CM Chandrababu: జగన్ ఫోటోకు చంద్రబాబు యాక్సెప్ట్.. ఏపీకి కావాల్సింది అదే కదా?

ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకం చేస్తారు.

Written By: Dharma, Updated On : June 13, 2024 12:43 pm

CM Chandrababu

Follow us on

CM Chandrababu: తమిళనాడులో స్టాలిన్ తరహాలో చంద్రబాబు ఏపీలో నిర్ణయాలు తీసుకుంటున్నారు. గతంలో తమిళనాడులో రివేంజ్ రాజకీయాలు నడిచేవి. ముందు ప్రభుత్వం చేపట్టిన మంచి పథకాలను సైతం రద్దు చేసేవారు. ప్రతిపక్ష నేతలపై కేసులతో వేధించేవారు. అయితే స్టాలిన్ సీఎం అయిన తర్వాత పరిస్థితి మారింది. ముందుప్రభుత్వ నిర్ణయాలను, పథకాలను గౌరవించారు. కొనసాగించారు స్టాలిన్. ఇప్పుడు అదే బాటలో చంద్రబాబు నడవడం విశేషం. గత ఐదు సంవత్సరాలుగా జగన్ ముందు ప్రభుత్వ పథకాలను రద్దు చేసిన సంగతి తెలిసిందే. చివరకు ప్రభుత్వ కార్యాలయాల రంగులను సైతం మార్చేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఆ పని చేయడం లేదు. చివరకు జగన్ ఫోటోను కూడా తొలగించే ప్రయత్నం చేయడం లేదు.

ఏపీ సీఎం గా చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన సచివాలయంలో బాధ్యతలు స్వీకరిస్తారు. కీలకమైన ఐదు ఫైళ్లపై సంతకం చేస్తారు. అదే సమయంలో అత్యవసర విభాగాలకు సంబంధించి నిర్ణయాలను తీసుకుంటున్నారు. ఈరోజు నుంచి పాఠశాలలు ప్రారంభమైన సంగతి తెలిసిందే. స్కూల్ విద్యార్థులకు అందజేస్తున్న విద్యా కానుక కిట్లపై ఇప్పటికే జగన్ బొమ్మలను ముద్రించారు. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి అందించాలన్న కోణంలో.. రెండు నెలల కిందటే వాటిని ముద్రించి అందించేందుకు సిద్ధం చేశారు. అయితే జగన్ బొమ్మ ఉన్నా సరే వాటిని విద్యార్థులకు పంపిణీ చేయాలని చంద్రబాబు ఆదేశించారట. ఈ విషయాన్ని టిడిపి తన అధికారిక ఎక్స్ లో ట్విట్ చేసింది.

‘ చంద్రబాబు గారికి పేరు వస్తుందని అన్న క్యాంటీన్లను రద్దుచేసి పేదల కొడుకు పుట్టిన గత ముఖ్యమంత్రి కి, చంద్రబాబు గారికి ఎంత తేడా? ప్రజాధనం వృధా కాకూడదు. పాలనలో పగ ప్రతీకారాలకు చోటు ఉండకూడదు అంటూ.. జగన్ బొమ్మ ఉన్న స్కూల్ పిల్లల కిడ్స్ ను అలాగే పంపిణీ చేయమని ఆదేశించిన చంద్రబాబు గారు’ అంటూ ఆ పోస్టులో పెట్టింది. చెప్పిన మాట ప్రకారమే స్టేట్ ఫస్ట్. కక్ష సాధింపు, పగ, తుగ్లక్ నిర్ణయాలు ఉండవు. అంటూ టిడిపి శ్రేణులు గర్వంగా చెబుతున్నాయి. యాట విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యా కానుక కిట్లు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కిట్లలో పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్స్, బ్యాగులు, బూట్లు, బెల్ట్, యూనిఫామ్ క్లాత్, డిక్షనరీ అందిస్తారు.

ఏటా జగనన్న విద్యా కానుక పేరిట కిట్లను అందించారు. ఈ ఏడాది కూడా అదే మాదిరిగా అందించాలని డిసైడ్ అయ్యారు. నెల రోజుల కిందటే మండలాలకు పంపించారు. ప్రస్తుతం ప్రభుత్వం మారింది. అయితే విద్యా కానుక కిట్ల పై జగన్ బొమ్మ ఉంది. దానిని మార్చి చంద్రబాబు బొమ్మ వేయాలంటే ఖర్చుతో కూడుకున్న పని. అందుకే చంద్రబాబు వద్దని వారించారట. జగన్ బొమ్మ ఉన్నా పరవాలేదని సముదాయించారట. అందుకే జగన్ బొమ్మతో గిట్ల పంపిణీకి అధికారులు చర్యలు చేపడుతున్నారట.