https://oktelugu.com/

Nayanthara: స్టార్ హీరోకి హ్యాండ్ ఇచ్చిన నయనతార… రంగంలోకి సమంత!

Nayanthara: మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి జంటగా ఓ చిత్రానికి ఆమె సైన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకుడు.

Written By:
  • S Reddy
  • , Updated On : June 13, 2024 / 12:49 PM IST

    Samantha Replaces Nayanthara

    Follow us on

    Nayanthara: లేడీ సూపర్ స్టార్ నయనతార ఓ స్టార్ హీరో సినిమా నుండి తప్పుకుందట. ఆమె స్థానంలో సమంత నటిస్తుంది అంటూ ఓ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వివాహం తర్వాత కూడా నయనతార ఇమేజ్ తగ్గలేదు. ఆమెకు క్రేజీ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. స్టార్స్ పక్కన ఆమె జతకడుతున్నారు. అలాగే లేడీ ఓరియెంటెడ్ చిత్రాలు చేస్తుంది. కాగా మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టికి జంటగా ఓ చిత్రానికి ఆమె సైన్ చేసినట్లు సమాచారం. ఈ చిత్రానికి టాలెంటెడ్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ దర్శకుడు.

    అయితే ఈ ప్రాజెక్ట్ నుండి నయనతార తప్పుకున్నారని సమాచారం. మమ్ముట్టి ప్రాజెక్ట్ పక్కన పెట్టి ఆమె యష్ కి జంటగా నటించబోతున్నారట. కెజిఎఫ్ 2 అనంతరం చాలా గ్యాప్ తీసుకున్న యష్ గత ఏడాది టాక్సిక్ టైటిల్ తో ఓ చిత్రం ప్రకటించాడు. టాక్సిక్ చిత్రానికి గీతూ మోహన్ దాస్ దర్శకత్వం వహిస్తుంది. కరీనా కపూర్, సాయి పల్లవి హీరోయిన్స్ అంటూ ప్రచారం జరిగింది. కాగా ఈ చిత్రంలో నయనతారకు ఆఫర్ వచ్చిందట.

    Also Read: Kalki Movie: కల్కి సినిమాలో దీపికా పదుకొనే క్యారెక్టర్ ఏంటి..?

    యష్ ప్రాజెక్ట్ కోసం మమ్ముట్టి చిత్రాన్ని ఆమె వదులుకున్నారని సమాచారం. యష్ పాన్ ఇండియా హీరో. టాక్సిక్ చిత్రంతో నటించడం ద్వారా మంచి రీచ్ లభిస్తుంది. కెరీర్ కి ప్లస్ అవుతుందని ఆమె భావిస్తున్నారట. నయనతార హ్యాండ్ ఇచ్చిన నేపథ్యంలో సమంతను తీసుకున్నారట. ఆమె నటించేందుకు ఒప్పుకున్నారట. ఈ మేరకు సమాచారం అందుతుంది. త్వరలో ఈ సినిమా షూటింగ్ మొదలు కానుందని సమాచారం.

    Also Read: Allu Arjun: మెగా కాంపౌండ్ లో ఒంటరైన అల్లు అర్జున్… జరగబోయే పరిణామాలు ఏంటి?

    కాగా కొన్నాళ్ళు గ్యాప్ తీసుకున్న సమంత ఇటీవల నయా ప్రాజెక్ట్ ప్రకటించింది. మా ఇంటి బంగారం పేరుతో ఈ చిత్రం తెరకెక్కుతుంది. మరొక విశేషం ఏమిటంటే… మా ఇంటి బంగారం చిత్రానికి సమంతనే నిర్మాత. ఆమె ప్రధాన పాత్ర చేస్తున్న లేడీ ఓరియెంటెడ్ మూవీ ఇది. కొత్తగా సమంత నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. అలాగే ఆమె నటించిన వెబ్ సిరీస్ హనీ బన్నీ పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటుంది. త్వరలో అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.