South Indian Heroines: ప్రేమలు విఫలమై కొత్త జీవితాన్ని ప్రారంభించిన హీరోయిన్స్ వీరే

South Indian Heroines: సినిమా ప్రపంచం అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే కొందరు హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలతో ప్రేమలో పడటం, విడిపోవటం వెంటవెంటనే జరుగుతూ ఉంటాయి. ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు పలువురు దర్శకులు హీరోలతో ప్రేమలో పడిన వారి ప్రేమలో విఫలం అయ్యి తిరిగి మరొకరితో వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరి ప్రేమలో విఫలమైన ఆ హీరోయిన్లు ఎవరో ఇక్కడ […]

  • Written By: Navya
  • Published On:
South Indian Heroines: ప్రేమలు విఫలమై కొత్త జీవితాన్ని ప్రారంభించిన హీరోయిన్స్ వీరే

South Indian Heroines: సినిమా ప్రపంచం అంటేనే రంగుల ప్రపంచం. ఇక్కడ ఎప్పుడు ఎవరు ఎలా మారుతారో ఎవరికీ తెలియదు. ఈ క్రమంలోనే కొందరు హీరో హీరోయిన్లు, దర్శక నిర్మాతలతో ప్రేమలో పడటం, విడిపోవటం వెంటవెంటనే జరుగుతూ ఉంటాయి.

ఇలా సినిమా ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోయిన్లు పలువురు దర్శకులు హీరోలతో ప్రేమలో పడిన వారి ప్రేమలో విఫలం అయ్యి తిరిగి మరొకరితో వారి ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మరి ప్రేమలో విఫలమైన ఆ హీరోయిన్లు ఎవరో ఇక్కడ తెలుసుకుందాం…

South Indian Heroines

South Indian Heroines

నయనతార: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతూ లేడీ సూపర్ స్టార్ గా పేరు సంపాదించుకున్న హీరోయిన్ నయనతార గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె కెరీర్ మొదట్లో హీరో శింబుతో ప్రేమలో పడి ఇద్దరూ కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. అనంతరం వీరి మధ్య కొన్ని కారణాల వల్ల ఇద్దరు విడిపోయారు. శింబు తర్వాత నయనతార దర్శకుడు కమ్ హీరో కమ్ కొరియోగ్రాఫర్ ప్రభుదేవా ప్రేమలో పడింది. వీరిద్దరూ దాదాపు పెళ్లి వరకు వెళ్లి ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఇక ప్రస్తుతం నయనతార దర్శకుడు విగ్నేష్ శివన్ ప్రేమలో పడింది. త్వరలోనే వీరి పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు షికార్లు చేస్తున్నాయి.

Also Read: ఏపీలో కొనసాగుతున్న థియేటర్ల తనిఖీలు… కృష్ణా, విజయనగరం జిల్లాలో ఎన్ని సీజ్ చేశారంటే

సమంత:దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న సమంత మొదట్లో హీరో సిద్ధార్థతో ప్రేమలో ఉంది. వీరిద్దరూ కలిసి పీకల్లోతు ప్రేమలో మునిగి పోయారు.అయితే కొన్ని కారణాల వల్ల సమంత-సిద్ధార్థ్ నుంచి విడిపోయింది. అనంతరం అక్కినేని నాగచైతన్య ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. 4 సంవత్సరాల పాటు వీరి వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా గడిపిన పలు మనస్పర్థల కారణంగా ప్రస్తుతం నాగచైతన్యతో విడాకులు తీసుకోబోతున్నట్లు ప్రకటించారు.

త్రిష: తమిళ చిన్నది త్రిష గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈమె తెలుగు తమిళ చిత్రాలలో ఎంతో బిజీగా ఉంటూ ఒకానొక సమయంలో స్టార్ హీరోయిన్ గా కొనసాగింది. ఇకపోతే త్రిష ఇండస్ట్రీలో ఎంతో మంది హీరోలతో ప్రేమ యానం కొనసాగిందని పెద్ద ఎత్తున వార్తలు వినిపించాయి.కెరియర్ మొదట్లో ఈమె నయనతార మాజీ లవర్ శింబుతో ప్రేమలో ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. అదేవిధంగా ఈమె అతనితో బ్రేకప్ చెప్పుకుని తిరిగి మరొక దర్శకుడితో నిశ్చితార్థం చేసుకుంది .ఇలా నిశ్చితార్థం అయిన తర్వాత ఈ నిశ్చితార్థాన్ని కూడా రద్దు చేసుకుంది. ఇలా నిశ్చితార్థం రద్దు చేసుకోవడానికి గల కారణాలు ఏంటి అనేది మాత్రం ఇప్పటికీ ఎవరికీ తెలియదు. ఇలా దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకుని ప్రేమలో విఫలం అయి తిరిగి వారి జీవితాలను కొనసాగిస్తున్నారని చెప్పవచ్చు.

Also Read: హ్యాట్రిక్ కాంబినేషన్ తో వస్తున్న గోపిచంద్ – డైరెక్టర్ శ్రీవాస్…

Read Today's Latest Tollywood News, Telugu News LIVE Updates on Oktelugu
oktelugu whatsapp channel
follow us
  • facebook
  • instagram
  • twitter
  • youtube

సంబంధిత వార్తలు