Gabbar Singh  Re-Release : 10 నిమిషాల లోపే హౌస్ ఫుల్స్..’గబ్బర్ సింగ్’ రీ-రిలీజ్ అడ్వాన్స్ బుకింగ్స్ ఊపు మామూలుగా లేదుగా!

గబ్బర్ సింగ్ చిత్రానికి వారం రోజుల ముందే 330 కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. సిడ్నీ లోని ఒక థియేటర్ లో బుకింగ్స్ ప్రారంభించిన 10 నిమిషాలలోపే హౌస్ ఫుల్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇక్కడ కొత్త సినిమాలకు కూడా ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు జరుగలేదు.

Written By: Vicky, Updated On : August 26, 2024 9:54 pm

Gabbar Singh  Re-Release

Follow us on

Gabbar Singh  Re-Release :  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ‘గబ్బర్ సింగ్’ చిత్రం ఎంతో ప్రత్యేకం. వరుస ఫ్లాప్స్ లో ఉన్న పవన్ కి ఈ చిత్రం మైలురాయిగా నిల్చింది. అప్పటి వరకు ఉన్నటువంటి రికార్డ్స్ అన్నిటిని బద్దలు కొట్టి, ఆల్ టైం టాప్ 2 చిత్రం గా నిల్చింది. కేవలం నెల్లూరు, నైజాం, సీడెడ్ ప్రాంతాలలో తప్ప, మిగిలిన అన్ని ప్రాంతాలలో ఈ చిత్రం అప్పటి ఆల్ టైం ఇండస్ట్రీ హిట్ మగధీర రికార్డ్స్ ని బద్దలు కొట్టింది. ప్రపంచవ్యాప్తంగా సుమారుగా 62 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం, ఓవర్సీస్ లో ‘దూకుడు’ తర్వాత 1 మిలియన్ మార్కుని దాటిన చిత్రంగా నిల్చింది. ఈ సినిమా రికార్డ్స్ ని బాహుబలి వరకు ఒక్క హీరో కూడా ముట్టుకోలేకపోవడం అప్పటి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపోయేలా చేసింది. అలాంటి చిత్రం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 2 వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కాబోతుంది.

ఇప్పటికే ఓవర్సీస్ లో ఈ చిత్రానికి ఆల్ టైం రికార్డు రేంజ్ గ్రాస్ వచ్చే అవకాశాలు ఉన్నాయని బుకింగ్స్ ని చూస్తేనే అర్థం అవుతుంది. ఆస్ట్రేలియా లో గత రీ రిలీజ్ చిత్రం ‘మురారి’ కి విడుదల ముందు రోజు వరకు 331 టిక్కెట్లు మాత్రమే అమ్ముడుపోయాయి. కానీ గబ్బర్ సింగ్ చిత్రానికి వారం రోజుల ముందే 330 కి పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. సిడ్నీ లోని ఒక థియేటర్ లో బుకింగ్స్ ప్రారంభించిన 10 నిమిషాలలోపే హౌస్ ఫుల్ అవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించే విషయం. ఇక్కడ కొత్త సినిమాలకు కూడా ఈ స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ఇప్పటి వరకు జరుగలేదు. అలాగే ఈ సినిమాకి సంబంధించిన విజయవాడ అడ్వాన్స్ బుకింగ్స్ రెండు థియేటర్స్ లో కాసేపటి క్రితమే బుకింగ్స్ ప్రారంభించారు. అందులో ‘శైలజ’ థియేటర్ కేవలం 6 నిమిషాల్లోనే హౌస్ ఫుల్ అవ్వడం విశేషం. ప్రారంభ స్థాయిలోనే బుకింగ్స్ ఈ రేంజ్ లో ఉన్నాయంటే, ఇక పూర్తి స్థాయిలో బుకింగ్స్ ప్రారంభిస్తే ఏ స్థాయిలో అడ్వాన్స్ బుకింగ్స్ జరుగుతాయో అర్థం చేసుకోవచ్చు.

ఇదే ఊపు కొనసాగిస్తే ఈ చిత్రం రీ రిలీజ్ చిత్రాలలో మొట్టమొదటి సారి మొదటి రోజే 10 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన ఏకైక చిత్రంగా నిలిచిపోతుంది. సోమవారం రోజు పనిదినం అయ్యినప్పటికీ కూడా ఇలాంటి బుకింగ్స్ జరగడం కేవలం పవర్ స్టార్ కి మాత్రమే సాధ్యమని అంటున్నారు ఆయన అభిమానులు. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించిన రీ రిలీజ్ ట్రైలర్ ని రేపు ఆ చిత్ర దర్శకుడు హరీష్ శంకర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా విడుదల చెయ్యబోతున్నాడు. ఈ రీ రిలీజ్ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అంతే కాకుండా రేపటి నుండే పూర్తి స్థాయి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి.