https://oktelugu.com/

Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం

Shanmukh Jaswanth: యూట్యూబర్ గా మరియు బిగ్ బాస్ రన్నర్ గా షణ్ముఖ్ జస్వంత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఈయన చేసిన షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుంది..ఒక్క మాట లో చెప్పాలి అంటే యూట్యూబర్ గా షణ్ముఖ్ జస్వంత్ కి ఉన్న క్రేజ్ మరెవ్వరికీ లేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఆయనకీ ఉన్న క్రేజ్ వల్లే బిగ్ బాస్ లో కూడా ఛాన్స్ దొరికింది..టైటిల్ విన్నర్ అవ్వాల్సిన షణ్ముఖ్ […]

Written By:
  • Neelambaram
  • , Updated On : June 1, 2022 / 11:44 AM IST

    Shanmukh Jaswanth

    Follow us on

    Shanmukh Jaswanth: యూట్యూబర్ గా మరియు బిగ్ బాస్ రన్నర్ గా షణ్ముఖ్ జస్వంత్ ప్రతి ఒక్కరికి సుపరిచితమే..ఈయన చేసిన షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ లో మిలియన్స్ వ్యూస్ ని సొంతం చేసుకుంది..ఒక్క మాట లో చెప్పాలి అంటే యూట్యూబర్ గా షణ్ముఖ్ జస్వంత్ కి ఉన్న క్రేజ్ మరెవ్వరికీ లేదు అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు..ఆయనకీ ఉన్న క్రేజ్ వల్లే బిగ్ బాస్ లో కూడా ఛాన్స్ దొరికింది..టైటిల్ విన్నర్ అవ్వాల్సిన షణ్ముఖ్ జస్వంత్ హౌస్ లోకి వెళ్లిన తర్వాత సిరి అనే అమ్మాయి తో రిలేషన్ మైంటైన్ చెయ్యడం వల్ల ఆయన గ్రాఫ్ మొత్తం డౌన్ అయ్యి రన్నర్ గా మిగిలాడు అని అందరూ అంటూ ఉంటారు..బిగ్ బాస్ రియాలిటీ షో ఆయనకీ కెరీర్ పరంగా ఎంత సహాయ పడిందో, వ్యక్తిగతంగా అంతే దెబ్బ తీసింది అనే చెప్పాలి..హౌస్ నుండి బయటకి వచ్చిన తర్వాత ఆయన లవర్ దీప్తి సునైనా బ్రేకప్ చెప్పిన సంగతి మన అందరికి తెలిసిందే..ఈ సంఘటన షణ్ముఖ్ జస్వంత్ ని చాలా క్రుంగతీసింది..ఇప్పుడిప్పుడే తన మనసుకి అయినా గాయాలను మెల్లిగా మర్చిపోతున్న సమయం లో ఇటీవల జరిగిన ఒక్క సంఘటన ఆయనని మరింత కృంగదీసింది.

    Shanmukh Jaswanth

    Also Read: Divya Vani: దివ్యవాణి ఎందుకిలా చేసింది? టీడీపీలో ఉన్నట్టా? జగన్ కోవర్టా?

    అదేమిటి అంటే తనకి ఎంతో ఇష్టమైన బామ్మ ఇటీవలే కన్ను మూయడం షణ్ముఖ్ జస్వంత్ ని తీవ్రమైన దిగ్బ్రాంతికి లోను అయ్యేలా చేసింది..తన బామ్మ తో కలిసి చేసిన ఒక్క వీడియో ఇంస్టాగ్రామ్ అకౌంట్ లో పోస్టు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ గా మారింది..ఈ వీడియో చూస్తే తనకి తన బామ్మ తో ఎలాంటి రిలేషన్ ఉందొ అర్థం చేసుకోవచ్చు..మానసికంగా కృంగిపోయిన సమయం లో ఇలాంటి సంఘటన మరొక్కటి జరగడం దురదృష్టకరం అని ఆయన అభిమానులు ఇంస్టాగ్రామ్ లో కామెంట్స్ చేస్తూ షణ్ముఖ్ జస్వంత్ కి సంతాపం వ్యక్తం చేస్తున్నారు..ఇది ఇలా షణ్ముఖ్ షణ్ముఖ్ జస్వంత్ కెరీర్ పరంగా మరో లెవెల్ కి వెళ్ళాడు అనే చెప్పాలి..ఆయన హీరోగా నటిస్తున్నవెబ్ సిరీస్ ఏజెంట్ ఆనంద్ సంతోష్ త్వరలోనే ఆహ OTT ఛానల్ లో స్ట్రీమింగ్ కానుంది..ఇప్పటి వరుకు కేవలం యూట్యూబ్ కి మాత్రమే పరిమితం అయినా షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు తొలిసారిగా OTT లోకి అడుగుపెడుతున్నాడు..షూటింగ్ కార్యక్రమాలు శెరవేగంగా జరుపుకుంటున్న ఈ వెబ్ సిరీస్ అతి త్వరలోనే ఆహా లో అందుబాటులోకి రానుంది.

    Also Read: Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావం.. బీజేపీ రాజకీయం

    Recommended Videos:


    Tags