Kamal Haasan- Venkatesh: విక్రమ్ ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ శిల్పకళావేదికలో మే 31న ఘనంగా జరిగింది. ఈ వేడుకకు విక్టరీ వెంకటేష్ అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కమల్ హాసన్ ని పొగుడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వెంకటేష్ మాట్లాడుతూ.. నటుడిగా కమల్ హాసన్ 60 ఏళ్ల ప్రస్థానం పూర్తి చేశారు. ఇప్పటికీ ఆయన పదహారేళ్ళ టీనేజ్ కుర్రాడిలానే ఉన్నారు. కమల్ హాసన్ గారి ఈవెంట్ అనగానే రాకుండా ఉండలేకపోయాను. ఆయన బహుముఖ ప్రజ్ఞాశాలి. రచయితగా, దర్శకుడిగా, నిర్మాతగా, నటుడిగా రాణించారు. ఆయన నుండి మనం చాలా విషయాలు నేర్చుకోవాలి. నేను ఒక నటుడిగా కమల్ హాసన్ నుండి ఎంతో నేర్చుకున్నాను.
‘ఈనాడు’ మూవీలో ఆయనతో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. అప్పట్లోనే కమల్ హాసన్ ”ఏక్ దూజే కేలియే” మూవీతో పాన్ ఇండియా స్టార్ గా సత్తా చాటారు. నటుడిగా నాకు కమల్ స్ఫూర్తినిచ్చారని వెంకటేష్ కమల్ హాసన్ పై ప్రశంసల వర్షం కురిపించారు. అనంతరం కమల్ హాసన్ మాట్లాడారు. 45 ఏళ్ల క్రితం నేను అక్కినేని నాగేశ్వరరావు గారు నటించిన శ్రీమంతుడు సినిమా కోసం హైదరాబాద్ వచ్చాను. అప్పటి నుండే ఇక్కడి పద్ధతులు అలవాటు చేసుకోవడం మొదలుపెట్టాను. తెలుగులో నాకు వరుస విజయాలు దక్కాయి. నా గురువు బాలచందర్ దర్శకత్వంలో 35 సినిమాలు చేశాను. నాకు నటనలో అది పిహెచ్ డి అని చెప్పొచ్చు. అందరి సమిష్టి సహకారంతో నేను ఈ స్థాయికి చేరుకోగలిగానని కమల్ అన్నారు.
Also Read: Telangana Formation Day: తెలంగాణ ఆవిర్భావం.. బీజేపీ రాజకీయం
ఇక విక్రమ్ చిత్రానికి మంచి టీమ్ దొరికింది. లోకేష్ కనకరాజ్ ప్రతిభ కలిగిన దర్శకుడు. గొప్ప టీమ్ కారణంగానే ఈ సినిమా సాధ్యమైంది, అన్నారు. అనంతరం విక్రమ్ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్న హీరో నితిన్ మాట్లాడారు. చిన్నప్పటి నుండి ఆయన సినిమాలు చూస్తూ పెరిగాను. కమల్ హాసన్ గారు ఓ మాస్టర్ పీస్. ఆయన సినిమా విడుదల చేయడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను. మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఏఆర్ రెహమాన్ తర్వాత నాకు అనిరుధ్ అంటే చాలా ఇష్టం అన్నారు. విక్రమ్ మూవీలో కమల్, ఫహద్ ఫాసిల్, విజయ్ సేతుపతి లుక్స్ అద్భుతంగా ఉన్నాయి అన్నారు.
ఖైదీ, మాస్టర్ చిత్ర విజయాలతో ఊపు మీదున్న లోకేష్ కనగరాజ్ తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో అంచనాలు బాగా పెరిగాయి. కమల్ చాలా కాలం తర్వాత ఓ కమర్షియల్ ఎంటర్టైనర్ చేస్తున్నారు. జూన్ 3న తెలుగు, తమిళ, మలయాళ, హిందీ, కన్నడ భాషల్లో విడుదల కానుంది. ప్రపంచవ్యాప్తంగా 500 థియేటర్స్ లో విక్రమ్ విడుదల చేస్తున్నట్లు సమాచారం.
Also Read:Divya Vani: దివ్యవాణి ఎందుకిలా చేసింది? టీడీపీలో ఉన్నట్టా? జగన్ కోవర్టా?
Recommended Videos