Homeఎంటర్టైన్మెంట్‘సారంగ ద‌రియా’ క్రెడిట్ ఎవ‌రిది? కొన‌సాగుతున్న ర‌చ్చ‌!

‘సారంగ ద‌రియా’ క్రెడిట్ ఎవ‌రిది? కొన‌సాగుతున్న ర‌చ్చ‌!

ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ.’ ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఒక్కొక్క‌టిగా రిలీజ్ చేసింది యూనిట్. అయితే.. ఇందులో ఇటీవ‌ల రిలీజైన ‘సారంగ దరియా’ అనే జానపద గీతంపై వివాదం నెలకొంది. ఈ పాట నాదంటే.. నాదేనంటూ అటు గీత రచయి సుద్దాల అశోక్ తేజ.. ఇటు కోమలి అనే ఫోక్ సింగర్ వాదించుకుంటున్నారు. రోజుల తరబడి ఈ రచ్చ […]

Suddala Ashok Teja Vs Komali
ప్రముఖ దర్శకుడు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘లవ్ స్టోరీ.’ ఈ సినిమాలో నాగచైతన్య, సాయిపల్లవి హీరో, హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన పాటలను ఒక్కొక్క‌టిగా రిలీజ్ చేసింది యూనిట్. అయితే.. ఇందులో ఇటీవ‌ల రిలీజైన ‘సారంగ దరియా’ అనే జానపద గీతంపై వివాదం నెలకొంది. ఈ పాట నాదంటే.. నాదేనంటూ అటు గీత రచయి సుద్దాల అశోక్ తేజ.. ఇటు కోమలి అనే ఫోక్ సింగర్ వాదించుకుంటున్నారు. రోజుల తరబడి ఈ రచ్చ కొనసాగుతూనే ఉంది.

Also Read: అరె.. ‘దిల్ రాజు’కి పోటీగా ఒకడొచ్చాడు !

అప్పట్లో మాటీవీ ఛానల్ లో ప్రసారమైన ‘రేలారే రేలా’ ప్రోగ్రామ్ లో కోమలి ఈ పాటను పాడింది. సారంగ దరియా అనేది తెలంగాణలోని జానపద గేయం. ఇది తరాల నుంచి ఉన్నప్పటికీ.. దాన్ని సేకరించి, తగిన గుర్తింపు తెచ్చింది మాత్రం కోమలి అని చెప్పడంలో సందేహం లేదు. అంతేకాదు.. సారంగ దరియా అనే పాట వినిపిస్తే.. అది కోమలిదే అయి ఉంటుందని నాటి జ‌డ్జిగా సుద్దాల అశోక్ తేజ మెచ్చుకోవ‌డం గ‌మ‌నించాల్సిన విష‌యం.

ఇప్పుడు ల‌వ్ స్టోరీ సినిమా కోసం ఇదే పాట‌లో కొన్ని చ‌ర‌ణాల‌ను కొత్త‌గా రాసి, త‌న పేరు వేసుకున్నారు సుద్దాల‌. ఇది తాను సేక‌రించిన పాట కాబ‌ట్టి, త‌న‌కు క‌నీస గుర్తింపు కూడా ఇవ్వ‌కుండా.. సుద్దాల అశోక్ తేజ త‌న పేరు ఎలా వేసుకుంటార‌ని ప్ర‌శ్నిస్తోంది కోమ‌లి. దీనికి సుద్దాల బ‌దులిస్తూ.. జాన‌ప‌దం అంద‌రిద‌నీ, ఎవ‌రికైనా దానిపై హ‌క్కు ఉందంటూ.. త‌న పేరు వేసుకోవ‌డం స‌రైందే అంటున్నారు.

Also Read: పుకార్లు వస్తోన్నా హ్యాపీగా ఉన్న భామ !

దీనికి రిప్లే ఇచ్చిన కోమ‌లి.. అది నిజ‌మే కావొచ్చుకానీ.. అస‌లు మొద‌ట‌గా దాన్ని సేక‌రించి, దానికి గుర్తింపు తెచ్చింది తానే కాబ‌ట్టి, త‌న‌కు క్రెడిట్ ఇవ్వాల్సిందేన‌ని అంటోంది. అంతేకాదు.. ఈ పాట‌ను సినిమాలో మంగ్లీ చేత పాడించార‌ని, ఆమె గొంతులో ఫోక్ మాధుర్యం మిస్స‌య్యింద‌ని వ్యాఖ్యానించింది. ఈ విధంగా ఈ వివాదం కొన‌సాగుతూనే ఉంది.

కాగా.. ఈ విష‌యంలో సుద్దాల అశోక్ తేజ‌, సినిమా యూనిట్ పై విమ‌ర్శ‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఎంతో పేరు, డ‌బ్బు సంపాదించిన ర‌చ‌యిత‌లు, టెక్నీషియ‌న్లు.. ఇత‌రుల టాలెంట్ ను చోరీ చేయ‌డ‌మేంట‌ని ప్ర‌శ్నిస్తున్నారు. వాళ్ల‌కు రెమ్యున‌రేష‌న్ ఇవ్వాల్సివ‌స్తే.. అది ఎంతో ఉండ‌ద‌ని, కోట్లాది రూపాయ‌లు ఖ‌ర్చు చేసినిమాలో నామ‌మాత్రంగా ఇచ్చే రెమ్యున‌రేష‌న్‌, టైటిల్స్ కాస్తంత జాగా ఇస్తే ఏం పోతుంద‌ని అడుగుతున్నారు. ఇది కొత్త టాలెంట్ ను అణ‌గదొక్క‌డ‌మే అనే అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది. మ‌రి, దీనిపై యూనిట్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

మరిన్ని సినిమా వార్తల కోసం టాలీవుడ్ న్యూస్

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.

Related News

Most Popular

Oktelugu Epaper