https://oktelugu.com/

Vijay : తమిళనాడులో విజయ్ పార్టీ పరిస్థితి ఏంటి..? సర్వేలు చెప్తున్నవి నిజమేనా!

Vijay : సినీ నటులు రాజకీయాల్లోకి రాణించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అప్పట్లో ఎన్టీఆర్(NTR), ఎంజీఆర్(MGR) వంటి ప్రముఖులు మొదటిసారి పోటీ చేసినప్పుడే ముఖ్యమంత్రులు అయ్యారు.

Written By: , Updated On : March 29, 2025 / 08:27 AM IST
Vijay

Vijay

Follow us on

Vijay : సినీ నటులు రాజకీయాల్లోకి రాణించడం చాలా అరుదుగా జరుగుతూ ఉంటుంది. అప్పట్లో ఎన్టీఆర్(NTR), ఎంజీఆర్(MGR) వంటి ప్రముఖులు మొదటిసారి పోటీ చేసినప్పుడే ముఖ్యమంత్రులు అయ్యారు. వాళ్ళ తర్వాత మళ్ళీ ఎవరికీ అలాంటి అవకాశం రాలేదు. తమిళనాడు లో ఎంజీఆర్ తర్వాత విజయ్ కాంత్(Vijayakanth), కమల్ హాసన్(Kamal Hassan) వంటి వారు పార్టీలు పెట్టారు. విజయ్ కాంత్ పార్టీ ఒక మోస్తారు సక్సెస్ చూసినా, కమల్ హాసన్ పార్టీ ఉనికి ని చాటుకోలేకపోయింది. ఇప్పుడు ఆ పార్టీ DMK లో కలిసిపోయింది. ఇక మన తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే ఎన్టీఆర్ తో సమానమైన క్రేజ్ ఉన్న మెగాస్టార్ చిరంజీవి(Megastar Chiranjeevi) ప్రజారాజ్యం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఈ పార్టీ అప్పటి ప్రతికూల పరిస్థితులను ఎదురుకొని రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 18 శాతం కి పైగా ఓటు షేర్ ని అందుకుంది.

Also Read : మాతో పెట్టుకోవద్దు..జాగ్రత్త’ అంటూ మోడీకి విజయ్ స్ట్రాంగ్ వార్నింగ్!

18 అసెంబ్లీ స్థానాలను సైతం కైవసం చేసుకుంది. ఒక్క ఆంధ్ర ప్రాంతాన్ని లెక్కలోకి తీసుకుంటే దాదాపుగా 24 శాతం ఓటు బ్యాంక్ వచ్చింది. అలాంటి పార్టీ ని చిరంజీవి నడపలేకపోయాడు. కాంగ్రెస్ లోకి విలీనం చేశాడు. ఆ ఘటన జరిగిన కొన్నాళ్ళకు పవన్ కళ్యాణ్(Deputy CM Pawan Kalyan) జనసేన పార్టీ ద్వారా వచ్చాడు. 2019 లో ఒంటారిగా పోటీ చేసి, ఆరు శాతం ఓటు బ్యాంక్ ని సొంతం చేసుకొని, కేవలం ఒక్క అసెంబ్లీ స్థానాన్ని మాత్రమే గెలుచుకుంది ఈ పార్టీ. పవన్ కళ్యాణ్ సైతం రెండు స్థానాల్లో ఓడిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అంతటి ఘోరమైన ఓటమి తర్వాత పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ని నడపడం కష్టం, ఇక మూసేస్తాడు అని అంతా అనుకున్నారు. కానీ ఎన్నో ఒడిదుడుగులను ఎదురుకొని, జనసేన పార్టీ ని నిలబెట్టి, 2024 లో కూటమిని కట్టి సంచలన విజయం సాధించాడు. దేశంలోనే నూటికి నూరు శాతం స్ట్రైక్ రేట్ ని అందుకున్న ఏకైక పార్టీ గా జ్జనసేన ని నిలబెట్టి, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయ్యాడు.

ఇది ఇలా ఉండగా ఇప్పుడు తమిళనాట నెంబర్ 1 హీరో గా కొనసాగుతున్న విజయ్(Thalapathy Vijay) కి కూడా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా అంటే, ప్రస్తుతానికి లేనట్టే. ఆయన కూటమి గా పోటీ చేయకుండా, ఒంటరి పోరుకే సిద్ధమైనట్టు తెలుస్త్తుంది. చాలా మంది విశ్లేషకులు విజయ్ తమిళగ వెట్రి కజగం (TVK) పార్టీ అన్నా DMK తో పొత్తు పెట్టుకొని పోటీ చేస్తుందని అనుకున్నారు. కానీ అన్నా DMK పార్టీ బీజేపీ తో కలిసింది, కాబట్టి విజయ్ అటు వైపు వెళ్లే అవకాశాలే లేవట. మరి విజయ్ ఒంటరిగా పోటీ చేస్తే ఎన్ని స్థానాలు గెలుచుకోగలడు?, కనీసం ఆయన పోటీ చేసే స్థానంలో అయినా గెలుస్తాడా లేదా అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. విజయ్ తానూ పోటీ చేస్తున్న స్థానాన్ని నాలుగేళ్ల క్రితమే ఎంచుకున్నాడు. అక్కడ గెలవడానికి ఆయన పూర్తి స్థాయి గ్రౌండ్ వర్క్ కూడా చేసుకుంటూ వచ్చాడు.

కాబట్టి ఆయన పోటీ చేసే స్థానంలో కచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి కానీ, మిగిలిన స్థానాల్లో TVK గెలవడం అసాధ్యమని అంటున్నారు విశ్లేషకులు. సర్వేలు సైతం విజయ్ TVK ఒంటరిగా పోటీ చేస్తే 5 శాతం ఓటింగ్ రావడం కూడా కష్టమే అని అంటున్నారు. ఎందుకంటే విజయ్ జనాల్లోకి ఇంకా బలంగా వెళ్ళలేదు. ఆయన భావజాలం అభిమానులకు సైతం అంతు చిక్కడం లేదు. ఎదో అధికార పార్టీ DMK , కేంద్రం లో ఉన్న బీజేపీ కి వ్యతిరేకంగా పుట్టిన పార్టీ కాబట్టి వాళ్ళను మొక్కుబడిగా విమర్శిస్తున్నట్టే ఉంది కానీ, ఆయన ప్రసంగాల్లో ఎమోషన్ మిస్ అయ్యింది. ఎన్నికలకు సరిగ్గా ఏడాది సమయం ఉంది. ఈ ఏడాది కచ్చితంగా ఆయన జనాల్లోకి రావాల్సిన అవసరం ఉంది. కానీ అది జరగడం లేదు, సినిమా షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. 2026 , ఏప్రిల్ నెలలో అసెంబ్లీ ఎన్నికలు ఉంటే, విజయ్ తాను నటించిన ‘జన నాయగన్’ చిత్రాన్ని జనవరి లో విడుదల చేస్తున్నాడు. మూడు నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఎవరైనా సినిమాని విడుదల చేస్తారా? అంటూ విజయ్ పై పలువురు మండిపడుతున్నారు. అంతే కాకుండా TVK స్థాపించినప్పటి నుండి ఇప్పటి వరకు కేవలం ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలు మాత్రమే ఆ పార్టీ లో ఉన్నారు.

ఇతర రాజకీయ పార్టీలు అసలు విజయ్ పార్టీ ని పట్టించుకోవడం లేదు. విజయ్ ఇప్పటి వరకు DMK పై ఎన్నో విమర్శలు చేశాడు. కానీ ఆయన మాట్లాడిన మాటలకు DMK నుండి ఒక్కరు కూడా కౌంటర్లు ఇవ్వడం లేదు. అంటే విజయ్ ని అసలు పట్టించుకోవడం లేదు అన్నమాట. విజయ్ ఎట్టి పరిస్థితిలోను జనాల్లోకి వెళ్లాల్సిన అవసరం ఉంది, సినిమా అభిమానులు ఓట్లు వేసేస్తారు లే అనే గుడ్డి నమ్మకం తో ఉంటే మాత్రం ఓటమి తప్పదు. చూడాలి మరి రాబోయే రోజుల్లో ఆ పార్టీ ఎలా ఎదుగుతుంది అనేది.

Also Read : హిందీని బ్యాన్ చెయ్యాలి అనే తమిళ హీరో విజయ్ స్కూల్స్ లో హిందీ నేర్పిస్తున్నారా..? ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయారుగా!