OTT Movies: ప్రతీ వారం లాగానే ఈ వారం కూడా ఓటీటీ ఆడియన్స్ ని అలరించేందుకు కొత్త సినిమాలు మన ముందుకొచ్చాయి. తెలుగు , తమిళం , హిందీ, మలయాళం భాషలకు సంబంధించిన సినిమాలను మన ఆడియన్స్ ఓటీటీ లో బాగా ఆదరిస్తారు అనే విషయం తెలిసిందే. నిన్న ఓటీటీ లో విడుదలైన 5 కొత్త సినిమాల గురించి నేడు మనం మాట్లాడుకోబోతున్నాయి.
ఐయామ్ గేమ్:
మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరో గా నటించిన ఈ లేటెస్ట్ స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ రీసెంట్ గానే థియేటర్స్ లో విడుదలై యావరేజ్ రేంజ్ రెస్పాన్స్ ని సొంతం చేసుకుంది. కాయదు లోహర్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా తెలుగు , తమిళం , హిందీ, కన్నడం మరియు మలయాళం భాషల్లో నిన్న జియో హాట్ స్టార్ లో విడుదలైంది. ఈ సినిమాకు మహాస్ హిదయత్ దర్శకత్వం వహించారు. వీరితో పాటు మిస్కిన్ , ఆంటోని వర్గీస్ , సంయుక్త విశ్వనాథన్ , జయ సుధా తదితరులు కీలక పాత్రలు పోషించారు.
బా బా బ్లాక్ షీప్:
టాలీవుడ్ న్యూ ఏజ్ లవ్ స్టోరీ గా రీసెంట్ గానే థియేటర్స్ లోకి విడుదలైన ఈ చిత్రం నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో , సన్ నెక్స్ట్ లలో విడుదలైంది. ‘లవ్ స్టోరీ’ మూవీ ఫేమ్ అక్షయ్ లగుసాని , విష్ణు ఓయ్ , ఉపేంద్ర లిమాయె, తిను ఆనంద్ , కార్తికేయ , శుభలేఖ సుధాకర్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. యూత్ ఆడియన్స్ కి మంచిగా టైం పాస్ అయ్యే చిత్రమిది, అసలు మిస్ అవ్వకండి.
ది వాన్ :
ప్రముఖ బాలీవుడ్ హీరో సిద్దార్థ్ మల్హోత్రా హీరో గా నటించిన ఈ ఫాంటసీ థ్రిల్లర్ నిన్న అమెజాన్ ప్రైమ్ వీడియో లో విడుదలైంది. మిల్కీ బ్యూటీ తమన్నా ఈ చిత్రం లో హీరోయిన్ గా నటించింది. దీపక్ కుమార్ మిశ్రా ఈ చిత్రానికి దశకత్వం వహించారు. సునీల్ గ్రోవర్ , మనీష్ పాల్ , శ్వేతా తివారీ , అనూప్ సోనీ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన ఈ సినిమా హిందీ భాషలో అందుబాటులో ఉంది.
ది గ్రాండ్ మాస్టర్ :
స్పోర్ట్స్ డ్రామా గా రీసెంట్ గానే తమిళం లో విడుదలైన ఈ ఎమోషనల్ డ్రామా శుక్రవారం నుండి సన్ నెక్స్ట్ లో అందుబాటులోకి వచ్చింది. ప్రస్తుతానికి ఈ చిత్రం తమిళం లో మాత్రమే అందుబాటులో ఉంది. త్వరలోనే తెలుగు తో పాటు , ఇతర ప్రాంతీయ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులోకి రానుంది.
బ్లైండ్ గేమ్:
బాలీవుడ్ లో హీరో గా , క్యారెక్టర్ ఆర్టిస్టుగా తనకంటూ ఒక ప్రత్యేకమైన మార్కు క్రియేట్ చేసుకున్న అర్జున్ రాంపాల్ హీరో గా నటించిన చిత్రమిది. క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ లో తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం రోజున జీ 5 లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈ సినిమా కేవలం హిందీ భాషలో మాత్రమే అందుబాటులో ఉంది. మనం ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ తో చూడొచ్చు.
ఈ సినిమాల్లో మీకు బాగా ఇష్టమైన సినిమా ఏంటో కామెంట్ చేయండి , మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్ స్క్రైబ్ చేసుకోండి.