https://oktelugu.com/

Mileage Cars: మైలేజ్ మహరాజులు ఈ కార్లు.. ధర తక్కువే.. అవేవో తెలుసుకోండి..

దేశంలో మారుతి కంపెనీ నుంచి వివిధ వేరయింట్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేవిధంగా ఈ కంపెనీ కార్లు ఉంటాయి. లేటేస్టుగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు కూడా మారుతి కంపెనీలో ఉన్నాయన్న చర్చ సాగుతోంది. వీ

Written By:
  • Srinivas
  • , Updated On : August 27, 2024 / 09:53 AM IST

    Mileage Cars

    Follow us on

    Mileage Cars: కారు కొనాలనే చాలా మంది వివిధ అభిప్రాయాలను కలిగి ఉంటారు. కొందరు కారు బడ్జెట్ గురించి ఆలోచిస్తే..మరికొందరు ఫీచర్స్ పై దృష్టి పెడుతారు.ఇంకొందరు కారు మైలేజ్ గురించి వాకబు చేస్తారు. ఏ వ్యక్తికి అయినా మంచి మైలేజ్ ఇచ్చే కారుకు ప్రిఫరెన్స్ ఇస్తుంటారు. అయితే కేవలం మైలేజ్ విషయంలోనే ఫోకస్ పెట్టి వినియోగదారుల మనసును దోచుకుంటున్నాయి కొన్ని కార్లు. ఇవి ఇప్పటికే మార్కెట్లో ఉన్నప్పటికీ ఇవి అత్యధిక మైలేజ్ ఇస్తాయన్న విషయం కొందరు గుర్తించలేదు. అయితే ఇటీవల సంబంధిత కార్ల కంపెనీలు మైలేజ్ గురించి ఎక్కువగా వివరిస్తున్నాయి. దీంతో మైలేజ్ కోరుకునే వారు వీటి గురించి ఆలోచిస్తున్నారు. అయితే మార్కెట్లో ప్రస్తుతం ఉన్న కార్లలో మంచి మైలేజ్ ఇచ్చేవి ఏవో చూద్దాం..

    దేశంలో మారుతి కంపెనీ నుంచి వివిధ వేరయింట్లు ఇప్పటికే మార్కెట్లోకి వచ్చి హల్ చల్ చేస్తున్నాయి. అన్ని వర్గాల వినియోగదారులను ఆకట్టుకునేవిధంగా ఈ కంపెనీ కార్లు ఉంటాయి. లేటేస్టుగా ఎక్కువ మైలేజ్ ఇచ్చే కార్లు కూడా మారుతి కంపెనీలో ఉన్నాయన్న చర్చ సాగుతోంది. వీటిలో Maruthi Suzuki Celerio గురించి చెప్పుకోవచ్చు. హ్యాచ్ బ్యాక్ వేరియంట్ లో వచ్చిన ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో పనిచస్తుంది. మాన్యువల్ తో పాటు ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో నడిచే ఈ కారు లీటర్ పెట్రోల్ కు 25.24 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇందులో డ్యూయెట్ జెట్ ఇంజిన్ ను అమర్చారు. అందుల్ల ఇది ఎక్కువ మైలేజ్ ను అందిస్తుంది.

    ఇదే కంపెనీకి చెందిన మరో కారు Dzire బెస్ట్ మైలేజ్ కారుగా పేరు తెచ్చుకుంది. ఇది కాంపాక్ట్ సెడాన్ వేరియంట్ లో అందుబాటులో ఉంది. ఇందులో 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఉండి మాన్యువల్ గేర్ బాక్స్ తో పనిచేస్తుంది. ఈ కారణంగా ఈ కారు 22.41 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో అయితే 22.61 కిలోమీటర్ల మైలేజ్ వర్కౌట్ అవుతుంది. ఇందులో ఇంజిన్ పనితీరు మాత్రమే కాకుండా ఆకట్టుకునే ఫీచర్స్ ఉన్నాయి. అలాగే లాంగ్ డ్రైవ్ లో ఇది బెస్ట్ కారుగా నిలిచింది.

    హోండా కంపెనీకి చెందిన కార్లను ఎక్కువ మంది కోరుకుంటారు. ఈ కారు నుంచి రిలీజ్ అయినా హోండా సిటీ 5th Generation సెడాన్ కారు అద్భుతమైన మైలేజ్ కారుగా పేరు తెచ్చుకుంది. ఇందులో 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ను కలిగి ఉంటుంది. 5 స్పీడ్ మాన్యువల్, 6 స్పీడ్ ఆటోమేటిక్ గేర్ బాక్స్ తో పనిచేసే ఈ మోడల్ లీటర్ పెట్రోల్ కు 24.1 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తుంది. ఇది సెడాన్ కారు అయినప్పటికీ ఎస్ యూవీ వలె కారులో బూట్ స్పేస్ ఎక్కువగా ఉంటుంది.

    ఇవే కాకుండా మరికొన్ని మైలేజ్ ఇచ్చే కార్లు అందుబాటులో ఉన్నాయి. అయితే పెట్రోల్ వేరియంట్ లో కాకుండా సీఎన్ జీలో మైలేజ్ ఎక్కువగా వస్తుందనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.