Samantha: నాగ చైతన్య తో విడాకులు తీసుకున్న తర్వాత సమంత పలు సందర్భాల్లో, పలు ఇంటర్వ్యూస్ లో ఈ విషయం పై రియాక్ట్ అయ్యింది. కొన్ని ఇంటర్వ్యూస్ లో నాగ చైతన్య పై కోపాన్ని స్పష్టంగా తెలియజేస్తే , మరికొన్ని ఇంటర్వ్యూస్ లో ఆ ఫేస్ లో తాను ఎదురుకున్న బాధని , విడాకులు తీసుకున్న కొత్తల్లో పడిన మానసిక వేదనని చెప్పుకొచ్చింది. అయితే ఇప్పుడు ఆమె రాజ్ నిడిమోరు ని రెండవ పెళ్లి చేసుకుంది , గర్భం కూడా దాల్చేసింది. మరోపక్క నాగ చైతన్య కూడా ప్రముఖ యంగ్ హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ని పెళ్లి చేసుకున్నారు. ఇద్దరు తమ వ్యక్తిగత జీవితాన్ని ఇప్పుడు సంతోషంగానే గడుపుతున్నారు. అయితే సమంత నిన్న ‘మా ఇంటి బంగారం’ సక్సెస్ మీట్ లో రిలేషన్ గురించి నేటి తరం స్త్రీలకూ మీ నుండి ఎలాంటి సలహాలు ఇస్తారు అన్న ప్రశ్నకు ఆమె ఇచ్చిన సమాధానం ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యింది.
ఆమె మాట్లాడిన ఈ మాటలు కేవలం నేటి తరం స్త్రీలకు మాత్రమే కాదు, శోభిత ధూళిపాళ్ల కు కూడా సూచనలు ఇస్తున్నట్టుగా అనిపించింది. జీవితం లో మన మీద మనకు ఆత్మా విశ్వాసం ఉండాలని , కానీ మన మీద ఆత్మవిశ్వాసం లేకుండా, ఎదుటి వ్యక్తి నీ జీవిత భాగస్వామి అయ్యినప్పుడు మాత్రమే నీ జీవితం సంపూర్ణం అవుతుందని అనుకుంటే పప్పులో కాలేసినట్టే , అలాంటి పనులు చేయకండి అంటూ రిలేషన్ షిప్ లోకి అడుగుపెట్టిన వాళ్లకు చెప్పుకొచ్చారు సమంత. ఇది ఒక రకంగా తన అనుభవాలను దృష్టిలో పెట్టుకొనే ఆమె ఈ కామెంట్స్ చేసినట్టుగా అనిపించింది. అంటే నాగ చైతన్య మీద పూర్తిగా ఆధారపడకు , అలా చేస్తే అతని మీద నీకు అంచనాలు పెరిగిపోతాయి , వాటి వల్ల గొడవలు ఏర్పడుతాయి అని పరోక్షంగా చెప్పకనే చెప్పినట్టు తెలుస్తోంది.
ఇదంతా పక్కన పెడితే అప్పట్లో సమంత ని నాగ చైతన్య పిల్లలు కావాలని కోరినట్టు , అందుకు సమంత నాకు ఇంకా చాలా పెద్ద కెరీర్ ఉంది , అప్పుడే పిల్లలు ఇష్టం లేదు అని చెప్పినట్టు , ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవలు ఏర్పడడం వల్లే విడాకులు తీసుకున్నట్టు , ఇలా ఎన్నో రకాల ప్రచారాలు జరిగాయి. కానీ సమంత తో రాజ్ ని పెళ్ళాడి ఏడాది కూడా పూర్తి అవ్వలేదు , అప్పుడే ఒక బిడ్డకు జన్మని ఇవ్వబోతుంది. దీనిని బట్టీ తప్పు ఎటు వైపు ఉందో మీరే ఆలోచించండి అంటూ సమంత ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నాగ చైతన్య , శోభిత లకు పెళ్లి జరిగి ఏడాది దాటింది , కానీ ఇప్పటి వరకు శోభిత గర్భం దాల్చకపోవడం గమనార్హం.
