Samantha: ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుసగా సినిమాలతో దూసుకెళ్లిపోతోంది. నాగ చైతన్యతో విడాకులు తీసుకున్న తర్వాత కెరీర్లో సరికొత్త పంథాలో వెళ్తోంది. కాగా, ప్రేమించి, ఇంట్లో ఒప్పించి మరి వివాహ బంధంతో ఒకటైన ఈ జంట.. పలు విభేదాల కారణంగా ఇటీవలే విడిపోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలోనే నెటిజన్లు, అభిమానుల నుంచి సామ్‌ను టార్గెట్ చేస్తూ పలు రకాల ట్రోల్స్ వస్తున్నాయి. కొంత మంది చైతన్యకు దరిద్రం వదిలిపోయిందంటూ కామెంట్లు చేస్తుంటే.. మరికొంత మంది సమంతదే తప్పంటూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇంకొంత మంది సామ్‌కు సపోర్ట్‌గానూ మాట్లాడుతూ కామెంట్లు చేస్తున్నారు.
తాజాగా, ఓ నెటిజన్ సమంతను ట్యాగ్ చేస్తూ.. నువ్వు ఒక సెకెండ్ హ్యాండ్ ఐటెం.. ఒక మంచి వ్యక్తి దగ్గర విడాకుల పేరుతో 50కోట్లను దోచుకున్నావ్. అంటూ కామెంట్ చేశాడు. అయితే, దీనిపై సమంత ఆశ్చర్యంగా చాలా పాజిటీవ్‌గా స్పందించింది. దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నా.. అంటూ సమాధానమిచ్చింది.
Also Read: సమంత “యశోద” సినిమాలో అనుష్క హీరో… ఉన్ని ముకుందన్
Kamarali Dukandar God bless your soul . https://t.co/IqA1feO9K1
— Samantha (@Samanthaprabhu2) December 21, 2021
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. ప్రస్తుతం సామ్ శాకుంతలం, యశోద సినిమాల్లో నటిస్తోంది. కాగా, ఇటీవలే వచ్చిన పుష్ప సినిమాలో ఐటెం సాంగ్‌లో అలరించింది. ఊ అంటావా మావ. ఊఊ అంటావా మావ అంటూ సాగే ఈ పాట నెట్టింట్లో ట్రెండింగ్‌లో దూసుకెళ్లిపోతోంది. ఇప్పటికే మిలియన్ల వ్యూస్‌ను దక్కించుకుంది. దీంతో పాటు హాలీవుడ్‌లోనూ ఓ సినిమాను ఒప్పుకుంది సామ్.
Also Read: సమంత ఒంటరితనం అలా దూరం
ఇవి కూడా చదవండి
1. ఆ జీవోలు రహస్యమా.. ప్రభుత్వ తీరుపై హైకోర్టు మండిపాటు..!
2. కేసీఆర్ ప్లాన్ కు కౌంటర్ వేస్తున్న కమలనాథులు..
3. ప్రేమలు మళ్లీ మళ్లీ విఫలమయ్యాయి కొత్త జీవితాన్ని ప్రారంభించిన హీరోయిన్స్ వీళ్ళే?
4. రష్మికను ఆడేసుకుంటున్న నెటిజన్లు.. ఎక్కడ పడితే అక్కడ ఆ పనేనా అంటూ కామెంట్లు
Raghava Rao Gara is an Editor, He is Working from Past 2 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read More