Satyam Sundaram : టీవీ లో టెలికాస్ట్ అయ్యే సూపర్ హిట్ సినిమాల టీఆర్పీ రేటింగ్స్ చాలా భిన్నంగా ఉంటాయి. థియేటర్స్ లో సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిల్చిన ఎన్నో సినిమాలు, టీవీ టెలికాస్ట్ లో డిజాస్టర్స్ గా నిలుస్తున్నాయి. అందుకు బెస్ట్ ఉదాహరణ ప్రభాస్(Rebel Star Prabhas) లేటెస్ట్ సూపర్ హిట్ సినిమాలే. ఆయన హీరో గా నటించిన ‘సలార్'(Salaar Movie) చిత్రం టీవీ టెలికాస్ట్ లో పెద్ద ఫ్లాప్. మొదటిసారి టెలికాస్ట్ చేసినప్పుడు ఈ సినిమాకు కేవలం నాలుగు టీఆర్పీ రేటింగ్స్ మాత్రమే వచ్చింది. బాక్స్ ఆఫీస్ వద్ద సినిమా ఫలితానికి, టీవీ లో వచ్చిన రేటింగ్స్ కి ఏమైనా సంబంధం ఉందా మీరే చెప్పండి?..అదే విధంగా గత ఏడాది బాక్స్ ఆఫీస్ వద్ద వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టిన ‘కల్కి'(Kalki 2898 AD Movie) చిత్రానికి టీఆర్పీ రేటింగ్స్ దారుణంగా వచ్చాయి. కేవలం 5.25 రేటింగ్స్ మాత్రమే వచ్చాయి.
Also Read : సత్యం సుందరం’ చిత్రాన్ని వదులుకున్న టాలీవుడ్ స్టార్ హీరోలు వీళ్లేనా..? చేసి ఉంటే వేరేలా ఉండేది!
ఇలా సూపర్ హిట్ గా నిల్చిన ఎన్నో సినిమాలకు టీవీ టెలికాస్ట్ లో ఇలాంటి రేటింగ్స్ వస్తుంటే, బాక్స్ ఆఫీస్ వద్ద అబోవ్ యావరేజ్ రేంజ్ లో ఆడిన సినిమాలు మాత్రం టీవీ టెలికాస్ట్ లో దుమ్ము దులిపేస్తున్నాయి. గత ఏడాది తమిళ హీరో కార్తీ(Karthi Sivakumar), అరవింద్ గో స్వామి(Aravind Goswami) కలిసి నటించిన ‘సత్యం సుందరం'(Satyam Sundaram Movie) చిత్రం ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై, క్రిటిక్స్ దగ్గర అద్భుతమైన రేటింగ్స్ ని సంపాదించుకొని, థియేటర్స్ లో పర్వాలేదు అనే రేంజ్ వసూళ్లను రాబట్టిన సంగతి తెలిసిందే. నెట్ ఫ్లిక్స్ లో కూడా ఈ సినిమాకి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రాన్ని రీసెంట్ గానే స్టార్ మా ఛానల్ లో టెలికాస్ట్ చేసారు. రేటింగ్స్ 5 కి పైనే వచ్చినట్టు తెలుస్తుంది. సోషల్ మీడియా ని ఉపయోగించే నెటిజెన్స్ కి ఈ సినిమా గురించి బాగా తెలుసు కానీ, బయట జనాలకు ఈ సినిమా ఒకటి ఉందనే విషయం కూడా తెలియదు.
అలాంటి సినిమాకి ఇంత టీఆర్ఫీ రేటింగ్స్ వచ్చాయంటే గొప్పే కదా. కేవలం ఒక్కసారి కాదు, రిపీట్ టెలికాస్ట్ లో కూడా ఈ సినిమాకు ఇంకా ఎక్కువ రేటింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు విశ్లేషకులు. కేవలం ఇద్దరి దూర బంధువుల మధ్య జరిగే సంభాషణలు, వాళ్ళ మధ్య ఏర్పడే ఎమోషన్స్ వంటివి హృదయాలను కట్టి పారేసే విధంగా ఉంటాయి. అంత అద్భుతంగా తెరకెక్కించాడు డైరెక్టర్. ఇక హీరో కార్తీ సంగతి తెలిసిందే, ఇతను ఏ సినిమాలో కూడా నటించడు. జీవిస్తాడు అని చెప్పొచ్చు. ఈ సినిమాలో కూడా అదే చేశాడు. ఆయన నటనకు థియేటర్స్ లో కంటతడి పెట్టని వారంటూ ఎవ్వరూ లేరు అనడంలో అతిశయోక్తి లేదేమో. టీవీ, ఓటీటీ లో చూసిన ఆడియన్స్, అబ్బా ఇంత మంచి సినిమాని థియేటర్స్ లో ఎలా మిస్ అయ్యాం అని బాధపడిన సందర్భాలు కూడా ఉన్నాయి.
Also Read : ఆశ్చర్యపర్చిన ‘సత్యం సుందరం’ 2 రోజుల వసూళ్లు..ఇలాంటి అరుదైన రికార్డు కార్తీ కి మాత్రమే సొంతం!