Chandrababu: తెలుగుదేశం పార్టీ అధికారం కోసం ఎదురుచూస్తోంది. వైసీపీకి ధీటుగా నిలవాలని భావిస్తోంది. ఇందులో భాగంగానే వ్యూహాలు ఖరారు చేస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని యంత్రాంగాన్ని తయారు చేస్తోంది. దీని కోసం వైసీపీ అనుసరించిన వలంటీర్ల వ్యవస్థకు పోటీగా తాము కూడా ఏదో ఒకటి చేయాలని చూస్తోంది. జగన్ తీసుకొచ్చిన వలంటీర్ల వ్యవస్థతో ప్రజలకు ఏ రకమైన ఇబ్బందులు రాకుండా ఉండేందుకు సంక్షేమ పథకాల అమలు బాధ్యతను వారిపై నెట్టారు. దీంతో వారు ప్రజలతో సత్సంబంధాలు కలిగి వారికి ఎల్లవేళలా అందుబాటులో ఉంటున్నారు. దీంతో వైసీపీ తన పనులు సునాయాసంగా తీర్చుకుంటోంది.
దీంతో వైసీపీ తెచ్చిన వలంటీర్ల వ్యవస్థతో టీడీపీ కూడా అదే బాటలో నడవాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. దీని కోసం పార్టీ కార్యకర్తలను నియమించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ప్రతి యాభై మందికో కార్యకర్తను నియమించి వారి ద్వారా పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా ప్రచారం చేసేందుకు భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఎలాగైనా రాష్ర్టంలో అధికారంలోకి రావాలని కాంక్షలో భాగంగానే ఇలాంటి వ్యూహాలు రూపొందిస్తున్నట్లు సమాచారం.
రాష్ర్టంలోని 175 నియోజకవర్గాల్లో బలమైన కేడర్ ఉన్న నేపథ్యంలో పార్టీని విజయతీరాలకు చేర్చే బాధ్యతకు వలంటీర్లకు అప్పగించాలని తలపిస్తోంది. నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహిస్తూ నేతలతో చర్చించేందుకు వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు చంద్రబాబు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైసీపీని ఎదుర్కొని నిలబడగలిగే సత్తా తమకు ఉందని సాటి చెప్పేందుకే బాబు సంకల్పించినట్లు చెబుతున్నారు.
Also Read: MLA Roja: జగన్ బర్త్ డే రోజే ఎమ్మెల్యే రోజాకు షాకిచ్చారే?
2024 ఎన్నికలే లక్ష్యంగా చంద్రబాబు కార్యకర్తలకు దిశానిర్దేశం చేయనున్నారు. టీడీపీ చేపట్టే కార్యక్రమాలకు విస్తృతంగా ప్రచారం కల్పిస్తూ కార్యోణ్ముఖులను చేయడమే ధ్యేయంగా బాబు కార్యాచరణ రూపొందిస్తున్నట్లు సమాచారం. రాష్ర్టంలో టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఎంతటి త్యాగాలకైనా వెనుకాడొద్దని చెబుతున్నారు. ఈ సారి అధికారం రాకపోతే ఇక అంతే సంగతి అనే విషయం కార్యకర్తలు గుర్తించేలా ఉద్బోదిస్తున్నారు.
Also Read: Pawan Kalyan: 2024 ఎన్నికల్లో పవన్ పవర్‌ఫుల్ అస్త్రాన్ని వాడబోతున్నారా.. అందుకే ధైర్యంగా ఉన్నారా?
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
Read MoreWeb Title: Chandrababu follow ycp volunteers system
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com