Naresh-Pavitra Lokesh: నరేశ్, పవిత్ర లోకేశ్ ల గురించి రోజుకో న్యూస్ బయటపడుతోంది. తాము పెళ్లి చేసుకోబోతున్నామని చెప్పిన ఈ జంట ఇప్పటికే సహజీవనం కొనసాగిస్తోంది. అయితే వీరిని మీడియా పదే పదే ప్రశ్నలు అడగడంతో లివింగ్ రిలేషన్ షిప్ తప్పా..? అంటూ ఎదురుదాడి చేశారు. ఈ క్రమంలో వీరి గురించి మరో సంచలన విషయం బయటపడింది. నరేశ్, పవిత్ర లోకేల్ లు కలిసి ఓ అగ్రిమెంట్ చేసుకున్నారట. అయితే అదేదో వివాహానికి సంబంధించిన అగ్రిమెంట్ కాదు. అంతకుమించి అని తెలుస్తోంది.. దాని గురించి తాజాగా లీక్ కావడంతో అది సంచలనమైంది.

సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న పవిత్ర లోకేశ్ కు భర్త, పిల్లలు ఉన్నారు. వారిని కాదని ప్రముఖ నటుడు నరేశ్ తో ఎఫైర్ పెట్టుకున్నారు. నరేశ్ తో ప్రేమాయణం కొనసాగిస్తున్నాని పవిత్ర అధికారికంగా ప్రకటించారు. అయితే లేటు వయసులో ఘాటు ప్రేమ అని అనుకున్నారు. కానీ ఆ మధ్య కర్ణాటకలోని ఓ హోటల్ లో వీరిని నరేశ్ మూడో భార్య రెడ్ హ్యండెడ్ గా పట్టుకున్నారు. పెళ్లి చేసుకుందామనుకున్న వీరు పెళ్లికి ముందు డేటింగ్ లో ఉన్నట్లు అర్థమైంది. అయినా ఇదేదో పెద్ద విషయం కాదని కొందరు అనుకున్నారు. కానీ ఇంతలో ఓ షాకింగ్ న్యూస్ బయటికొచ్చింది.
Also Read: Nandamuri Balakrishna Fires On Dil Raju: నిర్మాత దిల్ రాజు పై నిప్పులు చెరుగుతున్న నందమూరి బాలకృష్ణ
నరేశ్, పవిత్ర లోకేశ్ ల మధ్య ఓ అగ్రిమెంట్ పెట్టుకున్నారట. ఈ అగ్రిమెంట్ వివాహానికి సంబంధించినది కాదట. ఇందులో నరేశ్ నెలకు రూ.25 లక్షలను పవిత్రా లోకేశ్ ఇవ్వాలని ఉందట. అంతేకాకుండా ఒకవేళ అగ్రిమెంట్ ను ఉల్లంఘించి నరేశ్ వేరే అమ్మాయితో ఎఫైర్ పెట్టుకుంటే రూ.3 కోట్లు ఇవ్వాలని ఉందట. తన భర్తను, పిల్లలను కాదని వచ్చిన తనకు ఆ మాత్రం సెక్యూరిటీ లేకపోతే ఎలా అని పవిత్రాలోకేశ్ భావించి ఈ కండీషన్ పెట్టిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఈ మేరకు కొందరు సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటున్నారు. ఇలాంటి అగ్రిమెంట్లు కూడా ఉంటాయా..? అని కొందరు ఆశ్చర్యపోతున్నారు.

కేవలం డేటింగ్ కోసమే ఇలా డబ్బులతో అగ్రిమెంట్ చేసుకున్నారా..? అని సినీ ఇండస్ట్రీలో చర్చ సాగుతోంది. సినిమా ఇండస్ట్రీలో పెళ్లిళ్లు చేసుకోవడం.. విడిపోవడం కామన్. అంతేకాకుండా పెళ్లి చేసుకోకుండా లివింగ్ రిలేషన్ షిప్ కొనసాగించడం మరీ కామన్. కానీ ఇలా లివింగ్ రిలేషన్ షిప్ కోసం కూడా ఓ అగ్రిమెంట్ పెట్టుకోవడమే ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మొన్నటి వరకు మేం ప్రేమ పక్షులమని ప్రకటించిన ఈ జంట ఇప్పుడీ అగ్రిమెంట్ పై ఎలా స్పందిస్తారో చూడాలని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read:Pokri Re-Release Bookings: పోకిరి రీ – రిలీజ్.. అడ్వాన్స్ బుకింగ్స్ ద్వారా ఎంత వసూలు చేసిందో తెలుసా?