Allu Arjun: హీరో అల్లు అర్జున్ పై మెగా హీరోలు కోపంగా ఉన్నారని తెలుస్తుంది. 2024 ఏపీ ఎన్నికల్లో అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలపడం వివాదానికి దారి తీసింది. కొణిదెల-అల్లు కుటుంబాల మధ్య గ్యాప్ వచ్చిందనే వాదన చాలా కాలంగా వినిపిస్తుంది. గతంలో ఈ పుకార్లను అల్లు అరవింద్, చిరంజీవి ఒకటి రెండు సందర్భాల్లో ఖండించారు. 2024 సంక్రాంతి వేడుకలను అల్లు-కొణిదెల కుటుంబాలు బెంగళూరులో జరుపుకున్నారు. విబేధాల వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేశారు.
కాగా 2024 సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా పోటీ చేశాయి. జనసేన తరపున పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబడ్డారు. పవన్ కళ్యాణ్ గెలుపు కోసం మెగా హీరోలందరూ చాలా కష్టపడ్డారు. అల్లు అర్జున్ సైతం సోషల్ మీడియా వేదికగా విషెస్ తెలియజేశాడు. అయితే అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతు తెలపడం మెగా హీరోలను ఆగ్రహానికి గురి చేసింది. పరోక్షంగా అల్లు అర్జున్ వైసీపీ పార్టీకి మద్దతు ప్రకటించినట్లు అయ్యింది.
దీనికి నిరసనగా నాగబాబు పోలింగ్ ముగిసిన సాయంత్రం అల్లు అర్జున్ పై ఇండైరెక్ట్ ట్వీట్ వేశాడు. ప్రత్యర్థులకు పని చేసేవాడు మా వాడైనా బయటవాడే అని కామెంట్ చేశాడు. నాగబాబు ట్వీట్ కి అల్లు అర్జున్ ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. సోషల్ మీడియాలో ఆయన్ని ట్రోల్ చేశారు. దాంతో నాగబాబు సదరు ట్వీట్ డిలీట్ చేశాడు. తాజాగా సాయి ధరమ్ తేజ్ సోషల్ మీడియాలో అల్లు అర్జున్ ని అన్ ఫాలో చేయడం చర్చకు దారి తీసింది. ఇంస్టాగ్రామ్, ట్విట్టర్ అకౌంట్స్ లో ధరమ్ తేజ్ అల్లు అర్జున్ ని అన్ ఫాలో కొట్టాడు.
Also Read: Akira Nandan: పవన్ ప్రమాణస్వీకారం స్పెషల్… సోషల్ మీడియాను షేక్ చేస్తున్న అకీరా లుక్!
ఈ పరిణామాలు అల్లు అర్జున్ పై మెగా హీరోల్లో ఉన్న ఆగ్రహాన్ని తెలియజేస్తున్నాయి. మరోవైపు అల్లు అర్జున్ ఇదే కోరుకుంటున్నాడు. మెగా హీరో ట్యాగ్ వదిలించుకోవాలి అనేది అతడి ఆలోచన. అందుకే కొన్నేళ్లుగా అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో సపరేట్ ఫ్యాన్ బేస్ మైంటైన్ చేస్తున్నాడు. ఏది ఏమైనా అల్లు అర్జున్ ఒంటరి అయిన సూచనలు గట్టిగా కనిపిస్తున్నాయి. కొన్నాళ్లుగా జరుగుతున్న కోల్డ్ వార్ తారా స్థాయికి చేరింది.