Satyam Sundaram Collection: ఆశ్చర్యపర్చిన ‘సత్యం సుందరం’ 2 రోజుల వసూళ్లు..ఇలాంటి అరుదైన రికార్డు కార్తీ కి మాత్రమే సొంతం!

సైలెంట్ గా విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రానికి తెలుగు లో మొదటి రెండు రోజులు చాలా మంచి వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ ని ఏషియన్ సునీల్ నారంగ్ కొనుగోలు చేసాడు. ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 3 కోట్ల రూపాయలకు చేసాడు.

Written By: Vicky, Updated On : September 30, 2024 8:38 am

Satyam Sundaram Collection

Follow us on

Satyam Sundaram Collection: తమిళ హీరో కార్తీ, అరవింద స్వామి కలిసి నటించిన లేటెస్ట్ చిత్రం ‘సత్యం సుందరం’ ఇటీవలే తెలుగు, తమిళ భాషల్లో గ్రాండ్ గా విడుదలై మంచి పాజిటివ్ టాక్ ని తెచ్చుకున్న సంగతి అందరికీ తెలిసిందే. తెలుగు లో ‘దేవర’ మేనియా లో ఈ సినిమా నిలబడడం కష్టం అని అందరూ అనుకున్నారు. కానీ అనుకోకుండా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తిరుపతి లడ్డు మీద అనుకోకుండా ఫన్ యాంగిల్ లో కార్తీ మాట్లాడడం, దానిపై ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్ర స్థాయిలో తప్పుబట్టి కార్తీని మందలించడంతో ఈ సినిమా వివాదాల్లోకి చిక్కుకొని బాగా హైలైట్ అయ్యింది. అలా ఆడియన్స్ ఈ చిత్రాన్ని బాగా గుర్తించుకున్నారు. సోషల్ మీడియా లో రివ్యూస్ అన్ని పాజిటివ్ గా రావడం తో బుక్ మై షో యాప్ లో కేవలం తెలుగు వెర్షన్ కి సంబంధించి 30 వేలకు పైగా టిక్కెట్లు అమ్ముడుపోయాయి. గంటకు 2 వేల టిక్కెట్లు ఈ చిత్రానికి అమ్ముడుపోవడం మరో విశేషం.

అలా సైలెంట్ గా విడుదలై సూపర్ హిట్ గా నిల్చిన ఈ చిత్రానికి తెలుగు లో మొదటి రెండు రోజులు చాలా మంచి వసూళ్లు వచ్చాయి. ఈ సినిమా తెలుగు రైట్స్ ని ఏషియన్ సునీల్ నారంగ్ కొనుగోలు చేసాడు. ప్రీ రిలీజ్ బిజినెస్ రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి 3 కోట్ల రూపాయలకు చేసాడు. మొదటి రోజు 75 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా, రెండవ రోజు ఏకంగా కోటి 20 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. మొదటి రోజు కంటే రెండవ రోజు ఎక్కువ వసూళ్లు రావడాన్ని చూస్తుంటే ఈ చిత్రానికి కచ్చితంగా లాంగ్ రన్ ఉంటుంది అనే విషయం జనాలకు అర్థమైంది. ట్రేడ్ పండితులు అందిస్తున్న సమాచారం ప్రకారం ఈ చిత్రానికి రెండు రోజులకు కలిపి కోటి 95 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు కేవలం తెలుగు రాష్ట్రాల నుండి వచ్చాయి. ఇక కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ వంటి ప్రాంతాలను కలుపుకొని 50 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు తెలుగు వెర్షన్ కి వచ్చాయి.

ఓవరాల్ గా రెండు రోజుల తెలుగు వెర్షన్ వరల్డ్ వైడ్ వసూళ్లు లెక్క వేస్తే దాదాపుగా 2 కోట్ల 45 లక్షల రూపాయలకు తేలిందని సమాచారం. అక్టోబర్ 2 వ తేదీన నేషనల్ హాలిడే అవ్వడంతో, ఆరోజుతో ఈ చిత్రం బ్రేక్ ఈవెన్ మార్కుని దాటేస్తుందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా కార్తీ పెద్ద హీరోలకు పోటీ గా తన సినిమాలను దింపి హిట్ కొట్టడం కొత్తేమి కాదు, గతం లో తమిళ సూపర్ స్టార్ విజయ్ ‘బిజిల్’ చిత్రానికి పోటీగా ‘ఖైదీ’ చిత్రాన్ని విడుదల చేసాడు. సైలెంట్ గా విడుదలైన ఈ చిత్రం భారీ బ్లాక్ బస్టర్ గా నిల్చింది, ఇప్పుడు ‘దేవర’ కు పోటీగా ‘సత్యం సుందరం’ సినిమాని విడుదల చేసి మరోసారి సైలెంట్ బ్లాక్ బస్టర్ హిట్ ని అందుకున్నాడు.