Satyam Sundaram’ movie : ఇటీవల విడుదలైన చిత్రాలలో ఆడియన్స్ కి థియేటర్స్ లో మంచి ఫీల్ గుడ్ అనుభూతిని కలిగించిన చిత్రం ‘సత్యం సుందరం’. ‘దేవర’ చిత్రం విడుదలైన పక్క రోజు ఈ సినిమా విడుదల అయ్యింది. అంత పెద్ద సినిమా ముందు విడుదల చేయాలనుకోవడం పెద్ద సాహసం, కార్తీ ఎందుకు ఇంత రిస్క్ చేస్తున్నాడు, కచ్చితంగా పెద్ద ఫ్లాప్ ని ఎదురుకుంటాడు అని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కానీ కంటెంట్ ఉన్న సినిమా ఎలాంటి పరిస్థితిలో విడుదలైన సూపర్ హిట్ అవుతుందని ‘సత్యం సుందరం’ మరోసారి నిరూపించింది. ఈ చిత్రంలోని అనేక సన్నివేశాలు ఆడియన్స్ హృదయానికి గట్టిగా హత్తుకున్నాయి. కార్తీ, అరవింద్ స్వామి మధ్య జరిగే సంభాషణలు, వాళ్ళిద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఆడియన్స్ కి నవ్వు రప్పించడమే కాకుండా, కన్నీళ్లు కూడా పెట్టించాయి.
ఇది ఇలా ఉండగా రీసెంట్ గానే ఈ సినిమాని నెట్ ఫ్లిక్స్ లో విడుదల చేసారు. థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ కంటే, ఓటీటీ లో వచ్చిన రెస్పాన్స్ పదింతలు ఎక్కువ ఉంది. ఈ చిత్రాన్ని చూసిన ప్రతీ ఒక్కరు సోషల్ మీడియా లో మన తెలుగు హీరోలు ఎందుకు ఇలాంటి సినిమాలు చేయరు అంటూ కామెంట్స్ చేసారు. ఇదే సినిమాని వాళ్లకి ఇష్టమైన హీరోలు చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకొని ప్రత్యేకంగా ఎడిటింగ్స్ కూడా చేస్తూ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. అయితే నిజంగానే ఈ చిత్రాన్ని ముందుగా తెలుగులోనే తీయాలని అనుకున్నారట. డైరెక్టర్ ప్రేమ్ కుమార్ అప్పట్లో విక్టరీ వెంకటేష్ కి ఈ కథని చెప్పగా, ఆయన మొదటి సిట్టింగ్ లోనే ఒకే చెప్పేశాడట. ఇంకో హీరో క్యారక్టర్ కోసం ఎవరిని తీసుకోవాలని అనుకుంటున్నావ్ అని అడగగా, నేచురల్ స్టార్ నాని పేరు చెప్పాడట డైరెక్టర్. అద్భుతం, వెంటనే అతనికి కథ వినిపించు, ఒప్పుకుంటే డేట్స్ కేటాయిస్తాను అని చెప్పాడట వెంకటేష్. ‘దసరా’ మూవీ షూటింగ్ జరుగుతున్న రోజుల్లో ఈ కథని వినిపించాడట డైరెక్టర్ ప్రేమ్ కుమార్. కథ చాలా బాగుంది, నాకు చేయాలని ఉంది, కానీ ‘దసరా’ తర్వాత నేను వివేక్ ఆత్రేయ తో సినిమాకి కమిట్ అయిపోయి ఉన్నాను. ఈ చిత్రం పూర్తి అయ్యాక, ఈ సినిమా చేద్దాం అని అన్నాడట నాని.
కానీ ఆ తర్వాత బాగా ఆలోచించుకున్న నాని, ప్రేమ్ కుమార్ కి ఫోన్ చేసి ‘ఇప్పుడిప్పుడే పెద్ద సినిమాలవైపు ఫోకస్ పెడుతున్నాను. ఇలాంటి సమయంలో ఇంతటి సాఫ్ట్ సినిమాలు చేస్తే వర్కౌట్ అవ్వదేమో. మనం కచ్చితంగా భవిష్యత్తులో పని చేద్దాం. కానీ ఈ ప్రాజెక్ట్ వద్దు’ అని చెప్పాడట. దీంతో ప్రేమ్ కుమార్ ఈ ప్రాజెక్ట్ ని తమిళ్ లో చేద్దమని ఫిక్స్ అయ్యాడు. కార్తీ, అరవింద్ స్వామి నటించడానికి ఒప్పుకున్నారు. అయితే కార్తీ కి కూడా ఈ సినిమా సక్సెస్ అవుతుందని నమ్మకం లేదు, డైరెక్ట్ ఓటీటీ కి ఇచ్చేద్దామని అన్నాడట. డైరెక్టర్ లేదు సార్ ఈ చిత్రం కచ్చితంగా థియేటర్స్ లో సక్సెస్ అవుతుందని పట్టుబట్టి విడుదల చేయించాడట. ఫలితంగా ఎవ్వరూ ఊహించని రేంజ్ సూపర్ హిట్ అయ్యింది.