Homeబిజినెస్Motorola Edge 70 Fusion: ఈ Motorola ఫోన్ పై విపరీతమైన క్రేజ్.. ఇందులో ఉన్న...

Motorola Edge 70 Fusion: ఈ Motorola ఫోన్ పై విపరీతమైన క్రేజ్.. ఇందులో ఉన్న స్పెషల్ ఏంటంటే?

Motorola Edge 70 Fusion: ప్రముఖ కంపెనీ Motorola మొబైల్స్ కు మార్కెట్లో అత్యంత ప్రాధాన్యత ఉంది. ఇందులో ఉండే ఫీచర్స్ తో పాటు బ్యాటరీ వ్యవస్థ మెరుగ్గా ఉండటంతో చాలామంది దీనిని కొనడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ కంపెనీ నుంచి ఇటీవల మార్కెట్లోకి వచ్చిన Edge 70 Fusion పై ప్రత్యేకంగా చర్చ సాగుతోంది. ఇది చూడడానికి ఆకర్షణీయంగా ఉండడంతోపాటు ఫీచర్స్ కూడా అన్ని వర్గాల వారిని ఆకట్టుకుంటున్నాయి. అంతేకాకుండా దీని ధర కూడా అందుబాటులో ఉండడంతో చాలామంది కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ఇంతకీ ఇందులో ఉండే స్పెషల్ ఏంటో ఇప్పుడు చూద్దాం..

Motorola Edge 70 Fusion ఈనెల 6న మార్కెట్లోకి వచ్చింది. అత్యధిక ఫీచర్లతో కూడిన మొబైల్ ను తక్కువ ధరలో కొనుగోలు చేయాలని అనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని అంటున్నారు. అందులోనూ రూ. 30 వేల లోపు ఫోన్ కొనాలని ఎదురుచూసేవారికి ఇదే సరైన ఫోన్ అని చెబుతున్నారు. ఎందుకంటే దీని ధర రూ.26,999 నుంచి ప్రారంభమవుతుంది. టాప్ ఎండ్ మొబైల్ ధర రూ.32,999 తో విక్రయిస్తున్నారు. అయితే ధర మాత్రమే కాకుండా ఈ ఫోన్ డిజైన్ అద్భుతం అని చెప్పవచ్చు. చూడడానికి ఆకర్షణీయంగా ఉండే ఈ ఫోన్ బ్లూ సర్ఫ్ వంటి ఆకర్షణీయమైన షేడ్స్ లో లభ్యమవుతోంది. ఈ మొబైల్ డిస్ప్లే గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవచ్చు. ఇందులో 6.78 అంగుళాల AMOLED డిస్ప్లే ఉంది. ఇది వన్ పాయింట్ ఫైవ్ కె Resolution తో పనిచేస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ ఉన్న ఈ మొబైల్ ప్యానెల్ చాలా స్మూత్ గా ఉంటుంది. ఈ డిస్ప్లే HDR 10+ సపోర్ట్ చేయగా 5200 nits బ్రైట్నెస్ తో గరిష్టమైన కాంతిని అందిస్తుంది. దీనిపై 7i గొరిల్లా గ్లాస్ తో రక్షణగా ఉంటుంది.

మోటరోలా ఎడ్జ్ 70 ఫ్యూజన్ మొబైల్ లో సాఫ్ట్వేర్ లేటెస్ట్ టెక్నాలజీతో కూడుకొని ఉంది. ఇందులో స్నాప్ డ్రాగన్ 7s జెన్ 3 చిప్ సెట్ ను అమర్చారు. అలాగే ఇందులో 8జిబి నుంచి 12gb వరకు ర్యామ్ ఉండగా.. 512 జిబి వరకు స్టోరేజ్ చేసుకోవచ్చు. మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారితోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఈ ప్రాసెసర్ సపోర్ట్ గా ఉంటుంది. వీటితోపాటు UFS 2.2 స్టోరేజ్ కూడా ఉండడంతో ఫోన్ వేగం అధికంగా ఉండే అవకాశం ఉంది. ఈ మొబైల్ లో 50 MP మెయిన్ కెమెరా ఉండగా..13 MP అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది.32 MP ఫ్రంటు కెమెరాతో పాటు వీడియో కాలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. అలాగే ఈ మొబైల్ లో 7000 mAh సిలికాన్ కార్బన్ బ్యాటరీని అమర్చారు. ఇది 68 W టర్బో పవర్ చార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. యూత్ తో పాటు రోజువారి అవసరాలకు అనుగుణంగా ఉండే ఈ మొబైల్ కు రోజు రోజు ఆదరణ పెరుగుతోంది.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version