Samantha: హీరోయిన్ సమంత రెండేళ్లుగా సింగిల్ స్టేటస్ మైంటైన్ చేస్తుంది. హీరో నాగ చైతన్యతో విడిపోయాక మళ్ళీ పెళ్లి చేసుకోలేదు. ఆమె రహస్యంగా ఎవరితోనైనా డేటింగ్ చేస్తున్నారా అనే అనుమానాలు ఉన్నాయి. సమంత-నాగ చైతన్య 2018లో ప్రేమ వివాహం చేసుకున్నారు. నాలుగేళ్ళ వైవాహిక జీవితం అనంతరం మనస్పర్థలతో విడిపోయారు. 2021 అక్టోబర్ లో అధికారికంగా విడాకుల ప్రకటన చేశారు. అంతకు ముందే వారు విడివిడిగా ఉంటున్నారు.
విడాకుల సమయంలో సమంత మీద ఎఫైర్ రూమర్స్ వచ్చాయి. సమంత పర్సనల్ స్టైలిస్ట్, ఫ్యాషన్ డిజైనర్ ప్రీతమ్ జుకల్కర్ తో ఆమె సన్నిహితంగా ఉంటున్నారని వార్తలు వచ్చాయి. నాగ చైతన్య విడాకులు ఇవ్వడానికి ఇది కూడా కారణమంటూ కథనాలు వెలువడ్డాయి. ప్రీతమ్ జుకల్కర్ తో సమంత క్లోజ్ గా ఉన్న ఫోటోలు వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో ప్రీతమ్ జుకల్కర్ ట్రోల్స్ కి గురయ్యాడు. నాగ చైతన్య ఫ్యాన్స్ అతన్ని ఏకిపారేశారు.
సోషల్ మీడియా వేధింపులు తట్టుకోలేక ప్రీతమ్ జుకల్కర్ వివరణ ఇచ్చారు. సమంత నాకు అక్కలాంటిది. సమంతతో నా బంధం ఎలాంటిదో నాగ చైతన్యకు తెలుసంటూ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇకపై నన్ను వేధించడం మానేయాలని కోరుకున్నాడు. ఇక అప్పుడప్పుడు సమంత పై ఎఫైర్ రూమర్స్ వినిపించాయి. తాజాగా ఆమె ఓ అబ్బాయితో కలిసి కనిపించారు. దీంతో ప్రియుడిని పరిచయం చేశారన్న ఊహాగానాలు మొదలయ్యాయి.
చికిత్స కోసం అమెరికా వెళ్లిన సమంత న్యూయార్క్ నగరంలో చేరింది. అక్కడ ఓ జిమ్ లో వర్క్ అవుట్ చేస్తున్న ఫోటో షేర్ చేసింది. ఆ ఫోటోలో మరో వ్యక్తి ఉన్నాడు. అతడు ముఖం కనిపించకుండా అటు వైపు తిరిగి ఉన్నాడు. వెనుక నుండి చూస్తుంటే అతడు చక్కని రూపం కలిగిన వ్యక్తి అనిపిస్తున్నాడు. దీంతో అతడు సమంత లవర్ కావచ్చు. ఈ విధంగా పరిచయం చేసిందంటూ పుకార్లు మొదలయ్యాయి. ఇక సమంత నటించి ఖుషి విడుదలకు సిద్ధంగా ఉంది. విజయ్ దేవరకొండ హీరోగా శివ నిర్వాణ తెరకెక్కించాడు. సెప్టెంబర్ 1న థియేటర్స్ లో దిగుతుంది.
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Read MoreWeb Title: Samantha introduced her boyfriend
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com