https://oktelugu.com/

Sai Dharam Tej: సాయి ధరమ్, వైసీపీ ఫ్యాన్స్ మధ్య సీరియస్ సోషల్ మీడియా వార్… కారణం ఏమిటో తెలుసా?

హీరో సాయి ధరమ్ తేజ్ - వైసీపీ కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వార్ నడుస్తుంది. సాయి ధరమ్ తేజ్ కి మద్దతుగా జనసేన కార్యకర్తలు వైసీపీ వాళ్లకు కౌంటర్లు ఇస్తున్నారు. అసలు ఈ వివాదానికి కారణం ఏమిటో చూద్దాం..

Written By:
  • S Reddy
  • , Updated On : August 27, 2024 / 10:00 AM IST

    Sai Dharam Tej

    Follow us on

    Sai Dharam Tej: సాయి ధరమ్ తేజ్ జనసేన పార్టీ సానుభూతి పరుడు. ఆయన మామయ్య పవన్ కళ్యాణ్ ఈ పార్టీ స్థాపించిన సంగతి తెలిసిందే. పవన్ కళ్యాణ్ తనకు స్ఫూర్తి అని సాయి ధరమ్ తరచుగా చెబుతూ ఉంటారు. ఈ క్రమంలో ఆయన అడుగుజాడల్లో నడుస్తానని పలుమార్లు తెలియజేశారు. ఇక ఇటీవల ఏపీలో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో సాయి ధరమ్ తేజ్ జనసేన తరపున ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురం నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించాడు.

    Also Read: పెళ్లి ఒకరితో..గర్భం మరొకరితో..పరువు తీసేసిన రామ్ చరణ్ హీరోయిన్!

    ఓటు వేసి పవన్ కళ్యాణ్ ని గెలిపించాలని కోరారు. పవన్ కళ్యాణ్ తో పటు జనసేన పార్టీ ఘన విజయం అందుకుంది. పోటీ చేసిన 21 అసెంబ్లీ 2 పార్లమెంట్ నియోజకవర్గాల్లో జనసేన విజయబావుటా ఎగరవేసింది. కూటమి ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎం అయ్యారు. జనసేన సానుభూతి పరుడిగా ఉన్న సాయి ధరమ్ తేజ్ పై వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియా దాడికి తెగబడుతున్నారు. వారి కామెంట్స్ ని ఆయన తిప్పికొడుతున్నారు.

    తాజాగా సాయి ధరమ్ తేజ్-వైసీపీ కార్యకర్తల మధ్య సీరియస్ సోషల్ మీడియా వార్ నెలకొంది. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నేపథ్యంలో ఏపీ ప్రస్తుతం సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటూ సాయి ధరమ్ తేజ్ ట్వీట్ ని వైసీపీ కార్యకర్తలు తప్పుబడుతున్నారు. ఏపీలో వరుసగా నేరాలు, ఘోరాలు జరుగుతుంటే సేఫ్ హ్యాండ్స్ లో ఉందంటావా? అని సాయి ధరమ్ తేజ్ ని ప్రశ్నిస్తున్నారు

    వైసీపీ కార్యకర్తలు విమర్శలకు సాయి ధరమ్ తేజ్ ధీటుగా సమాధానం చెబుతున్నారు. ఆయన ఎగ్ ఫఫ్ అంశం తెరపైకి తెచ్చి వైసీపీ నేతలకు కౌంటర్ ఇచ్చాడు. వైసీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం జగన్ కేవలం ఎగ్ పఫ్ లకే మూడు కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేశాడని తెలుగుదేశం నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే విషయాన్ని గుర్తు చేస్తూ సాయి ధరమ్ తేజ్ ఎగ్ పఫ్ ని సోషల్ మీడియాలో షేర్ చేశారు.

    సాయి ధరమ్ తేజ్- వైసీపీ కార్యకర్తల సోషల్ మీడియా వార్ సీరియస్ గా నడుస్తుంది. ఇక సాయి ధరమ్ తేజ్ కి మద్దతుగా జనసేన కార్యకర్తలు రంగంలోకి దిగారు. వైసీపీ కార్యకర్తలకు కౌంటర్లు ఇస్తున్నారు. ఇక సాయి ధరమ్ తేజ్ కొత్త మూవీ విషయానికి వస్తే… గంజా శంకర్ టైటిల్ తో మూవీ ప్రకటించాడు. దీనిపై మరల ఎలాంటి అప్డేట్ లేదు. సంపత్ నంది దర్శకుడు కాగా… ప్రాజెక్ట్ ఆగిపోయిందంటూ ప్రచారం జరుగుతుంది.

    Also Read: 10 నిమిషాల లోపే హౌస్ ఫుల్స్..’గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు మామూలుగా లేదుగా!