Kona Venkat : సినీ ఇండస్ట్రీ లో ఒక అమ్మాయి, అబ్బాయి క్లోజ్ గా ఉంటే మీడియా వాళ్ళిద్దరి మధ్య ఎదో రిలేషన్ కొనసాగుతుంది, త్వరలోనే పెళ్లి చేసుకోనోటున్నారు అంటూ రకరకాల వార్తలు పుట్టిస్తుంటారు. ఎన్నో ఏళ్ళ నుండి ఇలాంటి సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాము. అలా ప్రముఖ హీరోయిన్ అంజలి(Heroine Anjali), రచయిత కోన వెంకట్(Kona Venkat) మధ్య కూడా ఎదో నడుస్తుందని, వీళ్లిద్దరి మరో ఒక రకమైన రిలేషన్ ఉందని మీడియా లో ఒక సెన్సేషనల్ గాసిప్ చాలా కాలం నుండి చక్కర్లు కొడుతోంది. ఈ రూమర్స్ పై ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూ లో కోన వెంకట్ చాలా ఘాటుగా స్పందించాడు. ఆయన మాట్లాడుతూ ‘అంజలి నాకు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా సమయంలో చెన్నై లో పరిచయమైంది. అప్పటి నుండి ఆమెతో నాకు సాన్నిహిత్యం ఏర్పడింది. తనని ప్రధాన పాత్రలో పెట్టి ‘గీతాంజలి’ అనే చిత్రాన్ని నిర్మించాను’.
Also Read : వి.వి వినాయక్ కారణంగానే అఖిల్ కెరీర్ ఇలా అయ్యింది అంటూ రచయిత కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్!
‘మీరందరు అనుకుంటున్నట్టు అంజలి కి , నాకు మధ్య ఎంతో మంచి సాన్నిహిత్యం ఉంది. తన నన్ను అన్నయ్య గా భావించినా, తండ్రిగా భావించినా, లేదా స్నేహితుడిగా భావించినా నేను అంగీకరించగలను. మా మధ్య ఉన్న బంధం ఎంతో అమూల్యమైనది. ఎవరు ఏమనుకున్నా నేను పట్టించుకోను. నేను అంజలి కి గురువు లాంటి వాడిని మాత్రమే. మీరు అనుకున్న చెడు రిలేషన్ మా మధ్య లేదు. నేను అంత నీచుడిని కాదు. అంజలి బాల్యం గురించి వింటే ఎవరైనా కన్నీళ్లు పెట్టుకోగలరు. ఆమె కష్టపడి సంపాదించిన ఆస్తులన్నీ కొట్టేసారు. ఇప్పుడు ఆమెకు తోడు ఎవరూ లేరు, ఆమెకు అండగా నేను మాత్రమే ఉన్నాను. కష్ట సమయంలో ఒక గురువుగా ఆమెకు ఎప్పుడూ నేను తోడుతుంటాను’ అంటూ చెప్పుకొచ్చాడు. అంజలి కి కుటుంబపరమైన వివాదాలు చాలానే ఉన్నాయి, గతంలో వార్తల్లో కూడా ఆమె తరచూ నిలిచేది. దీనిని బట్టి చూస్తే కోన వెంకట్ చెప్పేవి నిజాలే అని అనిపించక తప్పదు.
ఇకపోతే కోనవెంకట్ అంజలి ని ప్రధాన పాత్రలో పెట్టి ‘గీతాంజలి’, ‘గీతాంజలి మళ్ళీ వచ్చింది’ వంటి సినిమాలు చేసాడు. ఈ రెండు చిత్రాలు కూడా కమర్షియల్ గా పెద్ద హిట్ అయ్యాయి. రాబోయే రోజుల్లో కూడా వీళ్ళ కాంబినేషన్ లో సినిమాలు రానున్నాయి. ఇదంతా పక్కన పెడితే అంజలి రీసెంట్ గానే రామ్ చరణ్(Global Star Ram Charan), శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన ‘గేమ్ చేంజర్'(Game Changer Movie) చిత్రంలో ఒక కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. ఆ సినిమా కమర్షియల్ గా పెద్ద ఫ్లాప్ అయ్యినప్పటికీ, అంజలికి మాత్రం మంచి పేరొచ్చింది. అంజలి లో చాలా మంచి పొటెన్షియల్ ఉందని, ఆమెని దర్శక నిర్మాతలు సరిగా వినియోగించట్లేదని ఆ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు అభిప్రాయపడ్డారు. మరి అంజలి కెపాసిటీ కి తగ్గ సినిమాలు రాబోయే రోజుల్లో అయినా వస్తుందా లేదా అనేది చూడాలి.
Also Read : కేవలం ఆ ఒక్క ప్రాంతం నుండే 100 కోట్లు రాబట్టిన ‘డ్రాగన్’..#RRR , పుష్ప2 లకు కూడా సాధ్యం కాలేదు!