IND vs AUS : ఛాంపియన్స్ ట్రోఫీలో (champions trophy) భాగంగా భారత్ ఆస్ట్రేలియా (IND vs AUS) మంగళవారం దుబాయ్ వేదికగా తలపడుతున్నాయి. రెండు జట్లు విజయం సాధించి ఫైనల్ వెళ్లిపోవాలని భావిస్తున్నాయి. అందువల్ల మైదానంలో తీవ్రంగా కసరత్తు చేస్తున్నాయి. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ పై కీలక వ్యాఖ్యలు చేశాడు. అవి సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి.
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా హైడ్రిక్ విజయాలు సాధించిన సంగతి తెలిసిందే. లీగ్ మ్యాచ్ లలో బంగ్లాదేశ్, పాకిస్తాన్, న్యూజిలాండ్ పై విజయం సాధించింది. హ్యాట్రిక్ గెలుపులతో సెమీఫైనల్ వెళ్ళిపోయింది. సెమీఫైనల్ లో ఆస్ట్రేలియా జట్టుతో దుబాయ్ వేదికగా భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్ నేపథ్యంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మకు టీమిండియా దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చాడు. ” దూకుడుగా ఆడటం మంచిదే. ఆరంభాలపై మాత్రమే దృష్టి సాధించడం కూడా మంచిదే. కానీ ఇదే సమయంలో ఓపికను విస్మరించకూడదు. నిదానాన్ని పక్కన పెట్టకూడదు. రోహిత్ తనదైన శైలిలో ఆడాలి. ఇక్కడ దూకుడు అనే పదానికి కాస్త పక్కన పెట్టి.. తన ఓపెనర్ అనే విషయాన్ని రోహిత్ గుర్తుంచుకోవాలి. రోహిత్ 10 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసి 40 నుంచి 45 రన్స్ చేస్తేనే సరిపోదు. అతడు సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాలి. అతడు ఎన్ని ఎక్కువ ఓవర్లాడితే జట్టుకు అంత ఉపయోగముంటుంది. అప్పుడు భారత్ అంతలా స్కోరు సాధిస్తుందని” సునీల్ గవాస్కర్ ఆజ్ తక్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
Also Read : సెమీఫైనల్ సమరంలో భారత్, ఆస్ట్రేలియా ప్లేయింగ్ -11 ఇదే..
రోహిత్ ఎలా ఆడుతున్నాడు అంటే..
సునీల్ గవాస్కర్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రోహిత్ ఆట తీరుపై చర్చ మొదలైంది. లీగ్ మ్యాచ్ లో భాగంగా న్యూజిలాండ్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ 17 బంతులు ఎదుర్కొని 15 రన్స్ చేశాడు. కైల్ జామిసన్ వేసిన ఫుల్ టాస్ బంతిని భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి..విల్ యంగ్ చేతికి చిక్కాడు. పాకిస్తాన్తో జరిగిన మ్యాచ్ లో రోహిత్ వేగంగా ఆడాడు. మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో భారీగానే పరుగుల వేటను మొదలుపెట్టాడు. అయితే షాహిన్ ఆఫ్రిది ఇన్ స్వింగర్ యార్కర్ వేయడంతో రోహిత్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు. పాకిస్తాన్ జట్టుతో జరిగిన మ్యాచ్లో రోహిత్ 15 బంతులు ఎదుర్కొని 20 పరుగులు చేశాడు. బంగ్లా తో జరిగిన మ్యాచ్లో 36 బంతులు ఎదుర్కొని 41 రన్స్ చేశాడు. టస్కిన్ అహ్మద్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి అవుట్ అయ్యాడు. రోహిత్ ఇన్నింగ్స్ లో ఏడు ఫోర్లు ఉన్నాయి. అతడు పదో ఓవర్ లోనే అవుట్ కావడం విశేషం. రోహిత్ ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచ్లో తన ఆట తీరు మార్చుకోవాల్సిన అవసరం ఉంది. పవర్ ప్లే ఓవర్లను సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రత్యర్థి బౌలర్లపై ఎదురుదాడికి దిగాల్సిన అవసరం ఉంది. వారి లయను కూడా దెబ్బతీయాల్సిన బాధ్యత రోహిత్ మీద ఉంది. ఇక ఇటీవల ఇంగ్లాండ్ జట్టుతో జరిగిన వన్డే సిరీస్లో 90 బంతులు ఎదుర్కొన్న రోహిత్ 119 పరుగులు చేశాడు. ఇక దుబాయ్ మైదానం స్పిన్ బౌలర్లకు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ హిట్టింగ్ చేయడం అంత ఈజీ కాదు. ఒకవేళ భారత్ ముందుగా బ్యాటింగ్ చేసినప్పటికీ ఎక్కువ వికెట్లను కోల్పోకుండా పరుగులు చేయాల్సి ఉంటుంది.. ఒకవేళ భారీ లక్ష్యాన్ని చేదించాలంటే.. రోహిత్ సుదీర్ఘ ఇన్నింగ్స్ ఆడాల్సి ఉంటుంది.. అహ్మదాబాద్ వేదికగా జరిగిన 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ మ్యాచ్లో రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై చివరి మ్యాచ్ ఆడాడు. 31 బంతులు ఎదుర్కొన్న రోహిత్ మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్ లతో 41 పరుగులు చేశాడు. పదో ఓవర్లో మాక్స్ వెల్ బౌలింగ్లో భారీ షాట్ కొట్టడానికి ప్రయత్నించి అవుట్ అయ్యాడు.