https://oktelugu.com/

Pawan Kalyan- Sai Dharam Tej: పవన్ రాక కోసం ధరమ్ ఎదురుచూపులు!

Pawan Kalyan- Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. దాదాపు నెల రోజులు ఆయన హాస్పిటల్ బెడ్ కే పరిమితమయ్యారు. ఆయన కోలుకున్నందుకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అలాగే ఆయన నెక్స్ట్ సినిమా షురూ చేయాలని కోరుకుంటున్నారు. ఇటీవల పవన్-సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ వినోదయ సిత్తం రీమేక్ ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శకుడు సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్-సాయి ధరమ్ […]

Written By:
  • Shiva
  • , Updated On : June 1, 2022 / 11:47 AM IST

    Pavan Sai Dharam

    Follow us on

    Pawan Kalyan- Sai Dharam Tej: మెగా హీరో సాయి ధరమ్ పెను ప్రమాదం నుండి బయటపడ్డారు. దాదాపు నెల రోజులు ఆయన హాస్పిటల్ బెడ్ కే పరిమితమయ్యారు. ఆయన కోలుకున్నందుకు ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. అలాగే ఆయన నెక్స్ట్ సినిమా షురూ చేయాలని కోరుకుంటున్నారు. ఇటీవల పవన్-సాయి ధరమ్ తేజ్ మల్టీస్టారర్ వినోదయ సిత్తం రీమేక్ ప్రకటించిన విషయం తెలిసిందే. దర్శకుడు సముద్రఖని ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఆయన ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పవన్-సాయి ధరమ్ తో ఈ చిత్రం చేస్తున్నట్లు ప్రకటించారు.

    Pawan Kalyan- Sai Dharam Tej

    దాదాపు తొమ్మిది నెలలు ఇంటికే పరిమితమైన సాయి ధరమ్ వినోదయ సిత్తం షూటింగ్ షురూ చేస్తే సెట్స్ లోకి వెళదామని ఆశపడుతున్నారు. కానీ పవన్ రాజకీయ ఎజెండా కారణంగా ఈ మూవీ షూటింగ్ అంతకంతకూ ఆలస్యం అవుతుంది. వినోదయ సిత్తం కోసం పవన్ కేవలం 20 నుండి 25 రోజుల కాల్ షీట్స్ మాత్రమే ఇచ్చారట. కథ రీత్యా పవన్ పాత్ర తక్కువ నిడివి కలిగి ఉంటుంది. అందుకే పవన్ ఈ రీమేక్ ఒప్పుకున్నారు. అయితే ఏపీలో ఎన్నికల హీట్ మొదలు కాగా… పవన్ ప్రజల్లో ఎక్కువగా ఉంటున్నారు.

    Also Read: Shanmukh Jaswanth: షణ్ముఖ్ జస్వంత్ ఇంట్లో తీవ్ర విషాదం

    2024 ఎన్నికలే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో ఆయన ఒప్పుకున్న చిత్రాలపై శ్రద్ధ తగ్గించారు. హరి హర వీరమల్లు షూటింగ్ నత్త నడకలా సాగుతుంది. హరీష్ శంకర్ మూవీ సెట్స్ పైకి వెళ్లడం లేదు. అలాగే జులైలో మొదలుకావాల్సిన వినోదయ సిత్తం రీమేక్ పరిస్థితి కూడా అలానే తయారైంది. ఈ చిత్ర షూటింగ్ సెప్టెంబర్ కి షిఫ్ట్ అయినట్లు వార్తలు అందుతున్నాయి. అప్పటికైనా ఖచ్చితంగా షురూ చేస్తారనే నమ్మకం లేదు. మరోవైపు మామ రాక కోసం అల్లుడు సాయి ధరమ్ ఎదురుచూస్తున్నారు.

    Pawan Kalyan- Sai Dharam Tej

    మరోవైపు ఈ చిత్ర రీమేక్ పట్ల ఫ్యాన్స్ అసంతృప్తిగా ఉన్నారు. పవన్ ఇమేజ్ కి ఏమాత్రం సెట్ కాని ఈ మూవీ చెయ్యొద్దని డిమాండ్ చేస్తున్నారు. గతంలో పవన్ చేసిన గోపాలా గోపాలా చిత్ర కథకు దగ్గరగా ఉండే వినోదయ సిత్తం తమకు కిక్ ఇవ్వదంటున్నారు. ఫ్యాన్స్ డిమాండ్స్ పట్టించుకోని పవన్ ఈ రీమేక్ చేయాలని డిసైడ్ అయ్యాడు.

    Also Read:Anushka Shetty: నా వల్ల కాదు అంటూ హీరో నవీన్ పోలిశెట్టి కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన అనుష్క
    Recommended Videos


    Tags