Rajinikanth
Rajinikanth : యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలందరు మంచి విజయాలను సాధించడమే లక్ష్యంగా పెట్టుకొని మంచి కథలను ఎంచుకొని ముందుకు సాగుతున్నారు. మరి ఇలాంటి సందర్భంలోనే యంగ్ హీరోలు సైతం పాన్ ఇండియా బాట పట్టడానికి తీవ్రమైన ప్రయత్నం అయితే చేస్తున్నారు. మరి వాళ్ళందరూ వాళ్ళు చేస్తున్న సినిమాలు విషయంలో సక్సెస్ సాధిస్తారా లేదా అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి…
తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంటూ ముందుకు దూసుకెళుతున్న హీరోలు చాలామంది ఉన్నప్పటికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి ఉన్న గుర్తింపు గురించి ప్రత్యేకం గా చెప్పాలి. ఇప్పటివరకు ఆయన చేసిన ప్రతి పాత్ర తనకు మంచి గుర్తింపును తీసుకురావడమే కాకుండా యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తన వైపు తిప్పుకునేలా చేసింది. మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేస్తున్న ప్రతి సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు దూసుకెళ్తున్నాడు. గత సంవత్సరం చేసిన దేవర సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చేస్తున్న సినిమాతో మరోసారి పెను ప్రభంజనాన్ని సృష్టించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే ఆయన చేసిన సినిమాల విషయంలో చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ప్రతి విషయాన్ని తనే దగ్గరుండి మరి చూసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ ఇంతకు ముందు కే జి ఎఫ్, సలార్ లాంటి భారీ సక్సెస్ లను అందుకోవడంతో ఈ సినిమాతో కూడా మంచి విజయాన్ని సాధిస్తాడు అంటూ ఇటు ఎన్టీఆర్ అభిమానులు, అటు ప్రశాంత్ నీల్ అభిమానులందరు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Also Read : రజినీకాంత్ ను వైల్డ్ గా చూపించనున్న స్టార్ డైరెక్టర్..?
మరి ఇలాంటి సందర్భంలోనే ఆయన చేయబోతున్న సినిమాలతో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తద్వారా ఈ సినిమా ఎలాంటి గుర్తింపును పొందబోతుంది అనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ని ఒకప్పటి రజనీకాంత్ తో పోలుస్తున్నారు.
ఎందుకంటే రజినీకాంత్ కి ఒక యూనిక్ స్టైల్ ఉండేది. అందువల్లే ఆయన ఇండస్ట్రీలో చాలా సంవత్సరాల పాటు స్టార్ హీరో కొనసాగుతూ వచ్చాడు. ఇక యావత్ ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న హీరోల్లో రజనీకాంత్ కూడా ఒకరు కావడం విశేషం…ఇప్పటివరకు ఆయన వరుస సినిమాలను చేస్తూ వస్తున్నాడు… ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ లో కూడా ఒకప్పటి రజనీకాంత్ లో ఉన్న స్టైల్ అయితే కనిపిస్తుందని వీళ్లిద్దరూ కూడా యాక్టింగ్ తో, స్టైల్ తో ప్రేక్షకులను మెప్పించాలనే ప్రయత్నం చేస్తుంటారని కొంతమంది సినిమా పెద్దలు కూడా వాళ్ళ అభిప్రాయాలను తెలియజేస్తున్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైతే తమ అభిమాన హీరోను రజనీకాంత్ తో పోల్చడం తో వల్ల వాళ్ల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నిజానికి రజనీకాంత్ లాంటి గొప్ప స్టాండర్డ్ సంపాదించుకున్న హీరోగా జూనియర్ ఎన్టీఆర్ ఎదుగుతాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…
Also Read : రజినీకాంత్ సిల్క్ స్మిత లో మధ్య ఉన్న రిలేషన్ షిప్ ఏంటి..?