Samantha: సమంత గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. సినిమాల్లో తన నటనతో.. వైవాహిక జీవితంలో విడాకులతో అందరికీ పరిచయమే. ఇక రీసెంట్ గా ఈమెకు సంబంధించిన ఓ వార్త వైరల్ గా మారింది. గతంలో జరిగిన ఓ ఇన్సిడెంట్ గురించి సమంత తెలిపిన విషయాలు వింటే ఆమె ఎలాంటి పరిస్థితుల నుంచి బయటపడిందో అర్థం చేసుకోవచ్చు. రీసెంట్ గా సమంత కొన్ని విషయాలను పంచుకుంది. ఈ వివరాలు ఏంటో చదివేయండి.
మయోసైటిస్ వ్యాధి తగ్గుతుంది అనుకుంటే అదే సమస్య బాధ పెట్టిందట. మానసికంగా ధృఢంగా ఉంటే దేనినైనా జయించవచ్చు అనుకొని సిటాడెల్ కు సంతకం చేసిందట. కానీ అదే సమయం చాలా కష్టంగా అనిపించిందట. శారీరకంగా బలహీనంగా ఉన్నా సమంతకు భారీ యాక్షన్ సన్నివేశాలు ఉంటాయని ముందే చెప్పారట మేకర్స్. అయినా కూడా ఒకే అనేసిందట. ఇందులో భాగంగానే ఓ సారి షూటింగ్ జరుగుతున్న సమయంలో శక్తి పూర్తిగా నశించి కళ్లు మూతలు పడ్డాయట సమంతకు.
బాగా అలిసిపోయి స్పృహ కూడా తప్పి కింద పడిపోయిందట సామ్. ఇక ఈ సంఘటనను చూసి సెట్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా కంగారు పడ్డారట. ఆ తర్వాత కాసేపటికి కోలుకున్న సామ్ ఒక్కసారిగా కుప్పకూలిపోవడం అంటే ఇదేనేమో అనుకుందట. ఇక ఈ సిరీస్ కోసం చాలా కష్టపడ్డానని.. అందుకే ఈ సిరీస్ చాలా స్పెషల్ అని తెలిపింది. ప్రతి ఒక్కరి జీవితంలో చీకటి రోజులు ఉంటాయని.. వాటికి అందరూ సిద్దంగా ఉండాలని వివరించింది. ఓర్పుతో ముందుకు వెళ్తే తర్వాత కెరీర్ అందంగా ఉంటుందని సలహా ఇచ్చింది.
సమంత నాగచైతన్య విడాకుల తర్వాత సమంత ఎంత బాధ పడిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ బాధ నుంచి బయటపడడానికి కొన్ని రోజులు ఆధ్యాత్మిక చింతనలోకి వెళ్లింది. అప్పుడు సినిమా అవకాశాలు కూడా మెండుగా వచ్చాయి. అంతేకాదు మయోసైటిస్ కూడా అదే సమయంలో బాధ పెట్టింది. విడాకులు, మయోసైటిస్, సినిమాలు ఇలా అన్నింటిని ఎదుర్కొని మళ్లీ పాత సామ్ లాగా అందరి ముందుకు వచ్చింది అంటే.. ఆమె ఏ రేంజ్ లో ఓర్పుతో ముందుకు వచ్చింది అర్థం చేసుకోవచ్చు.