Seetharam and Prabhas : తెలుగు సినిమా ఇండస్ట్రీలో యంగ్ రెబల్ స్టార్ గా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సంపాదించుకున్న నటుడు ప్రభాస్(Prabhas)…ప్రస్తుతం ఆయన చేస్తున్న సినిమాలన్నీ కూడా ఆయనకంటూ ఒక గొప్ప గుర్తింపును కూడా సంపాదించి పెట్టాయి. ఇప్పుడు రాఘవపూడి దర్శకత్వంలో ఫౌజీ (Fouji) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ చేయాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఈ సినిమా లవ్ స్టోరీ గా తెరకెక్కడమే కాకుండా ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో కూడా మరొక పెను సంచలనాన్ని సృష్టించే సినిమాగా మిగలబోతుంది. ప్రభాస్ లాంటి నటుడు ఈ సినిమాతో యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మరోసారి షేక్ చేయాలని చూస్తున్నాడు. ఇప్పటికే బాహుబలి సినిమాతో తనకంటూ ఒక సపరేట్ క్రేజ్ ను సొంతం చేసుకున్న ప్రభాస్ అప్పటినుంచి ఇప్పటివరకు వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు. ఇక ఇప్పటివరకు ప్రభాస్ చేసిన సినిమాలు ఒకెత్తయితే ఇక మీదట ఆయన చేయవల్సిన సినిమాలు మరొక ఎత్తుగా మారబోతున్నాయి.
Also Read : పెళ్లి పై మీడియాకు అధికారిక ప్రకటన చేసిన ప్రభాస్!
ఎందుకంటే ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిపోయాడు. చాలా తక్కువ సమయంలోనే పాన్ ఇండియా సినిమాలు చేస్తూ మంచి విజయాలను సాధిస్తున్నాడు. మరి ఇలాంటి క్రమంలో ఆయన చేస్తున్న సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా ఉంది…
ఫౌజీ సినిమాలో విలన్ గా హాలీవుడ్ నటుడుని తీసుకున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఈ సినిమా ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ గా అయితే ఉంటుందట. మరి దాన్ని బ్రేక్ చేయడానికి విలన్ విపరీతంగా ప్రయత్నం చేస్తాడని అలాగే ఆర్మీ బ్యాక్ డ్రాప్ లో వస్తుంది కాబట్టి అందుకని హాలీవుడ్ నటుడుని తీసుకోవడం వల్ల మాత్రమే ఈ సినిమాకి దర్శకుడు న్యాయం చేసినట్టు అవుతుందని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అందువల్లే హను రాఘవ పూడి ఒక మంచి హాలీవుడ్ నటుడిని ఇండస్ట్రీకి పరిచయం చేయబోతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.
ప్రభాస్ చేసిన సినిమాలన్నీ అతనికి మంచి సక్సెస్ లను కట్టబెడుతున్న వేళ ఈ సినిమాతో 2000 కోట్లు మార్కెట్ ను టచ్ చేయడమే కాకుండా ఇండస్ట్రీ రికార్డులు మొత్తం బ్రేక్ చేయాడమే లక్ష్యంగా పెట్టుకొని అటు డైరెక్టర్ ఇటు హీరో ఇద్దరూ దృఢ సంకల్పంతో ముందుకు సాగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే హను రాఘవపూడి కూడా ఇంతకుముందు చేసిన సీతారామం సినిమా కూడా లవ్ స్టోరీయే కావడం అలాగే ఆర్మీ బ్యాక్ గ్రౌండ్ లో తెరకెక్కిన సినిమానే కావడం వల్ల దీనికి దానికి ఏదైనా పోలికలు ఉంటాయా అనే ధోరణిలో కూడా కొన్ని అనుమానాలైతే వ్యక్తం అవుతున్నాయి…
Also Read : ప్రముఖ పారిశ్రామికవేత్త కూతురు తో ప్రభాస్ పెళ్లి ఫిక్స్..ట్విస్ట్ అదిరింది కదూ!