Trump , Ukraine
Trump and Ukraine : నాటోలో ఉక్రెయిన్(Ucrain) చేరిక నచ్చని రష్యా మూడేళ్ల క్రితం సైనిక చర్యలకు దిగింది. దీంతో ఉక్రెయిన్ కూడా అమెరికా(America), నాటో దేశాల సహకారంతో ప్రతిచర్యలు మొదలు పెట్టారు. అమెరికా అండతో ఇంతకాలం రష్యా(Russa)ను దీటుగా ఎదుర్కొన్న ఉక్రెయిన్.. ఇప్పుడు కష్టాల్లో కూరుకుపోతోంది. జోబైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఉక్రెయిన్‌కు ఆర్థిక, సైనిక సాయం అందించారు. కానీ, ట్రంప్ అధికారంలోకి వచ్చాక యుద్ధం ఆపేప్రయత్నంలో చర్చలు జరిపారు. ఉక్రెయిన్ వెనక్కు తగ్గాలని సూచించారు. కానీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్‌స్కీ(gelensky) అందుకు అంగీకరించలేదు. రష్యా తమపై సైనిక చర్య ఆపితే.. ఉక్రెయిన్‌లోకి ఖనిజాలు తవ్వుకునేందుకు అమెరికాకు అనుమతి ఇస్తామని కూడా హామీ ఇచ్చారు. కానీ, ట్రంప్.. ఉక్రెయిన్‌నే వెనక్కు తగ్గాలనడం నచ్చని జెలన్‌స్కీర ఎలాంటి ఒప్పందం చేసుకోకుండానే వెనుదిరిగారు.
బిలియన్ డాలర్ల సైనిక సాయం
రష్యా–ఉక్రెయిన్ యుద్ధం ప్రారంభమైన 2022 నుంచి అమెరికా ఉక్రెయిన్‌కు బిలియన్ల డాలర్ల విలువైన సైనిక మరియు ఆర్థిక సహాయం అందించింది. బైడెన్ పరిపాలనలో ఈ సహాయం గణనీయంగా పెరిగింది, కానీ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత విధానంలో మార్పు వచ్చినట్లు కనిపిస్తోంది. అయితే తాజాగా ట్రంప్.. సాయం నిలిపివేశారు. ఇటీవల జెలన్‌స్కీతో చర్చలు అర్ధంతరంగా ముగిసిన తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నారు. సమావేశంలో ఇరు నాయకుల మధ్య తీవ్ర వాదప్రతివాదాలు జరిగినట్లు సమాచారం. ట్రంప్ ఉక్రెయిన్‌పై ఒత్తిడి పెంచి, రష్యాతో శాంతి ఒప్పందం కుదుర్చుకోవాలని కోరినట్లు తెలుస్తోంది.
Also Read : ప్రెస్‌మీట్‌లో ట్రంప్, జెలన్‌స్కీ ఫైట్.. తల పట్టుకున్న ఉక్రెయిన్ రాయబారి.. వీడియో వైరల్!
ఉక్రెయిన్‌పై ప్రభావం..
అమెరికా సైనియ సాయం ఈ నిలిపివేతతో ఉక్రెయిన్‌కు సైనిక సామాగ్రి, ఆయుధాల సరఫరా తక్షణం ఆగిపోతుంది. ఇది ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాతో పోరాడే సామర్థ్యాన్ని బలహీనపరుస్తుంది. అదే సమయంలో, యూరప్(Europ) దేశాలు తమ సహాయాన్ని పెంచే అవకాశం ఉందని కూడా చెబుతున్నారు. ఈ చర్యను రష్యా స్వాగతించే అవకాశం ఉంది, ఎందుకంటే ఇది ఉక్రెయిన్‌ను ఒంటరిగా నిలబెట్టి, శాంతి చర్చలకు ఒత్తిడి చేసే అవకాశం ఉంది.
ఆర్థిక, రాజకీయ కోణం:
అమెరికా ఈ నిర్ణయం వెనుక ట్రంప్ యొక్క ‘అమెరికా ఫస్ట్‘ విధానం ప్రధాన కారణంగా చెబుతున్నారు. ఆయన ఉక్రెయిన్‌కు సహాయం చేయడం కంటే, రష్యాతో సంబంధాలను మెరుగుపరచడం మరియు ఆర్థిక ఆంక్షలను సడలించడంపై దష్టి పెట్టినట్లు కనిపిస్తోంది. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ, అమెరికా మిత్ర దేశాల బాధ్యతను విస్మరిస్తోందని విమర్శించారు. మొత్తంగా, అమెరికా సాయం నిలిపివేత ఉక్రెయిన్‌కు పెద్ద ఎదురుదెబ్బగా పరిగణించబడుతోంది. ఇది యుద్ధం యొక్క గతిని మార్చే అవకాశం ఉంది.
Also Read : ట్రంప్‌తో సమావేశం.. రష్యా–ఉక్రెయిన్ యుద్ధ విరమణపై చర్చ..రాజీ లేదన్న జెలన్‌స్కీ
Web Title: Trump ukraine shock military aid zelensky
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com