క్యారెక్టర్ ఏంటో తెలిస్తే నిజంగా అందరూ ఆశ్చర్యపోతారు.  ప్రపంచాన్ని నాశనం చేయడానికి తను ఒక పెను విపత్తును సృష్టిస్తాడట.

ఇక దాన్ని హీరో ఎలా ఆపుతాడు అనే దాని మీదనే ఈ సినిమా కూడా రన్ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఇంతకుముందు హనుమాన్ సినిమాను కనక మనం చూసుకుంటే అది కూడా ఇలాంటి టైప్ ఆఫ్ స్టోరీనే కావడం విశేషం… ఇక ఇప్పుడు ఈ సినిమా కనక సక్సెస్ అయితే మాత్రం మనోజ్ కి భారీ ఆఫర్లు అయితే వస్తాయని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు…చూడాలి మరి ఈ సినిమా తో తను ఎలాంటి మ్యాజిక్ చేస్తాడు అనేది…