Prabhas
Prabhas : కోట్లాది మంది అభిమానులు ప్రభాస్(Rebel Star Prabhas) పెళ్లి కోసం ఎంత ఆతృతగా ఎదురు చూస్తున్నారో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇండియా లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ గా పిలవబడే సెలబ్రిటీస్ అందరూ ఒక్కొక్కరుగా పెళ్లి చేసుకొని స్థిరపడుతున్నారు. కానీ ప్రభాస్ కి 45 ఏళ్ళ వయస్సు వచ్చినా ఇంకా పెళ్లి చేసుకోకపోవడం అభిమానుల్లో కాస్త అసంతృప్తి ఏర్పడింది. ఇంకెన్ని సంవత్సరాలు ప్రభాస్ ఇలా సింగిల్ గా ఉండిపోతాడు?, అసలు ప్రభాస్ పెళ్లి చేసుకుంటాడా?, లేదా? అని అభిమానులు సోషల్ మీడియా లో కామెంట్స్ చేసేవారు. అయితే ఎట్టకేలకు ప్రభాస్ పెళ్లి పై సస్పెన్స్ వీడిందని ఇండస్ట్రీ వర్గాల్లో ఒక టాక్ నడుస్తుంది. ఇన్ని రోజులు ప్రభాస్ భీమవరం ప్రాంతానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడని అందరూ ఊహించారు కానీ, ఆయన హైదరాబాద్ లోని ఒక ప్రముఖ పారిశ్రామిక వేత్త కూతురు ని పెళ్లి చేసుకోబోతున్నాడని లేటెస్ట్ గా వినిపిస్తున్న టాక్.
Also Read : వేల సంబంధాలు వచ్చిన ప్రభాస్ ఎందుకు పెళ్లి చేసుకోలేదంటే?
పెళ్లి చూపులు, పెళ్ళికి సంబంధించిన చర్చలు మొత్తం పూర్తి అయ్యాయని, త్వరలోనే ఈ విషయం లో అభిమానులు శుభవార్త వింటారని అంటున్నారు. ఇంతకు ఎవరు ఆ అమ్మాయి అనేది బయటకు రాలేదు. చాలా జాగ్రత్తగా , రహస్యంగా వివరాలను ఉంచారు. ప్రభాస్ పెద్దమ్మ శ్యామలా దేవి త్వరలోనే మీడియా సమావేశం ద్వారా ఈ విషయాన్నీ వెల్లడిస్తుందని అంటున్నారు. ప్రభాస్ పెళ్లి గురించి సోషల్ మీడియా లో ఇప్పటి వరకు ఎన్ని ప్రచారాలు జరిగాయో మనమంతా చూసాము. ప్రముఖ స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి(Anushka Shetty) తో ప్రభాస్ ప్రేమాయాం నడుపుతున్నాడని, ప్రస్తుతం ఆమెతోనే డేటింగ్ లో ఉన్నాడంటూ వార్తలొచ్చాయి. కానీ వాటిల్లో ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత తెలిసింది. మరో ఆసక్తి కరమైన రూమర్ ఏమిటంటే ‘ఆదిపురుష్’ సినిమా చేస్తున్న సమయంలో బాలీవుడ్ హీరోయిన్ ‘కృతి సనన్'(Krithi Sanon) ప్రభాస్ తో క్లోజ్ గా ఉండడం చూసి వీళ్లిద్దరు పెళ్లి చేసుకోబోతున్నట్టు వార్తలు వచ్చాయి.
కొందరు అయితే ఒక అడుగు ముందుకేసి వీళ్లిద్దరికీ విదేశాల్లో నిశ్చితార్థం కూడా జరిగిపోయినట్టు చెప్పుకొచ్చారు. అది కూడా ఫేక్ ప్రచారం అని ఆ తర్వాత తెలిసింది. అలా ఎన్నో ఫేక్ ప్రచారాల తర్వాత ఎట్టకేలకు ప్రభాస్ ఒక గొప్ప ఇంటి వాడు అవ్వబోతున్నాడు. పెళ్లి తర్వాత ఆయన కొంత కాలం వరకు సినిమాలకు బ్రేక్ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆయన చేతిలో ‘రాజా సాబ్’, ‘ఫౌజీ’, ‘స్పిరిట్’, ‘సలార్ 2’, ‘కల్కి 2’, ‘బక’ వంటి సినిమాలు ఉన్నాయి. వీటిల్లో ‘రాజా సాబ్’ చిత్రం దాదాపుగా పూర్తి అయ్యింది. ‘ఫౌజీ’ మూవీ షూటింగ్ విరామం లేకుండా కొనసాగుతుంది. ఈ ఏడాది లోనే ‘స్పిరిట్’ చిత్రం కూడా మొదలు కానుంది. ఈ మూడు సినిమాలు పూర్తి అయ్యాకనే ఆయన పెళ్లి చేసుకుంటాడా?, లేకపోతే ఇంకా ముందే చేసుకుంటాడా అనేది తెలియాల్సి ఉంది.
Also Read : ప్రభాస్ తో ఆ దర్శకుడికి సినిమా చేయడం రాదు…అందుకే ఇలా చేస్తున్నాడా..?