Samantha Ruth Prabhu : సమంత గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు. ఏమాయ చేసావే సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన సమంత తనకంటూ ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకుంది. ఈ సినిమాలో నాగచైతన్య సరసన నటించి మొదటి సినిమాతోనే సక్సెస్ ను సాధించింది. ఈ సినిమా షూటింగ్ లో సమయంలో చైతూ, సామ్ ల మధ్య స్నేహం ఏర్పడి ఆ స్నేహం ప్రేమగా ఏర్పడింది. తర్వాత ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి చేసుకొని ఆనందంగా ఉన్నారు. కానీ అనుకోకుండా ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చారు.
తమ ప్రియమైన జంట కలిసి ఉన్నారు అనుకునే లోపే విడాకుల వార్త ఇండస్ట్రీలో దుమారం రేపింది. వ్యక్తిగత కారణాల వల్ల సామ్ అనారోగ్య సమస్యలను ఎదుర్కొంది. ఓ సినిమాకు డబ్బింగ్ చెబుతూ ఆస్పత్రి బెడ్ పై ఉన్న ఫోటోను షేర్ చేసుకోవడంతో మరింత బాధ పడ్డారు ఈమె అభిమానులు. ఇక ఆరోగ్యం పట్ల శ్రద్ద పెడుతూ కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చి పూర్తి చికిత్స తీసుకుంది సామ్. ఇప్పుడు ఆమె ఆరోగ్యం కుదుటపడిందని టాక్. ఇక తాజాగా యూట్యూబ్ వేదికగా పాడ్ కాస్ట్ సిరీస్ ను నిర్వహిస్తుంది.
ఇందులో భాగంగా పలు అంశాలపై మాట్లాడుతుంది సామ్. తాజాగా తాను ఎమోషనల్ అవుతూ అభిమానులను సొంతం చేసుకోవడం చాలా సంతోషంగా ఉందని.. వారు దొరకడం నా అదృష్టం అంటూ ఆవేదన చెందింది. అయితే తన అభిమానులకు ఫ్యాషన్, వినోదం, మేకప్ వంటి వాటిపై ఆసక్తి ఉంటుందని. వారిని చూసి కొన్ని విషయాలపై అభిప్రాయం మార్చుకున్నట్లు కూడా తెలిపింది. కొత్త అంశాలపై అవగాహన వచ్చిందని తెలిపింది.
తన మాటలు కొందరి మీద ప్రభావం చూపిస్తే కూడా ఆనందమే అని.. దీని వల్ల కొంతమందిలో అయినా మార్పు వస్తే సంతోషం అని దాన్నే తాను కోరుకుంటున్నట్లు తెలిపింది సామ్. మరి సామ్ మరోసారి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. మరి చూడాలి ముందు ముందు ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటుందో సామ్..
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read MoreWeb Title: Samantha ruth prabhus emotional words on fans
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com